పొనుగుపాడు ఉన్నత పాఠశాల 68వ వార్షికోత్సవ విశేషాలు

చిత్రమాలిక
Slider

మన పొనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 68వ వార్షికోత్సవ విశేషాలు

02.03.2019 శనివారంనాడు పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో, ప్రధాన ఉపాధ్యాయురాలు టి. పద్మావతి పర్వేక్షణలో జరిగినవి.ఉదయం గం.09.00లకు  టి. పద్మావతి ప్రధాన ఉపాధ్యాయురాలు ఆధ్వర్యంలో  బొట్ల అమరయ్య (యం.పి.టి.సి) వారిచే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది.జండా వందన కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయని, ఉపాద్యాయులు, మాజీ సర్పంచ్ మాధవరావు,తదితర గ్రామపెద్దలు  హజరైయ్యారు.

సాయంత్రం గం.04.00లకు పాఠశాల పూర్వ విధ్యార్ది  కొరిటాల శేషగిరిరావు అధ్యక్షతన పూర్వ విద్యార్దుల సంఘ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పూర్వ విద్యార్దుల సంఘ అధ్యక్షుడు కోయ రామారావు, పూర్వ విద్యార్దులు గుంటుపల్లి జగన్నాధరావు,గేరా భరతకుమార్, మాగులారి బసవాచారి, కొరిటాల శేషగిరిరావు, ఈదర హరిబాబు, పాతూరి సూర్యనారాయణ, గుంటుపల్లి వెంకటేశ్వరరావు, షేక్ మొహిద్దీన్ పీరా, వంకాయలపాటి కోట్లింగయ్య, నేరేళ్ల సుబ్బారావు తదితర పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్దిని గురించి పలువురు ఈ సమావేశంలో చర్చించారు. పాఠశాలలో విద్యార్ధినీ, విద్యార్ధుల సంఖ్యా బలం పెంచటానికి, ఇతర వసతులు గురించి పాతూరి సూర్యనారాయణ, తదితర  పూర్వ విద్యార్ధులు తగు సూచనలు చేసారు. కోశాధికారి షేక్ మస్తానువలి నివేదికను చదివి వినిపించారు.

ఆ తరువాత సాయంత్రం గం.6-00లకు జరిగిన పాఠశాల వార్షికోత్సవసభకు పూర్వ విద్యార్ధి, కిష్ ట్రష్టు వ్యవస్థాపకులు, విశ్రాంత విద్యాబోధకులు కొరిటాల శేషగిరిరావు అధ్యక్షత వహించారు.ముఖ్య అతిధిగా గుంటూరు జిల్లా ప్రదానోపాధ్యాయుల జిల్లా సంఘం ప్రెసిడెంటు ఎం.యస్.ఆర్.కె.ప్రసాదు హాజరయ్యారు. అతిధులుగా గేరా భరతకుమార్,గుంటుపల్లి జగన్నాధం. కొరిటాల శేషగిరిరావు,మాగులూరి బసవాచారి, యర్రా రామారావు,మాజీ సర్పంచ్ మాధవరావు,యం.పి.టి.సి బొట్ల అమరయ్య హజరయ్యారు.

ఉపాధ్యాయిని యం.డి.అనీషా ఫాతిమా  అతిధులను సభకు పరిచయం చేసారు. ఆతరువాత ప్రధానోపాద్యాయురాలు టి. పద్మావతి పాఠశాల పరిస్ధితిని గురించి వివరించారు. 

పాఠశాల పూర్వ విద్యార్ధులు సంఘం ద్వారా పాఠశాల అభివృద్దికి, పేద విద్యార్దుల విద్యా అభివృద్దికి చేస్తున్న సేవలను, కృషిని గురించి చెప్పారు.

ఇంకా సమావేశంలో పూర్వ విద్యార్దుల సంఘం అధ్యక్షులు కోయ రామారావు, కొరిటాల శేషగిరిరావు, ఎం.యస్. ఆర్.కె.ప్రసాదు, గేరా భరతకుమార్, కొరిటాల శేషగిరిరావు,మాగులూరి బసవాచారి, యర్రా రామారావు, తదితరులు, పాఠశాల అభివృద్దిని గూర్చి, విద్యార్ధినీ,విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు.

సమావేశంలో డి.అరోరారావు హిందీ ఉపాద్యాయులును పూర్వ విద్యార్ధుల సంఘం తరుపున సత్కరించారు.

ప్రోత్సాహక బహుమతులు పంపిణీ

ఈకార్యక్రమంలో దాతలు నుండి సేకరించిన 60 వేల రుపాయలు చదువులో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసిన బీద విద్యార్థిని, విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అతిధుల చేతులమీదుగా అందించారు. 

గత సంవత్సరం పదవ తరగతిలో 9.7 పాయింట్లు సాధించి, పాఠశాల ప్రధమ ర్యాంకు పొందిన కుమారి సేవా బార్గవికి  రు25,000/-లను,  మిగిలిన 15 మంది విద్యార్దినీ విద్యార్దులకు రు35,000/- లు పూర్వ విద్యార్ధుల సంఘం తరుపున దాతలు నుండి సేకరించిన ప్రోత్సాహక బహుమతులు నగదుగా అందచేయుటం జరిగింది.

అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడి నవి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న  విద్యార్ధినీ విద్యార్థులుకు పాఠశాల ప్రధానోపాధ్యాయిని టి. పద్మావతి బహుమతులు అందచేసారు.  కార్యక్రమంలో ఉపాధ్యాయులు యం.డి.అనీషా ఫాతిమా, కె.శ్రీలక్ష్మి, పి.జోష్ మేరీ, బి.ఆదిలక్ష్మి శైలజ, టి.తిరుపతయ్య, వై.శ్రీనివాసరావు, డి. అరోరారావు, యం. శ్రీనివాసరావు, కె.కోటేశ్వరి, మస్తానువలి తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్దులు శివయ్య మాష్టరు, క్రోసూరి సుబ్బారావు, కోయ వెంకట్రావు,యర్రమాసు నాగేశ్వరరావు, వక్కంటి వెంకటేశ్వరరావు,గేరా ఆనంద్,విద్యార్దిని విద్యార్దుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు హాజరైయ్యారు.

ఈదర హరిబాబు, క్రోసూరి బాలరాజు, బాలకృష్ణ, కొంగర రాఘవయ్య, యామాని రామారావు, గుంటుపల్లి వెంకటేశ్వరరావు, పూర్ణచంద్రరావు, వక్కంటి వెంకటేశ్వరరావు, దాడి రాదాకృష్ణ, కట్టా సుబ్బారావుల సహకారంతో  కార్యక్రమ పర్వేక్షణ జరిగింది.చివరగా పాఠశాల ఉపాధ్యాయులు యం. శ్రీనివాసరావు వందన సమర్పణ గావించారు. 

Tagged with: , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*