మన పొనుగుపాడు ఉన్నత పాఠశాలలో గురుపూజా మహోత్సవం విశేషాలు

గురుపూజా మహోత్సవం.

మన పొనుగుపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులకు ది.07.09.2018 న గురుపూజా మహోత్సవం జరపబడింది.ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

  • గురువు అంటే ఎవరు?
  • అసలు ఈ కార్యక్రమం ఎలా,ఎందుకు మొదలైంది?

కనీసం ఈ విషయాలు గురించి ప్రతివ్యక్తి,విద్యార్థులు తెలుసుకోవాలి,తెలిసిండాలి.

మొదటి విషయానికి వస్తే మనందరం గురు లేదా గురువు అంటే విద్యను నేర్పువాడు అని భావిస్తాం.సంస్కృతంలో గు అంటే  చీకటి లేదా అంధకారం అని అర్థం. రు అంటే వెలుతురు లేదా ప్రకాశం అని అర్థం.అనగా గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి, బ్రహ్మ విద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు.ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది.అంతేగాదు గురువును త్రిమూర్తులు స్వరూపంగా భావించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం.

ఇక రెండవ విషయానికి వస్తే సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి మనందరికి తెలుసు.1962లో రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పుడు  కొందరు శిష్యులు, మిత్రులు,అధికారులు, అభిమానులు పుట్టినరోజు జరుపటానికి అతని దగ్గరకు వెళ్లినప్పుడు, నా పుట్టినరోజును వేడుకులా జరిపే బదులు దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే ఎంతో గర్విస్తాను అన్న మాటల నుంచి ఏర్పడి,  అప్పటి నుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ మాటల బట్టి ఉపాధ్యాయ వృత్తి పట్ల తనకెంత ప్రేమ ఉందో మనందరికి అర్థమవుతుంది. 

కార్యక్రమ విశేషాలు

పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రసిడెంటు కోయ రామారావు పర్వేక్షణలో, డాక్టరు మర్రి పెద్దయ్య, కొరిటాల శేషగిరిరావు, గుంటుపల్లి జగన్నాథరావు అబినందనలతో గురుపూజా దినోత్సవం సందర్బంగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని పద్మావతిని ది.07.09.2018న పాఠశాలలో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి డాక్టరు పాతూరి సీతారామాంజనేయులు (విశ్రాంత ప్రొఫెసర్) ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమం సందర్బంగా సన్ ఫార్మాష్యూటికల్స్ రిప్రెంజెంటేటివ్ శ్రావణ్ 84 మంది పేద విద్యార్థులకు ఆంగ్ల నిఘంటువులు ఉచితంగా పంచిపెట్టారు.ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి, అరోరారావు, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ తులసీథరరావు, పాఠశాల చైర్మెన్, వంకాయలపాటి కొట్లింగయ్య, గుంటుపల్లి వెంకటేశ్వరరావు,వలి మాష్టరు తదితరులు పాల్గొన్నారు.

ఫొటో గ్యాలరీ

Slider
Tagged with: , , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*