శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమం.

పున:నిర్మాణ కార్యక్రమం

 

ఆలయ ట్రష్టుబోర్డు చైర్మెన్ గా క్రోసూరి వెంకట్రావు పనిచేసే కాలంలో (2008 సం.ము) దేవాలయం పూర్తిగా శిధిలమై పడిపోయే స్థితికి చేరువైనది. దేవాలయం జీర్ణోద్దరణ గావించవలసిన సమయం ఆసన్నమైనదని గ్రామ పెద్దలు గ్రహించారు.

దేవాలయం పున:నిర్మించాలనే సంకల్పం గ్రామస్థుల అందరి మనసులో అభిప్రాయం కలిగింది. ఆ అభిప్రాయం ఆచరణలో పెట్టుటకు కొంగర జగన్నాధం, యర్రం కోటేశ్వరరావు, దాడి రాధాకృష్ణ, గుర్రం రామారాయుడు, క్రోసూరి బుచ్చయ్య, కోయ వెంకట్రావు, క్రోసూరి బాలరాజు,  ఆలయ అర్చక స్వామి శ్రీనివాస రాజ గోపాలాచార్యులు మరి కొంతమంది కలసి 2008లో హైదరాబాదు వెళ్లి అప్పటి దేవాదాయ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారిని కలసి అర్జీ సమర్పించుట జరిగింది.

పాలక వర్గం ప్రమాణ స్వీకారం

ట్రష్టుబోర్డు చైర్మెన్ క్రోసూరి వెంకట్రావు పదవీ కాలం ఏప్రియల్ 2010 తో ముగిసింది. తదుపరి మాజీ చైర్మెన్ వెంకట్రావు భార్య పున్నమ్మ,మాగులూరి సత్వవతి, తెలగతోటి చినలక్ష్మయ్యలతో పాలక వర్గం ఏర్పడింది.

పాలకవర్గం చైర్మెన్ గా క్రోసూరి పున్నమ్మ పదవీ బాధ్యతలు చేపట్టింది. పూజారి రాజ గోపాలా చారి ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించబడ్డారు.

ఆ తరువాత ది.19.11.2011న జరిగిన అప్పటి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ  దేవాదాయశాఖ బోర్డు సమావేశంలో  1/3 వంతు సి.జి.యఫ్. విరాళం రు.8,15,000 చెల్లించే పద్దతిపై ఆలయ జీర్ణోద్దరణకు రు.24,45,000/- లు మంజూరుకు ఆమోదం పొందబడింది.

సాయిగోపాల్ ముందడగు

యర్రం కోటేశ్వరావు ప్రోత్సాహంతో కీ.శే.మాచవరపు కోటేశ్వరరావు కుమార్డు సాయిగోపాల్, రీతి (అమెరికా) దంపతులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి 1/3 వంతు సి.జి.యఫ్. విరాళం సొమ్ము రు.8,15,000 లు చెల్లించారు.

సాయిగోపాల్

యర్రం కోటేశ్వరరావు

గేరా కోటేశ్వరరావు

తాడికొండ నియోజకవర్గ సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవర ప్రసాదరావు మంత్రిగా పని చేసిన కాలంలో గేరా కోటేశ్వరరావు సహకారంతో దేవాలయ జీర్ణోద్దరణకు అనుమతి ఉత్తర్వులు లభించినవి.

గ్రామ పెద్దలు, ప్రజలు,దేశ విదేశాలలో ఉన్న పొనుగుపాడు నివాసులు యావన్మంది కుల మతాలకు అతీతంగా జీర్ణోద్దరణ గావించుటకు ప్రభుత్వం మంజూరు చేసిన రు.24,45,000 లుకు తోడు ఎవరెవరి శక్తి కొలది వారి వంతు సహకారం తప్పనిసరిగా అందించగలమని వాగ్దానాలు చేసారు.కొంత మంది దాతలు పెద్ద మనసుతో అడిగిందే తడవుగా  అప్పటికప్పుడు ఆర్ధిక సహాయం చేసారు.

గ్రామానికి ఆ కొరత తీరింది.

రామకోటేశ్వరరావు

గ్రామంలో లోగడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లేదు. చాలాకాలం నుండి గ్రామానికి కొరతగా ఉంది.జీర్ణోద్దరణ జరుగుచున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నూతనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపాలయం నిర్మించితే, గ్రామానికి  ఆకొరత తీరిందని హైదరాబాదులో నివసించుచున్న క్రోసూరి రామ కోటేశ్వరరావు మొదటగా తన అభిప్రాయం గ్రామ పెద్దలకు తెలిపారు.అంతేగాదు శ్రీ వెంకటేశ్వరస్వామి అలయం పూర్తి నిర్మాణ బాధ్యతలు తానే వహిస్తాను అని వాగ్దానం చేసారు.ఆ అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు.అయితే ఇక్కడ ఒక సాంకేతిక సమస్య ఎదురైంది.శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధీనంలో ఉంది. ఆలయ నిర్మాణ ఖర్చు ప్రజలు భరించినప్పటికి ప్రభుత్వం నుండి తగిన సాంకేతిక అనుమతి ఉత్తర్వులు పొందవలసి యున్నది. “శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం” ప్రభుత్వ గ్రాంటుతో సంబంధం లేకుండా పూర్తి నిర్మాణం ప్రజల నుండి సేకరించిన విరాళం సొమ్ముతో నిర్మించటానికి అనుమతి ఉత్తర్వులు మంజూరు కోరుచూ  గ్రామస్తులు, ఆలయ ట్రష్టు బోర్డు పాలకవర్గం వారు ప్రభుత్వం వారికి  అర్జీని దాఖలు చేసారు.

క్రోసూరి సుబ్బారావు

అభినయ శ్రీనివాస్

అనుమతి ఉత్తర్వులు హైదరాబాదులో ఉంటున్న క్రోసూరి సుబ్బారావు, అభినయ శ్రీనివాస్, పొనుగుపాటి వెంకట నాగభూషణంల కృషివలన  సకాలంలో అందినవి.

ఆలయ శిల్పి సూరిబాబు

ఆలయ నిర్మాణ బొమ్మకట్టు,మరియు ద్వజస్థంబాల ఏర్పాటు పనులు తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ది పొందిన ప్రముఖ శిల్పి, తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం గ్రామానికి చెందిన సూరి సూరిబాబు ఆధ్వర్యంలో జరిగినవి.

దేవాదాయ, ధర్మాదాయ శాఖ వారు శ్రీ ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయం,శ్రీ సీతా రామ లక్ష్మణ స్వామి ఉపాలయం, జీవ ద్వజస్థంబంలు జీర్ణోద్ధరణకు టెండరులు కోరగా, కన్నెగంటి బుచ్చయ్య చౌదరి కన్స్ట్రక్షన్ కంపెనీ, గుంటూరు వారు రు.23.80. లక్షలతో నిర్మించుటకు దాఖలు చేసిన టెండరును ఆమోదించి నిర్మాణ భాధ్యతను వారికి అప్పగించబడినది.

ఆలయంను దేవాలయం, రాజగోపురం అని కూడా అంటారు. రాజగోపురం నిర్మాణంలో ఆధారాలు, చిత్త వాహనం, ఉప పీఠం, అధిస్ఠానం, స్తంబవర్గం, ప్రస్తరం, గోపురం అను ఏడు నిర్మాణ భాగంలు ఉంటాయి. ఆలయ నిర్మాణ రూపకల్పన చేసేవారిని స్థపతులు అంటారు

పున:నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమం

దేవాలయ అర్చకస్వామి శ్రీనివాస రాజ గోపాలాచార్యులు పర్వేక్షణలో, అనంతాచార్యులు తదితర వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శాంతిపూజ, వాస్తుపూజ శాస్త్ర సమ్మతి ప్రకారం నిర్వహించారు.

తదనంతరం ట్రష్టు బోర్డు చైర్మన్ శ్రీమతి క్రోసూరి పున్నమ్మ, భర్త వెంకట్రావు ఆధ్వర్యంలో స్వస్తిశ్రీ చాంద్రమానేన, ఖరనామ సంవత్సర, పాల్గుణమాసం, బహుళ పాడ్యమి,శుక్రవారం, ఉదయం గం.06.59 ని.లకు ఉత్తరా నక్షత్ర యుక్త మీన లగ్న పుష్కరాంశమందు (ది.09.03.2012) శ్రీ ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంనకు కుడివైపు శ్రీ వెంకటేశ్వరస్వామి ఉపాలయం నూతనంగా నిర్మించుటకు ఎడమ వైపు శ్రీ సీతారామలక్ష్మణ స్వామి ఉపాలయం పున:నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమం జరిగింది.

 ప్రముఖులు ఆగమనం

శంఖుస్థాపన కార్యక్రమంనకు అప్పటి ఆంద్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది, ఉపాధి హామీ శాఖా మాత్యులు డొక్కా మాణిక్య వర ప్రసాదరావు, దేవాదాయ శాఖ ఉప కమీషనర్ గుదిబండ సుబ్బారెడ్డి, సహాయ కమీషనర్ బొంతు పరమేశ్వరరెడ్డి, ఇనస్పెక్టరు సుబ్రమణ్యం, డిప్యూటి ఎక్జిక్యూటివ్ ఇంజనీరు సి.హెచ్. శ్రీనివాసులు, ఆలయ కార్య నిర్వహణాధికారి డి.సి.హెచ్.వెంకటరెడ్డి తదితర అధికారులు, అనధికారులు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేవాలయ నిర్మాణానికి కృషి చేసిన కొంగర జగన్నాధం,యర్రం కోటేశ్వరరావు, దాడి రాధాకృష్ణ, క్రోసూరి బాలరాజు, క్రోసూరి కాంతారావు, క్రోసూరి సుబ్బారావు, అభినయ శ్రీనివాస్, కోయ వెంకట్రావు, గుర్రం రామారాయుడు, గుంటుపల్లి చంద్రమౌళి, ప్రస్తుత ఆలయ చైర్మెన్ గుంటుపల్లి తులసీధరరావు మరి కొంత మంది పెద్దలు ముందుండి శంఖుస్థాపన కార్యక్రమంను నడిపించారు. 

అమెరికా నుండి 1/3 వంతు సి.జి.యఫ్. విరాళం చెల్లించిన సాయిగోపాల్, గ్రామ సర్పంచ్ మాధవరావు, ప్రముఖులు వంకాయలపాటి బలరామకృష్ణయ్య, మాజీ సర్పంచ్ శివరామకృష్ణయ్య, కీ.శే.రామచంద్రయ్య, సాంబశివరావు, సూర్యనారాయణ, కోయ రామారావు, గుర్రం లక్ష్మణరావు, యర్రమాసు బ్రహ్మయ్య మరి కొంత మంది పెద్దలు, తదితరులు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.ట్రష్టు బోర్డు సభ్యులు తెలగతోటి చిన లక్ష్మయ్య, శ్రీమతి మాగులూరి సత్వవతి, మాజీ ట్రష్టు బోర్డు సభ్యులు కట్టమూరి సుబ్బారావు,కనమర్లపూడి జగన్నాధం కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాదు నుండి గుర్రం పెదబాబు, యర్రా నాగేశ్వరరావు, క్రోసూరి రామ కోటేశ్వరరావు, కీ.శే.గుర్రం తిరపతిరావు, మరి కొంత మంది ముఖ్యులు వారి సతీమణులతో శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, ఆలయ పూజారిచే శేష వస్త్రంలతో ఆశ్వీరవచనం పొందారు.

దేవాలయ నిర్మాణం విశేషాలు

ది.09.03.2012న జరిగిన శంఖుస్థాపన కార్యక్రమం ఫొటోగ్యాలరీ.

Play
Slider

 ది.15.11.2012న భక్తులు పీఠంనందు ఇసుక నింపుచున్న ఫొటో గ్యాలరీ.

Play
Slider

ఉప పీఠం నిర్మాణ ప్రారంభ ఫొటో గ్యాలరీ

ఉప పీఠం నిర్మాణంలో భాగంగా మొదటి రాయిని శాస్త్రోక్తంగా పూజించి, ది.08.12.2012న శ్రీ అంజనేయస్వామి ప్రధాన ఆలయంనకు,శ్రీ వేంకటేశ్వరస్వామి ఉపాలయంనకు ది.15.12.2012న, అలాగే శ్రీ సీతారామలక్ష్మణస్వామి ఉపాలయంనకు ది.23.12.2012న న ఉప పీఠం నిర్మాణం ప్రారంభం గావించారు.
 
Play
Slider

దర్వాజలు అమర్చిన కార్యక్రమం  ఫొటోగ్యాలరీ

ధి.13.06.2013న శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దేవాలయ సముదాయనకు దర్వాజలు అమర్చారు. తరువాత ఆలయ నిర్మాణ కట్టుబడి కార్యక్రమం శ్రామికులకు నిర్వహకులు భక్తులుచే నూతన వస్త్రంలు బహుకరించారు.

Play
Slider
 

దేవాలయ నిర్మాణంలో బ్రహ్మకపాలం శిలాఫలకంలు 18.02.2014న భక్తుల కోలాహలంతో ఊరేగింపు చేయబడినవి.మరుసటి రోజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయంలకు అమర్చారు.

బ్రహ్మకపాలం శిలాఫలకంలు ఊరేగింపు,అమర్చిన  ఫొటో గ్యాలరీ.

Play
Slider

ప్రస్తరం, గోపురం నిర్మాణ కార్యక్రమాల ఫొటోగ్యాలరీ.(26.03.2015)

Play
Slider

జీవ ధ్వజస్తంబముల మూలాలు గ్రామానికి చేరిక

దేవాలయ సముదాయం జీవ ధ్వజస్తంబముల మూలాలు తూర్పు గోదావరి జిల్లా, రంపచోడవరం మండలం, మారేడుమల్లి అటవీ ప్రాంతం నుండి సేకరించబడినవి.

 

Slider

దేవాలయం సుమారు రెండు కోట్ల వ్యయంతో దాదాపుగా అన్ని హంగులతో ఆగమశాస్త్ర ప్రకారం పున:నిర్మించబడింది. జీర్ణోద్దరణ దేవాలయంలకు అవసరమైన మూల విగ్రహాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పొందబడినవి.

గమనిక:త్వరలో జీర్ణోద్ధరణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వివరాల మీ ముందుకు తీసుకురాగలమని తెలియజేస్తున్నాం.

Tagged with: , , , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*