[vc_row][vc_column][vc_column_text]
మానవ సేవే మాధవసేవ
పొనుగుపాడు గ్రామంలో ది.09.04.2017 ఆదివారం జిల్లాపరిషత్ ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగిన సంగతి మన అందరకు తెలుసు.
ఈ కార్యక్రమం కీ.శే.కోయ వెంకటేశ్వర్లు, కీ.శే. వంకాయలపాటి సీతామహలక్ష్మి గారల జ్ఞాపకార్ధం నిర్వహించబడింది.
సాయి సద్గురు సేవా సంస్థ, నరసరావుపేట వారి సౌజన్యంతో, యన్.ఆర్.ఐ. ఆసుపత్రి, చినకాకాని వారు సారధ్యం వహించారు.
గ్రామ పెద్దల సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్దుల సంఘం వారి నేత్రత్వంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి సర్పంచ్ మాధవరావు, గుంటుపల్లి జగన్నాధం (బెస్ట్ సి.ఇ.ఒ ఆఫ్ ది మెన్ ఆప్ యూరఫ్ కంట్రీస్), యన్.ఆర్.ఐ. ఆసుపత్రి డాక్టరు కృష్ణ గారలు ముందుగా కార్యక్రమాన్ని ప్రారంబించారు.
డాక్టర్లు కృష్ణ,శ్రీదేవి,లక్ష్మి తదితరులు రోగులను పరిక్షించారు. హాస్పటల్ సిబ్బంది తరుపున నేరెళ్ల సుబ్బరావు కార్యక్రమాన్ని పర్వేక్షించారు.
అల్పాహారం, మంచినీరును రోగులకు నిర్వహకులు కోయ రామారావు, వంకాయలపాటి కోట్లింగయ్య తదితరులు ఉచితంగా అందచేసారు.
ఈ కార్యక్రమానికి గుంటుపల్లి వెంకటేశ్వరరావు, వలి మాష్టరు, కొంగర రాఘవయ్య, తదితరులు సహాయ సహకారాలు అందిచ్చారు.ఈ శిబిరానికి పొనుగుపాడు మరియు చుట్టుప్రక్కల గ్రామాలనుండి 200 మంది కంటి పరిక్షలు నిమిత్తం హాజరైయ్యారు.
వీరిలో 110 మంది రోగులకు అవసరమైన శస్త్ర చికిత్సలు ఉచితంగా చేసారు.వీరందరికి కళ్లజోడ్లు ఉచితంగానే అందిస్తున్నారు.
కార్యక్రమం ఫొటోగ్యాలరీ
[/vc_column_text][vc_media_grid grid_id=”vc_gid:1492795756328-695a9109-79f5-3″ include=”12662,12663,12664,12665,12666,12667,12668,12669,12670,12671,12672,12673″][/vc_column][/vc_row]