మన పొనుగుపాడు వెబ్‌సైట్‌కు స్వాగతం

పొనుగుపాడు గ్రామం, ఫిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, (అమరావతి) Pin:522549.

welcome to manaponugupadu.com  

మన పొనుగుపాడు వెబ్‌సైట్‌ ఉద్దేశ్యం.

“జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ” అన్నారు మన పెద్దలు.అంటే మనం పుట్టి పెరిగిన ఊరు స్వర్గంతో సమానమన్నమాట.

కన్నతల్లి మీదా, పుట్టి పెరిగిన ఊరిమీద ఉన్న మమకారం,తీపి గుర్తులు మనం జీవించేంత  వరకూ మనల్ని అంటి పెట్టుకునే ఉంటాయి. దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నాసరే మన ఊరిని ఒకసారి తలుచుకుంటేనే చాలు తియ్యటి జ్ఞాపకాలు మన కళ్ళముందు తేలియాడతాయి.ఆ కమ్మటి జ్ఞాపకాలను, ఆ మధుర స్మృతులను పదిమందితో పంచుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలా వచ్చిన ఆలోచనకు కార్యరూపమే ఈ మనపొనుగుపాడు.కామ్ వెబ్‌సైట్‌.

మన గ్రామం పూర్వాపరాలు , పెద్ద వారి, మరియు ముఖ్యమైన వారి జీవిత విశేషాలను, గ్రామ ప్రతిష్ఠను ముందు తరాల వారికి తెలియ చేయాలనే చిన్ని సంకల్పం మాత్రమే.పొనుగుపాడుకు చెందిన ముఖ్యమైన వ్యక్తుల వివరాలు, మీ తల్లిదండ్రుల ఫొటోలతో,  వంశవృక్షం వివరాలు సవివరంగా తెలిపితే ఈవెబ్‌సైట్‌లో పోష్టు చేయబడునని సవినయంగా తెలియ చేయడమైనది.

మన గ్రామం గురించి తెలుగులో అందరికీ సమాచారం అందివ్వాలన్నదే మా ప్రధాన ఆశయం. మీరూ ఈ మహా యజ్ఞంలో గొప్ప మనసుతో పాలుపంచుకుని తలో చెయ్యీ  వేసి మన ఊరి గురించి సమాచారం మాకు అందించి  ప్రేరణగా నిలుస్తారని ఆశిస్తున్నాము.


తాజా విశేషాలు


పొనుగుపాడు ఉన్నత పాఠశాల 68వ వార్షికోత్సవ విశేషాలు

చిత్రమాలిక మన పొనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 68వ వార్షికోత్సవ విశేషాలు 02.03.2019 శనివారంనాడు పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో, ప్రధాన ఉపాధ్యాయురాలు టి. పద్మావతి ...
Read More

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి 103వ వార్షికోత్సవ సందర్బంగా జరిగిన కూచిపూడి నృత్య కార్యక్రమాల వీడియోలు

అభినయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ -2019 కార్యక్రమాల వీడియాలు ...
Read More

శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి 103వ వార్షికోత్సవ సందర్బంగా జరిగిన కార్యక్రమాల వీడియోలు

1.శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి అభిషేకం సందర్బంగా గ్రామంలో జరిగిన గ్రామోత్సవ వీడియోలు. 2.శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి జరిగిన అభిషేకం వీడియో 3.శ్రీ భద్రకాళీ సమేత ...
Read More

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి 103వ వార్షిక మహోత్సవ ఆహ్వానం

శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి 103వ వార్షిక మహోత్సవంనకు అందరూ తరలరండి. ఆహ్వాన పత్రిక, కార్యక్రమాల వివరాలు ...
Read More

ఉన్నత పాఠశాల 68వ వార్షికోత్సవం ఆహ్వానం.

అందరికి ఆహ్వానం ప్రతి సంవత్సరం మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం జరిగే సంగతి మనందరకు తెలుసు.అలాగే 68వ వార్షికోత్సవం ది.02.03.2019 శనివారం జరుగుతుందని మీ ...
Read More

శశిధర్, హష్మిల వివాహం సందర్బంగా శుభాకాంక్షలు

మన పానుగుపాడు గ్రామానికి చెందిన, మనందరికి చిరపరిచితులైన వంకాయలపాటి శివరామకృష్ణయ్య, కీ.శే. సీతామహలక్ష్మమ్మ గార్ల మనుమడు, కోట్లింగయ్య, రాధ దంపతుల ఏకైక పుత్రుడు చి. శశిధర్, చి.ల.సౌ ...
Read More
powered by rekommend.io