ఉగాది శుభాకాంక్షలు.

ముందుగా దేశ విదేశాలలో ఉన్న మన తెలుగు వారందరికి  శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

 

ఉగాది అంటే ఏమిటి?

పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్ఠి కోసం తన దేహాన్ని రెండుగా విభజించుకొని ఒకభాగం మానవుడు (పురుషుడు) గా, రెండవభాగం మానవతి (స్రీ) గా మారి, ఆ పురుషుడు ఆ ‘స్త్రీ’తో  ఛైత్ర శుద్ధ పాఢ్యమి (యుగాది) నాడు సంగమించి బ్రహ్మ తన సృష్టిని ప్రారంభించాడని, అందుకే దీనిని ‘యుగాది’ అని వ్యవహరించేవారని తెలుస్తుంది. కాలాంతరంలో ఆ మాటే ‘ఉగాది’ గా రూపాంతరం చెంది ఒక పండుగగా మారిందని అందరి విశ్వాసం.

ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారం ముగియగానే కలియుగారంభం ఉగాదితో మొదలయ్యింది. కలియుగం క్రీస్తుపూర్వం ఫిబ్రవరి 18, 3102 నాడు అంటే 5120 సంవత్సరాలు క్రితం ప్రారంభం అయినట్లుగా ఖగోళ శాస్త్రం, పురాణాల ప్రకారం తెలుస్తుంది.

ఉగాది రోజు నుండి వసంత ఋతువు మొదలవుతుంది. ప్రకృతి ఒక కొత్త రూపాన్ని సంతరించుకొని మళ్ళీ చిగురించి కొత్త కొత్త అందాలతో అలరిస్తుంది. ఉగాది పండగ  అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి, తలంటు స్ధానం, కొత్త బట్టలు.

ఏది ఏమైనా మనందరం గర్వంగా జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఉగాది పండగ ఒకటి అని చెప్ప వచ్చు.

ఉగాది పచ్చడి అసలు పరమార్ధం.

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు. అనే షడ్రుచులు కలసిన సమ్మేళనం. పచ్చడిని పూజలో నైవేధ్యంగా పెట్టిన తరువాత మనం ప్రసాదంగా స్వీకరించాలి.

  • బెల్లం తీపి ఆనందానికి సంకేతం,
  • ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం.
  • వేప పువ్వు చేదు భాధ కలిగించే అనుభవాలుకు సంకేతం,
  • చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులుకు సంకేతం,
  • పచ్చి మామిడి   పులుపు కొత్త సవాళ్లుకు సంకేతం,
  • మిరపపొడి కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులుకు ఎదురొడ్డటానికి సంకేతం.

అంటే మనకు ప్రతి సంవత్సరములో సంభవించే కష్టసుఖాలు, మంచిచెడులు సంయమనంతో స్వీకరించాలనే భావన మన మనసులో కలుగ చేస్తుంది. మానవుడు “ఆపదల్లో కుంగిపోకుండా, సంపదల్లో పొంగిపోకుండా, విజయాలు సాధిస్తున్నప్పుడు ఒదిగి ఉంటూ, వైఫల్యాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడుతూ”  జీవితం సాగించాలని దీని అర్థం.

Tagged with: , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*