ఉన్నత పాఠశాల 66వ వార్షికోత్సవ విశేషాలు

[vc_row][vc_column][vc_column_text]

ఉదయం కార్యక్రమాలు

పాఠశాల 66వ వార్షికోత్సవ సంబరాలు 11.02.2017 న (శనివారం) పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో, ప్రధాన ఉపాధ్యాయురాలు టి. పద్మావతి పర్వేక్షణలో జరిగినవి.

ఉదయం గం.09.00లకు  టి. పద్మావతి ప్రధాన ఉపాధ్యాయురాలు ఆధ్వర్యంలో సర్పంచ్ లక్ష్మిమాధవరావుచే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

జండా వందన కార్యక్రమానికి యం.పి.టి.సి సభ్యులు బొట్ల అమరయ్య, యస్.యం.సి. చైర్మెన్ పాలపర్తి కోటేశ్వరరావు తదితరులు హజరైయ్యారు.

సాయంత్రం కార్యక్రమాలు

సాయంత్రం గం.04.00లకు మాజీ ఉపాధ్యాయులు కట్టా కృిష్ణమూర్తిగారి అధ్యక్షతన పూర్వ విద్యార్దుల సంఘ సమావేశం జరిగింది. కోశాధికారి షేక్ మస్తానువలి నివేదికను చదివి వినిపించారు.

పూర్వ విద్యార్దుల సంఘం అధ్యక్షులు కోయ రామారావు, కొరిటాల శేషగిరిరావు ప్రసంగించారు. ప్రధానోపాద్యాయురాలు టి. పద్మావతి పాఠశాల పరిస్ధితిని గురించి చెప్పారు.

వడ్డవల్లి పుష్పలత మాట్లాడుతూ పాఠశాల అబివృధ్దికి చేయవలసిన చర్యలు గురించి ప్రసంగించారు.

ఆ తరువాత  పాఠశాల వార్షికోత్సవసభకు పూర్వ విద్యార్ధి,కిష్ ట్రష్టు వ్యవస్థాపకులు, విశ్రాంత విద్యాబోధకులు కొరిటాల శేషగిరిరావు అధ్యక్షత వహించారు.

ఆంగ్లోపాధ్యాయులు వి.రూజువెల్ట్ బాబు అతిధులను సభకు పరిచయం చేసారు. వడ్డవల్లి పుష్పలత, డి.ఐ.జి. (ఎ.ఫి. రిజిష్ట్రేషన్ శాఖ) గుంటూరు ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.

గ్రామ పంచాయతి సర్పంచ్ లక్ష్మిమాధవరావు,మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు బొట్ల అమరయ్య,యస్.యం.సి. చైర్మెన్ పాలపర్తి కోటేశ్వరరావు తదితరులు విశిష్ఠ అతిధులుగా హాజరైయ్యారు.

మాజీ ఉపాధ్యాయులు కట్టా కృిష్ణమూర్తి, విశ్రాంత మండల రెవిన్యూ అధికారి మాగులూరి బసవాచారి తదితరులు ఆత్మీయ అతిధులుగా హాజరైయ్యారు.

ముందుగా వడ్డవల్లి పుష్పలత, డి.ఐ.జి. ఎ.ఫి. రిజిష్ట్రేషన్ శాఖ, గుంటూరు, ప్రదానోపాధ్యాయురాలు పద్మావతిల జ్వోతి ప్రజ్వలనతో సభ ప్రారంభించబడింది. అనంతరం పాఠశాల నివేదికను ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి సభకు చదివి వినిపించారు.

వక్తల ప్రసంగాలు

ముఖ్య అతిధి వడ్డవల్లి పుష్పలత మాట్లాడుతూ తాను ఈ పాఠశాలోనే చదివానని చెప్పారు. పాఠశాల అన్నిక్లాసు రూములకు, కంప్యూటరు ల్యాబ్ కు  తన వంతు సహాయంగా ప్యానులు ఏర్పాటు చేస్తానని చెప్పారు.

పూర్వ విద్యార్థులు సంఘం పాఠశాలకు చేస్తున్న సేవలను కొనియాడారు. 

కొరిటాల శేషగిరిరావు మాట్లాడుతూ పదవ తరగతిలో 9.3/10 పాయింట్లుతో స్కూలు పష్టు సాధించిన కోమటినేని శ్రావణిని పాఠశాల విద్యార్థులు అందరూ అదర్శంగా తీసుకోవాలన్నారు.

విద్యతోపాటు డిజిటల్ నాలెడ్జిలో ప్రావీణ్యత అవసరం అని చెప్పారు. పాఠశాల అభివృధ్దికి పలు సూచనలు సూచించారు.

కంప్యూటరు ల్యాబ్ కు కొరిటాల శేషగిరిరావు, ఇందిరాదేవి దంపతులు రు.150000/- లుతో పెయింటింగ్ వేయించి సుందరంగా తీర్చిదిద్దినందుకు కోయ రామారావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ సందర్బంగా కొరిటాల శేషగిరిరావు,ఇందిరాదేవి దంపతులను ప్రదాన ఉపాధ్యాయురాలు టి.పద్మావతి, ఉపాధ్యాయులు,నాన్ టీచింగ్ సిబ్బంది ఘనంగా సత్కరించారు.  

దాతల విరాళాలు

డిజటల్ క్లాసులకు మ్యాచింగ్ గ్రాంటు క్రింద 45000/- లు పూర్వ విద్యార్ధి దూదేకుల షేకు మస్తాను అందచేయుటకు ముందుకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే తండ్రి జ్ఞాపకార్ధం కట్టా ఆదినారాయణ రు.10000/-లు, మాగులూరి బసవాచారి (రిటైర్డు యం.ఆర్.ఒ)  రు.5000/-లు అంద చేసినందులకు, పోడియం బహుకరించిన సుంకుల మస్తానును అభినందించారు.

అలాగే సౌండు సిస్టం, స్పీకర్స్ అందచేసిన మహమ్మద్ యూసప్ దౌలా, నిడమానూరి శివప్రసాదులను పూర్వ విద్యార్థుల సంఘం తరుపున అభినందించారు. పాఠశాలకు పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా లోగడ జరిగిన అభివృద్ధి పనులను గురించి చెప్పారు.

విశ్రాంత మండల రెవిన్యూ అధికారి బసవాచారి, మాజీ ఉపాద్యాయులు కట్టా కృష్ణ మూర్తి, పూర్వ విద్యార్దిని, విద్యార్ధులు సుంకుల సంధ్యారాణి,వరగాని శ్రీనివాసరావు,యామాని  బాస్కరరావు,వలి మాష్టరు,షేక్ మొహిద్దీన్ పీరా,కోట్లింగయ్య, నేరేళ్ల సుబ్బారావు సుంకుల రామాంజనేయులు,తదితరులు సమావేశంలో మాట్లాడారు.

పురష్కారాలు

సమావేశంలోఉన్నత పాఠశాల అసిస్టెంట్, బయలాజికల్ సైన్స్ అసిస్టెంటు జె.శంకరరావును పాఠశాల తరుపున ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు సత్కరించారు.

ఆర్.టి.సి విశ్రాంత ఉద్యోగి ఈవూరి వెంకటరెడ్డి పాఠశాల పై వ్రాసిన పద్య కవితలు సమావేశంలో చదివి వినిపించారు. వీరిని పూర్వ విద్యార్ధుల సంఘం తరుపున సత్కరించారు.

ప్రోత్సాహక బహుమతులు పంపిణీ

ఈకార్యక్రమంలో దాతలు నుండి సేకరించిన నలుబై ఎనిమిది వేల రుపాయలు చదువులో ప్రతిభ ఆధారంగా ఎంపికచేసిన బీద విద్యార్థిని, విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అతిధుల చేతులమీదుగా అందజేయబడినవి.

గత సంవత్సరం పదవ తరగతిలో 10/10 పాయింట్లు సాధించి, పాఠశాల ప్రధమ ర్యాంకు పొందిన కోమటినేని శ్రావణికి  రు21000/-లను,  మిగిలిన పదునెనిమిది మంది విద్యార్దిని విద్యార్దులకు రు25500/- లు పూర్వ విద్యార్ధుల సంఘం తరుపున దాతలు నుండి సేకరించిన ప్రోత్సాహక బహుమతులు నగదుగా అందచేయుటం జరిగింది.

అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడినవి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులుకు పాఠశాల ప్రధానోపాధ్యాయిని టి. పద్మావతి బహుమతులు అందచేసారు.  కార్యక్రమంలో ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, అరోరారావు, శ్రీనివాసరావు, పూర్ణయ్య, వెంకటేశ్వరరావు, ఉషారాణి, కోటేశ్వరి, మస్తానువలి పాల్గొన్నారు.

పూర్వ విద్యార్దులు శివయ్య మాష్టరు, క్రోసూరి సుబ్బారావు, కోయ వెంకట్రావు,యర్రమాసు నాగేశ్వరరావు,వక్కంటి వెంకటేశ్వరరావు,గేరా ఆనంద్,విద్యార్దిని విద్యార్దుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు హాజరైయ్యారు.

ఈదర హరిబాబు, క్రోసూరి బాలరాజు, బాలకృష్ణ, కొంగర రాఘవయ్య, యామాని రామారావు, గుంటుపల్లి వెంకటేశ్వరరావు, పూర్ణచంద్రరావు, వక్కంటి వెంకటేశ్వరరావు, దాడి రాదాకృష్ణ, కట్టా సుబ్బారావుల సహకారంతో  కార్యక్రమ పర్వేక్షణ జరిగింది.

 చివరగా పాఠశాల ఉపాధ్యాయులు వై.శ్రీనివాసరావు వందన సమర్పణ గావించారు. 

 కార్యక్రమాల దృశ్యమాలిక

[/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=SQKmVxjbJ0g” align=”center”][/vc_column][/vc_row]

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *