మన గ్రామ వనాన్ని- మనమే రక్షించుకుందాం

వృక్షో రక్షితి రక్షిత:

(అంటే  చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని రక్షిస్తుంది అని అర్థం.)

మన గ్రామంలో మనందరం మన వంతుగా “మేము సైతం” అని కదలి  పర్యావరణాన్ని రక్షించుటలో భాగంగా ది.06.08.2017న “వనం-మనం” కార్యక్రమంలో సుమారు 2000 మొక్కలు నాటాం.

“చెట్లు నాటటం ఒక ఎత్తు. నాటిన వాటిని బ్రతికించి, పెంచటం ఒక ఎత్తు.”

మనం నాటిన మొక్కలలో సుమారు 1800 బ్రతికినవి. వాటికి “ట్రీ గార్డ్సు” ఉంటేనే, మనుగడ ఉంటుందని మనందరకు తెలుసు. సుమారు ఒక్కొక్క ట్రీ గార్డు రు.500/- కాగలదని తెలుస్తుంది. కొంతమంది దాతలు వారంతట వారే స్పందించి వారి వంతు సహాయంగా ఇప్పటి వరకు రు. 50000/-లు ప్రకటించారు. వారికి మన గ్రామ ప్రజలందరి తరుపున ధన్యవాదాలు.

మన గ్రామానికి సంబందించిన మంచి కార్యక్రమం కావున,  అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ “నేను సైతం” అని ముందుకు వచ్చి మీ వంతు ఆర్థిక సహాయం చేయదలచిన వారు దిగువ వివరింప బడిన సెల్ నెంబర్లకు తెలుపవలసినదిగా కోరుచున్నాం.

ఈ కార్యక్రమం ఏ ఒక్కరి కోసమో కాదు. మనందరి కార్యక్రమం. మన తరువాత మన భావి తరాలవారి కోసం.

 “సర్వే జనా: సుఖినోభవంతు” 

స్పందించిన దాతలు.

  • శ్రీ వంకాయలపాటి బలరామకృష్ణయ్య.
  • డా.మర్రి పెద్దయ్య. 
  • గుర్రం విశ్వేశ్వరరావు.
  • యర్రా రామారావు.
  • కోయరామారావు.

www.manaponugupadu.com: 9440527412, తూము వేణు గోపాల్.9985825589, కోయ రామారావు:9440915861 

Tagged with: , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*