మన పొనుగుపాడు దేవాలయాల ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం

ప్రియ భగవత్ బంధువులారా,

మన పొనుగుపాడు గ్రామంలో వేంచేసియున్న

 • శ్రీ అంజనేయస్వామి, 
 • శ్రీ శీతారామస్వామి, 
 • కలియుగ దైవం శ్రీ దేవీ భూ నీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహిత, 
 • శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంధ్ర స్వామి, 
 • వినుకొండ అంకమ్మ తల్లి, 

ప్రధమ వార్షికోత్సవ ఆహ్వాన శుభ పత్రిక

దేవాలయాల ప్రధమ వార్షిక బ్రహ్మోత్సవం ది.25.04.2018 (బుధవారం) నుండి ది.28.04.2018 (శనివారం) వరకు పొనుగుపాడు దేవాలయాల సేవా సమితి ఆధ్వర్యంలో జరుపబడునని మీ అందరికి తెలియజేయాటానికి సంతోషిస్తున్నాం.

కావున యావత్ భక్తబృందం, భగవత్ బంధువులూ అందరూ ఈ కార్యక్రమాలను కనులారా వీక్షించి తీర్ద ప్రసాదాలు స్వీకరించి తరించగలరు.

28.04.2018 శనివారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Tagged with: , , ,
8 comments on “మన పొనుగుపాడు దేవాలయాల ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం
 1. KOPPAKA RAMAKRISHNA says:

  నమస్తే.శుభోదయము.ధన్యవాదములు.

  • Yarra Ramarao says:

   నమస్తే సార్,పొనుగుపాడు మా స్వగ్రామం. పొనుగుపాటి ప్రసాద్ గారి పూర్వీకులులో ఒకరైన పాపరాజు గారు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించారు.www.manaponugupadu.com చరిత్రలు నందు గల వ్యాసాలు ఒకసారి చదవగలరు.మీ సెల్ నెంబరు తెలుపగలరు.

 2. jagannadha Rao.V. says:

  Wish you all the best, god blesses with you and your family.

 3. పొనుగుపాటి ప్రసాద్ says:

  శుభోదయం పొనుగుపాడు గ్రామ ప్రజలకు ,గ్రామ పెద్దలకు ,ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ,చైర్మన్, బోర్డు మెంబెర్స్ కు మా పొనుగుపాటి వంశం తరుపున ప్రధమ వార్షి కోత్సవ శుభాకాంక్షలు .

 4. పొనుగుపాటి ప్రసాద్ says:

  మా కుటుంబం ఈ వార్షిక కార్యక్రమాలలో పాల్గొనవల్సింది.కానీ మా మామ గారు కాలం చేసారు .ఇంకా కర్మ ఖాండ కార్యక్రమాలు జరుగుతున్నందున మేము పాల్గొన లేక పోతున్నందుకు చింతిస్తున్నాము .పొనుగుపాటి ప్రసాద్

 5. పొనుగుపాటి ప్రసాద్ says:

  ఇక్కడ మా ముత్తాతలు పొనుగుపాటి పాపరాజు గారి చే 200 వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన శ్రీ అంజనేయ స్వామి వారి దేవాలయం తిరిగి పునః ప్రతిష్టంచడానికి అహర్నిశలు శ్రమ కోర్చి తమ వంతు కృషి చేసిన గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు ,చైర్మన్ ,మెంబెర్స్ ఈ ఓ గారికి మా కుటుంబం తరుపున నమస్సుమాంజలి.

 6. పొనుగుపాటి ప్రసాద్ says:

  ఈ వెబ్ సైట్ నిర్మాత యర్రా రామారావు గారు పొనుగుపాడు గ్రామ విశిష్ఠతను ,చరిత్రను ,పొనుగుపాటి వంశీకుల చరిత్రను ఏదో గాలి కబుర్లులా కాకుండా ప్రభుత్వ రికార్డులను పరిశీలించి ఆధారాలతో సహా ఈ పేజీలో పెట్టటమే కాకుండా పొనుగుపాడు గ్రామంలో వున్న విశిష్ట వ్యక్తుల గురించి ,వంశాల గురించి అందరికి అర్థమయ్యేలా తన రచనలతో అర్థమయ్యేలా చేసిన శ్రీ యర్రా రామారావు గారికి నా హృదయ పూర్వక నమస్సుమాంజలి అర్పించుకొంటున్నాను.మీ పొనుగుపాటి ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*