అనంతరామమ్మ ప్రస్తుత నివాస గృహం.

పొనుగుపాటి వంశీకుల చరిత్ర.

[vc_row][vc_column][vc_column_text]

పొనుగుపాటి వంశీకుల చరిత్ర.

అనంతరామమ్మ ప్రస్తుత నివాస గృహం.
లక్ష్మీకాంతారావు లోగడ నివశించిన ప్రదేశంలో ప్రస్తుతం ఉన్నగృహం.

ఈ వంశీకులు బ్రాహ్మణ కులానికి చెందినవారు. గోత్రం: కౌండిన్యస. ఋషులు:వశిష్ఠ, మైత్రావరణ, కౌండిన్యస. వేదం:కృష్ణ యజుర్వేదం.

నా చిన్నతనంలో 1960-65 ఆ ప్రాంతంలో చాలా మంది మా బజారులోనే  (పడమర బజారు) నివసించేవారు. ఈ వంశీకులు పూర్వం నుండి గ్రామానికి కరణీకం వృత్తి చేసారు. ఎక్కువ మంది వ్యవపాయ భూమి కలిగి వ్యవసాయం, పశుపోషణ చేసారు.

మరి కొంత మంది వైద్యవృత్తి, విద్యాబోధన చేసేవారు.

కాలమాన  మార్పులు ననుసరించి ఉద్యోగరీత్యా గానీ, ఇతర కారణాల వల్లనైతేనేమి ఏరే ప్రదేశాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం గ్రామంలో కొంత మందికి కొద్ది కొద్దిగా అస్తులు ఉన్నవి. కానీ నివాసంగా ఎవ్వరూ లేరు.

అనంతరామమ్మ
అనంతరామమ్మ

సుమారు 1958 వరకు గ్రామ కరణంగా పని చేసిన లక్ష్మీకాంతారావు భార్య అనంత రామమ్మ మొన్న మొన్నటి వరకు గ్రామంలో ఉండేది.

ఆమె కారణాంతరాల వల్ల హైదారాబాదు, మీర్ పేటలో కుమార్తె విజయలక్ష్మి దగ్గర ఉంటుంది. 

పొనుగుపాటి వారి పూర్వీకుల వివరాలు తెలుసుకుందామని అమె దగ్గరకు వెళ్లటం జరిగింది.

అమెతో కాసేపు మంచి చెడూ ముచ్చటించి, మీ పూర్వీకుల వివరాలతో  కూడిన వంశవృక్షం ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడిగాను. అలాంటిది ఏమిలేదయ్యా  కావాలంటే నాకు తెలిసినంతవరకు చెపుతానని అంది.

మా సంబాషణ ఆమె కుమార్తె విజయమ్మ విన్నది. సిరిపురపు వేంకటరమణయ్య తాతయ్య శత జయంతి ఉత్సవం పుస్తకంలో నేను చూసినట్లు గుర్తు అని మాతో అంది. దాని మీదట నేను అమ్మా ఆ పుస్తకం శ్రమ అనుకోకుండా కొద్దిగా వెతికి ఇవ్వండమ్మా అని అడిగాను.శ్రమ తీసుకుని ఆ పుస్తకం వెతికి తీసుకొని వచ్చింది.

ఆ పుస్తకం నేను పరిశీలించగా సిరిపురం పూర్వీకుల వంశవృక్షములతో పాటు మొన్న మొన్నటి వరకు ఈ గ్రామంలో నివసించిన వారి అందరి పేర్లతో కలిగిన వంశవృక్షం జతపర్చబడి ఉంది.

మూల పురుషుడు వెంకమరాజు

వెంకమరాజు వంశవృక్షం.(CLICK HERE)

పై వంశవృక్షం ఆధారాన్నిబట్టి పరిశీలిస్తే ఈవంశీకుల మూల పురుషుడు వెంకంరాజు అని తెలుస్తుంది. ఇతను సుమారు 18 వ శతాబ్థం ద్వితీయార్థం అనగా 1750 – 1800 మధ్య కాలానికి చెందిన వాడు. ఇతని సంతతి పాపరాజు, దేవల్ రాజు, అయ్యపరాజు, వీర్రాజు. పూర్వం నుండి ఈ వంశీయులు గ్రామాధికారుల వ్యవస్థ రద్దు అయ్యేంత వరకు పొనుగుపాడు గ్రామానికి మజుకూరి కరణాలుగా పనిచేసారు.

పాపరాజు నిర్మించిన శ్రీ అంజనేయస్వామి దేవాలయం.

ఇది మనకు తెలియాలంటే ఇంకా కొంత చరిత్ర తెలుసుకోవాలి. బ్రిటీషు పాలనలో, మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన గుంటూరు సర్కారు 1790లో గ్రామాల సర్వే బాధ్యతను కాలిన్ మెకంజికి అప్పగించింది. గుంటూరు జిల్లాలోని అన్ని గ్రామాల సమాచారం సేకరించే కార్యక్రమం పూర్తి చేసి కాలిన్ మెకంజి అప్పటి సర్కారుకు అప్పగించాడు. వీటిని గ్రామ కైఫియ్యత్తులు అంటారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైన్స్ వారు వీటిని 1988లో ప్రచురించారు.  

ఆ సర్వేలో భాగంగా పైన వివరింపబడిన వంశవృక్షం ప్రకారం  వెంకంరాజు ద్వితీయ సంతానం మజుకూరి మిరాసిదారుడైన దేవల్ రాజు, అయ్యపరాజు (అప్పన్నయ్య అయ్యపరాజుకు మరో పేరు కావచ్చు), గోపరాజు, (వారసులు కావచ్చు)  పొనుగుపాడు గ్రామానికి చెందిన సమాచారంను 1817 లో తెలిపారు.

కైఫియ్యత్తులు లింకులు

 (CLICK BELOW LINKS )

1.Kaifiyats 3rd part Page no. 204.  
  1A.Kaifiyats 3rd part Page no. 205.
2Kaifiyats 4th part page no.192.  
 2A. Kaifiyats 4th part page no. 193

‘వొణుకుబాడు’ / ‘పొణుకుపాడు’ 

పై కైఫియత్తుల ప్రకారం పొనుగుపాడు గ్రామాన్ని పూర్వం ‘వొణుకుబాడు’/ ‘పొణుకుపాడు’ అనే పేర్లుతో పిలిచినట్లుగా తెలుస్తుంది. ఆ తరువాత సుమారు 100 సం.ల క్రితం నుండి “పొనుగుపాడు” గా పిలుస్తున్నట్లు ప్రభుత్వ రికార్డు ద్వారా తెలుస్తుంది.

కైఫియ్యత్తుల లోని పదాలకు అర్థాలు:

  • 1. మజుకూరి = A fore said, above mentioned, పైన వివరింపబడిన.
  • 2.మిరాసిదారుడు = hereditary right, వంశ పరంపరంగా వచ్చే బాధ్యత.
  • 3.ఫసలి =The revenue year which begins on the 14th of July. రెవిన్యూ లెక్కల సంవత్సరం.
  • 4.కైపియ్యత్తులు= సంగతులు, విషయాలు, కవిలకట్ట.
  • 5.అరకుచ్చల = 22 యకరంలకు సమానం.
  • 6.సంప్రతివారు = కరణం హోదా కలవారు.
  • 7.మృత్యజాంన్నగరు/ముర్తిజానగరు సర్కారు =The Persian name of Guntur, Like Andhra Sarkar.
  • 8.మవుంజె = ఒక వూరిలో చిన్నపల్లె.
  • 9.సమంతు = తాలూకాలో ఒక భాగం.
  • 10.హైవేలి = నగరు.
  • 11. ముఠే = కొన్ని గ్రామాలు.

పై కైఫియ్యత్తుల ప్రకారం వెంకంరాజు ప్రధమ కుమార్డు పాపరాజు దేవాలయం నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఆ దేవాలయంలో శ్రీ అంజనేయస్వామి విగ్రహం ‘సిద్ధార్ధి’ నామ సంవత్సరం (1799-1800) లో ప్రతిష్టించినట్లు తెలుస్తుంది.అంతేగాదు పూజాది కార్యక్రమంలు జరుగుటకు పెరంబుదూరు కేశవాచార్యులు అనే పాంచరాతృని (ఆగం శాస్త్రం తెలిసిన వ్యక్తి) నియమించి, అప్పటి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న శ్రీరాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారితో చెప్పి అరకుచ్చల భూమిని (22 ఎకరంలకు సమానం) ఇనాంగా ఇప్పించారు.ఇప్పటికి ఆ భూమి శ్రీ అంజనేయస్వామి దేవాలయం ఆధీనంలో ఉంది.

పొనుగుపాటి వారి వంశవృక్షం-2 (CLICK HERE)

ఈపై వంశవృక్షానికి మూల పురుషుడు వేంకటరమణయ్య, తులిశమ్మ దంపతులు. ఈయన కుమార్డు ఈశ్వరయ్య, పిచ్చమ్మ దంపతుల రెండవ కుమార్డు వేంకటరమణయ్య  పైన చూపబడిన మూల పురుషుడు వెంకంరాజు వంశవృక్షంలోని మూడవ సంతతి వాడైన పొనుగుపాటి అయ్యపరాజుకు చెందిన వారసుల లో వెంకటప్పయ్య, సుబ్బమ్మ దంపతులకు దత్తు పోయాడు.

వేంకట రమణయ్య 20 శతాబ్థం మొదట్లో పొనుగుపాడు గ్రామానికి కరణంగా పనిచేసాడు. ఈయన గ్రామంలో ప్రస్తుతం ఉన్నపెద్దవారు మర్రి గోపాలకృష్ణయ్య, రాయంకుల తాతయ్య (పంతులుగారు) గార్లకు ఇంకా మరి కొంతమందికి తెలుసు.

వేంకటరమణయ్య దత్తు కుమార్డు లక్ష్మి కాంతారావు.

Lakshmikantharao
Lakshmikantharao

వేంకటరమణయ్యకు సంతతి లేదు. ఈయన నరసరావుపేట మండలం, రూపినగుంట్ల గ్రామానికి చెందిన రామదాసయ్య, ఆదిలక్షమ్మ దంపతుల కుమార్డు లక్ష్మి కాంతరావును దత్తు కుమార్డుగా స్వీకరించాడు. దత్తు తండ్రి వేంకటరమణయ్య తరువాత కరణీకం వృత్తి వంశపార్యపరంగా లక్ష్మి కాంతరావుకు దక్కింది. వీరు మేడికొండూరు మండలం, పాలడగు గ్రామానికి చెందిన పాలడగు కుటుంబరావు, రమణమ్మ దంపతుల కుమార్తె శ్రీదేవిని వివాహమాడారు. 

లక్ష్మి కాంతారావు, శ్రీదేవి దంపతుల సంతానం కుమార్తె వెంకట రమణమ్మ, కుమార్డు వెంకట రమణయ్య.

భార్య శ్రీదేవి మరణానంతరం తిరిగి ఖమ్మం జిల్లా గడ్డమణుగు నరసింహారావు, సీతారామమ్మ దంపతుల కుమార్తె అనంతరామమ్మను వివాహమాడారు. ఈమె సంతానం ఇద్దరు కుమారులు. వెంకట నాగభూషణం, సీతా రామ చంద్రరావు వరఫ్ శ్రీనివాసరావు. ఇద్దరు కుమార్తెలు. శ్రీలక్ష్మి, విజయలక్ష్మి సరస్వతి.లక్ష్మి కాంతారావు  కరణీకం చేస్తూనే, 1951లో నూతనంగా మంజూరైన తపాలా కార్యాలయం మొదటి పోష్టు మాష్టరుగా నెలకు 20/- ల వేతనంపై నియమించ బడ్డారు. గ్రామ కరణీకం, పోష్టు మాష్టరుగా పనిచేస్తూ 1958లో పరమపదించారు.దత్తు తండ్రి వేంకట రమణయ్య తరువాత శ్రీ అంజనేయ స్వామి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తగా పనిచేసారు. 

కరణీకం వ్యవస్థలో గ్రామానికి పనిచేసిన చివరి కరణం.

P.V.Ramanaiah. (Last Karanam)
Venkata Ramanaiah. (Last Karanam)

లక్ష్మికాంతారావు చనిపోయేనాటికి మొదటి భార్య శ్రీదేవి కుమార్డు వెంకట రమణయ్య మైనరు. వెంకట రమణయ్య మేజరు అయ్యేంత వరకు మునగపాటి కరణం తిరుపతిరావు ఇన్ చార్జిగా పనిచేసారు.

స్వర్గీయ నందమూరి తారకమారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ది.06.01.1984న గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసారు. మేజరు అయిన తరువాత ఉద్యోగంలో చేరినప్పటి నుండి గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసేంత వరకు వెంకట రమణయ్య చివరి కరణంగా పనిచేసారు.

అంతేగాదు శ్రీ అంజనేయ స్వామి దేవస్థానంనకు చివరి వంశపారంపర్య ధర్మకర్తలు గా పనిచేసిన వారిలో వెంకట రమణయ్య చివరి వారు. వెంకట రమణయ్య, బాల త్రిపుర సుందరి దంపతులకు ఇద్దరు కుమారులు. శ్రీకాంత్, నాగశ్రీధర్ శర్మ. ఒక కుమార్తె శ్రీదేవి. 

వెంకట రమణయ్య ఉద్యోగం చేస్తూ అరోగ్యం క్షీణించి ది.03.09.2002న చనిపోయారు. వెంకట రమణయ్యకు ముందే భార్య బాల త్రిపుర సుందరి పరమ పదించినది. ఉద్యోగరీత్యా కుమారులు శ్రీకాంత్ గుంటూరులో, నాగ శ్రీధరశర్మ బాపట్లలో ఉంటున్నారు. 

కేదార్ నాధ్ యాత్రలో చనిపోయిన నాగభూషణం కుటుంబం

లక్ష్మి కాంతారావు రెండవ భార్య అనంత రామమ్మ కుమార్డు వెంకట నాగ భూషణం (మూడవ సంతానం) పోష్టల్ డిపార్టుమెంటు లో ఉద్యోగం చేస్తూ, హైదరాబాదు, మీర్ పేట లోని స్వంత గృహంలో నివాసం ఉండేవారు.2013 జూన్ లో కేదార్ నాద్ యాత్రకు భార్య వేంకట లక్ష్మీపద్మావతి, ఇంజనీరింగు చదువుచున్న ఏకైక కుమార్తె సాయిశ్రీతో వెళ్లారు. దురదృష్టావశాత్తు వరద ప్రళయంలో చిక్కుకొని ముగ్గురు చనిపోయారు. ఇది చాలా విచారించ వలసిన విషయం.

పై రెండవ వంశవృక్షంలోని ఈశ్వరయ్య పిచ్చమ్మ దంపతుల మూడవ కుమార్డు సీతారామయ్య, అన్నపూర్ణమ్మ దంపతుల సంతతిలో ప్రథమ కుమార్డు కోటేశ్వరరావు (పంతులుగారు).

కోటేశ్వరరావు (పంతులుగారు).మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల (బాలికల) ఉపాధ్యాయుడు గా పని చేసారు. బాలికల పాఠశాలకు భవన వసతి లేనందున పడమర బజారులోని తన స్వంత స్ధలంలో ఉచితంగా షెడ్డు నిర్మించి పదవీ విరమణ చేసే వరకు వసతి కల్పించారు. లక్ష్మి కాంతారావు పరమపదించిన తరువాత కుమారుడు వెంకట రమణయ్య మైనరు అయినందున కోటేశ్వరరావు పంతులుగారు శ్రీ అంజనేయస్వామి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తగా  బాధ్యతలు తీసుకుని చాలా కాలం పనిచేసారు. 

రెండవ కుమార్డు వేంకట సుబ్బారావు ఉద్యోగరీత్యా గ్రామాంతరం. మూడవ కుమార్డు సత్యనారాయణ మాదల లక్ష్మీకాంతంకు దత్తు పోయారు. నాలుగవ కుమార్డు ఈశ్వరయ్య నిస్సంతు.

స్వాతంత్ర్య సమర యోధుడు వేంకట నాగభూషణం

ఈశ్వరయ్య పిచ్చమ్మ దంపతుల నాలుగువ సంతానం వేంకట నాగభూషణం. పొనుగుపాటి వారి మూల పురుషుడు వెంకంరాజు చతుర్థ కుమారుడైన వీర్రాజు మనవడు కాంతయ్యకు సంతానం లేనందున వేంకట నాగభూషణంను దత్తు కుమార్డుగా స్వీకరించారు.వీరు స్వాతంత్ర్య సమర యోధుడు.

సత్యాగ్రహంలో పాల్గొనినందుకు బ్రిటీసు ప్రభుత్వం 29.07.1930 న ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది.జైలు శిక్ష పూర్తి అయిన తరువాత విజయవాడలో ఆర్యవైశ్య వారపత్రిక సంపాదకులుగా పనిచేసారు.ఆ తరువాత తిరిగి పొనుగుపాడు గ్రామం వచ్చారు.

వెంకట నాగభూషణం గారిని రాజకీయ బాధితుడుగా ప్రభుత్వం గుర్తించింది.ఆయన మరణానంతరం భార్య సుబ్బమ్మకు ప్రభుత్వం ఫించను మంజూరు చేసింది.  పొనుగుపాడు సర్వే నెం.రు 818-1 (కోనాయకుంట) లో య.2-99 సెంట్లు, అదే నెం.రు 2 లో 2-50 సెంట్లు భూమికి పట్టా ఆమెకు మంజూరు చేసింది.

పొనుగుపాటి అప్పయ్య,జానికమ్మ దంపతుల వంశవృక్షం.(CLICK HERE)

ఈ పై వంశవృక్షం ప్రకారం మూల పురుషుడు వెంకంరాజు మదిమనవడు అప్పయ్య, మహలక్ష్మమ్మ. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. ప్రదమ కుమార్డు వెంకటప్పయ్య. ద్వితీయ కుమార్డు సుబ్బయ్య. తృతీయ కుమార్డు లక్ష్మయ్య.

అప్పయ్య శర్మ

తృతీయ కుమార్డు లక్ష్మయ్య, జానికమ్మఈ దంపతుల కుమార్డు అప్పయ్య శర్మ వరఫ్ అప్పయ్య. వీరిని ఎక్కువగా పంతులప్పయ్య అని పిలిచేవారు. ఆయన భార్య బ్రమరాంబ.

ఈ దంపతులు ఇప్పడు ఉన్న పెద్దవారికి బాగా తెలుసు.నాకైతే అప్పయ్య గారు గుర్తు లేదు గాని, బ్రమరాంబ గారు బాగా గుర్తు. వీరి ఇల్లు లోగడ బ్రహ్మంగారి దేవాలయం ఎదురుగా ఉండేది. ఈ దంపతుల సంతానం జానికి రామయ్య, లక్ష్మి నారాయణరావు.

గ్రంధాలయ కార్యదర్శిగా పనిచేసిన జానికి రామయ్య

ప్రధమ కుమార్డు జానికిరామయ్య 1930 ఆ ప్రాంతం లో పొనుగుపాడు శ్రీ శారదా గ్రంధాలయ కార్యదర్శిగా పనిచేసారు.ఈయన భార్య హనుమాయమ్మ.

ఈ దంపతుల సంతానం ఇద్దరు కుమారులు వెంకటేశ్వర శర్మ, మురళీధరరావు. ఒక కుమార్తె సీతమ్మ.

ప్రధమ కుమార్డు వెంకటేశ్వరశర్మ చీరాల ఆర్.టి.సి. లో సీనియర్ ట్రాఫిక్ ఇనస్పెక్టరుగా పని చేసి 1993 జూన్ 30 న పదవీ విరమణ పొందారు. తదుపరి చీరాలలోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.

ప్రస్తుతం 80 సంవత్సరంల పైబడి వయసులో ఉండి భార్య బేబి సరోజినితో పొనుగుపాడు సమీపంలో నున్న గుండాలపాడు గ్రామంలో సోదరి సీతమ్మ వద్ద శేష జీవితం గడుపు చున్నారు.ద్వితీయ కుమార్డు మురళీదరరావు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్సు కంపెనిలో పనిచేసి 2001లో పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం మంగళగిరిలో స్థిర నివాసంతో శేష జీవితం గడుపుచున్నారు.

ద్వితీయ కుమార్డు లక్ష్మి నారాయణ వరప్ లక్మయ్య.వీరి భార్య ఆదిలక్ష్మమ్మ.లోగడ వారు నివశించిన ఆ ఇంటిని ప్రస్తుతం నివాసం ఉంటున్న యలం సూర్యనారాయణ తండ్రి విశ్వనాధం విక్రయం చేసారు.ఈ దంపతుల సంతానం కుమార్డు వెంకట సుబ్బారావు. కుమార్తెలు ఇద్దరు.లక్ష్మీకామేశ్వరి, కుసుమకుమారి. ఆదిలక్ష్మమ్మ చివరి కాలంలో కుమార్తెలుతో నరసరావుపేటలో నివసించింది. కుమార్డు వెంకటసుబ్బారావు కాలం చేసినట్లుగా తెలుస్తుంది.

మరి కొందరి వంశీయుల ఫొటో గ్యాలరీ

[/vc_column_text][vc_media_grid element_width=”3″ item=”basicGrid_NoAnimation” initial_loading_animation=”none” grid_id=”vc_gid:1496231474989-d3d5c285-ce06-10″ include=”13873,13877,13878,13875″][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row]

కళ్ల చెరువు గ్రామం వలస వెళ్లిన  ప్రసాదరావు పూర్వీకులు

చదవటానికి ఈ లింకు పై క్లిక్ చేయండి

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …

12 comments

  1. 1. On the ruins of Ramalingeswara Temple, built by Chola King Kulottunga-I, a new Temple was constructed by villagers some time in 1965. Shri Katta Subbiah garu took keen interest, collected donations and completed the task.

    The Statue(vigraham) of Anjaneya Swami was brought from Village-Ameenabad, Mandal-Phirangipuram. This statue was retrieved from a very ancient abandoned Temple of Ameenabad village. Later Smt Kakarla Achamma garu, sister of shri Garikapati Ramaswami and Viswanatham got the Dhwaja Sthambham installed.

    Shri Manulonda Venkateswarlu garu donated a Manyam of – acres to the Pujari Family ( Kakumanu Seshiah and later his youngest son Somasundaram garu for rendering Temple Service.

    2 The Kulottunga Chola-1 was son of Raja Raja Narendra.Three successive generations of Eastern Chalukya Kings of Vengi ( Peda Vegi,near Eluru) married daughters of Chola kings of Tiruchirapalli/ Thanjavur.

    Vimaladitya (Ruled 1011-1018 AD) married Kundavai d/o Chola Raja Raja-I. His son Raja Raja Narendra ( Ruled 1022-1061 AD) married Ammangadevi d/o Rajendra Chola-I .Poet Nannaya who started translation of mahabharat into Telugu was patronised by Raja Raja Narendra.

    His son Rajendra-1 married Madhurantaki d/o Chola Rajendra Deva-II . This Rajendra Chalukya-I inherited Chola throne in 1070AD. and assumed the Title Kulottunga Chola – I . He combined Chola and Eastern Chalukya Kingdoms and ruled both.The Vengi part was ruled by his sons as Viceroys.

    3. Since the concentration of the King centered around Chola Kingdom, gradually the grip on Vengi part declined.The Durjaya Rulers of Velnadu from Tsandole ( Chandole) near Repalle acquired prominence. They were Kammas and ruled as Agents of Chola Soverigns.The daughter of Velnadu family, Mailamma married Anugu Raju of Palnadu. Her son Nalagama Raju again took his wife from Velnadu Family. The Palnadu war occured some time in 1176-82 AD. As a consequence of Panadu war, the Velnadu Kingdom became weak.

    4. The Kakateeya King Rudra Deva took advantage and killed King Gonka-III of Velnadu in 1186AD and occupied region south of the river Krishna upto Tripuranthakam. But Velnadu rule continued in the northern part of Vengi i.e in Godavari area. Finally Kakateeya Ganapati Deva killed King Prudhveeswara -II of Venadu Durjaya dynasty in 1207 AD and brought entire Telugu territories under his Rule.
    Request: Family tree of Kakumanu Seshiah garu,( wife Bhagyamma garu) the priest of Shiva Temple may pl be uploaded. Gothram etc. Three sons Nageswara Rao, Siva Sankara Rao, Soma Sundaram. Nageswara Rao had two sons. Soma Sundaram has two sons, one daughter. Siva Sankara rao – no children.

  2. ప్రసాద్ పొనుగుపాటి. హైదరాబాద్

    శుభోదయం, మన పొనుగుపాడు సైట్ నిర్వహిస్తున్న శ్రీ యర్రా రామారావు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .ఈ వెబ్సైట్ ద్వారా చాలా విలువైన సమాచారం తెలుసుకుంటున్నాము.

    125 సంవత్సరాల క్రితం పొనుగుపాడు నుండి మా ముత్తాత గారు శ్రీ పొనుగుపాటి వెేంకట రమణయ్య గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామవరపుకోట మండలం, చింతలపూడి తాలుకాలో ఉన్న కళ్ళచెరువు గ్రామంనకు వలస వెళ్లటం జరిగింది . మా తాత గారు పొనుగుపాటి కోటేశ్వరరావు గారు అక్కడే టీచర్ గా పనిచేసారు.

    మా తండ్రి గారు పొనుగుపాటి ప్రకాశరావు గారు చాల కాలం ఏలూరు అగ్రికల్చర్ డిపార్టుమెంటులో పని చేశారు. శ్రీ రామారావు గారు చేస్తున్న కృషి అమోఘం . మా ఏడు తరాల చరిత్రను సుమారు 2 శతాబ్దాల వంశ వృక్షం మాకు పంపడం జరిగింది (మొదటి తరం పాపరాజు గారి నుండి).

    పొనుగుపాటి వంశానికి మూల పురుషుడుగా పొనుగుపాటి వేంకట మంత్రి గారని మా పూర్వీకులు చెప్పేవారు. ప్రసాద్ పొనుగుపాటి. హైదరాబాద్ . మొబైల్ నెంబర్ .8143551440

  3. Thanks Prasad garu mee father name Prasada Rao Is it correct. I am Koya Rama Rao Ponugupadu. Mee Tata garu mana teacher garu in elementary school and he is trustee of Ramalayam and Anjaneya swamy temple is it correct.

  4. ప్రసాదరావు గారి పూర్వీకులు 125 సంవత్సరాల క్రితం పొనుగుపాడు నుండి ముత్తాత శ్రీ పోనుగుపాటి వెంకట రమణయ్య గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కు 25 కిలోమీటర్స్ లో కామవరపుకోట మండలం, చింతలపూడి తాలుకా లో ఉన్న కళ్ళచెరువు గ్రామం కు వలస వెళ్ళటం జరిగింది.

    ప్రసాదరావు గారి తాత పోనుగుపాటి కోటేశ్వర రావు గారు అక్కడే టీచర్ గా పనిచేసే వారు. ప్రసాదరావు గారి తండ్రి పోనుగుపాటి ప్రకాశరావు గారు చాల కాలం ఏలూరు అగ్రికల్చర్ డిపార్టుమెంటు లో చేశారు.శ్రీరామరాజ్యంలో బాల హనుమంతునిగా నటించిన పవన్ శ్రీరామ్ ప్రసాదు గారి అబ్బాయి.

    చరిత్ర సేకరించే పనిలో భాగంగా ఈ వివరాలు తెలిసినవి.కాని మీరు అనుకున్నట్లు మన ఊరిలో పని చేసిన కోటేశ్వరరావు పంతులు గారు కాదు.వీరు కూడా మన పొనుగుపాడు నుండి వలస పోయిన పొనుగుపాటి వంశీయుల వారసులు.

  5. ponugupati prasada rao

    పొనుగుపాడు గ్రామ ప్రజలకు,ఊరి పెద్దలకు నమస్సుమాంజలి.

    మన గ్రామం లో జరిగిన శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100 సంవత్సరాల వేడుకలలో నేను , నా కుటుంబసభ్యులు పాల్గొనటం మా పూర్వ జన్మ సుకృతం గా బావిస్తున్నాను .

    నా రక్త సంబందీకులు ఈ గ్రామానికి సంబందించిన వారని , వారి ద్వారా ఈ గ్రామానికి మంచి పేరు వచ్చిందని , అంతే కాక మా పూర్వీకులు పొనుగుపాడు గ్రామ గడ్డను ఎత్తిన మా పొనుగుపాటి వంశీయుల వారసులం గా మేము పొనుగుపాడుకు రావటం ఎంతో ఆనందకర విషయం .

    మా ముత్తాత పొనుగుపాటి వేంకటరమణయ్య గారు ఇక్కడ 1892-1893 వ సంవత్సరం” (నందన నామ సంవత్సరం) పొనుగుపాడు గ్రామం చుట్టుపక్కల కరువు తాండవించినందున ఆసందర్భంలో పొనుగుపాడు నుండి పశ్చిమ గోదావరి జిల్లా,ఏలూరుకు సమీపం లోని చింతలపూడి తాలూకా,కామవరపుకోట మండలం ” కళ్ళచెరువు” గ్రామానికి వలస వెళ్ళినట్లు సమాచారం ఉంది.

    1928వ సంవత్సరంలో కొంత పొలాన్ని,ఇంటి స్థలాలను కళ్ళచెరువు గ్రామంలో బెజవాడ నివాసుల దగ్గర నుండి కొన్నట్లు ఆధారాలు వున్నవి. మా వంశానికి మూల పురుషుడు శ్రీ పాపరాజు గారు 1799-1800 వ సంవత్సరంలో ” సిద్ధార్ధ” నామ సంవత్సరం లో పొనుగుపాడు గ్రామం లో “శ్రీ ఆంజనేయ స్వామి” దేవాలయం నిర్మించినట్లు మా పూర్వీకుల తెలియచేసారు.

    1960-70 దశకం లో మా నాన్న గారు పత్రికల ద్వారా పొనుగుపాడులో నూతనంగా హైస్కూల్ నిర్మాణం జరిగినట్లు తెలుసుకొని పొనుగుపాడు గ్రామానికి వచ్చినట్లు మానాన్న గారి ద్వారా తెలిసింది .

    ఆ సమయంలో ప్రభుత్వ లామ్ ఫార్మ్ లో ఉద్యోగ రీత్యా గుంటూరు లో నివసించేవారు. అక్కడ పనిచేసేటప్పుడు 1968 వ సంవత్సరం లో నేను (పొనుగుపాటి ప్రసాద రావు ) గుంటూరులోనే జన్మించాను . ఇంకా సమాచారాన్ని సేకరిస్తున్నాను.

    నాకు తెలిసిన సమాచారాన్ని మీతో ఎప్పటికప్పుడు పంచుకుంటాను. ” జనని జన్మ భూమిశ్చ స్వర్గా దపి గరీయసి.”. ధన్వవాదాలు. మీ పొనుగుపాటి ప్రసాద రావు .

  6. The name ‘Ponugupadu’ is possibly due to presence of ” Ponuku Tree ” in the forests around the village in the earlier times. Scientific name ‘gyrocarpus jacquini’ or ‘gyrocarpus asiaticus’. The wood of this tree is soft and is used for making the famous ‘Kondapalli toys’. Incidentally another village by same name exists in Krishna District.

  7. Sir This information useful to all of the people of Ponugupadu village

  8. Seetaram Ponugupati

    Thank you for posting the vamsavruksham online. We had another copy of the same, however, was lost in time. I am the one mentioned as Seetaram Anjaneyulu in the vamsavruksham part2 pdf. I have some pictures of my ancestors, can send at request.

  9. పోనుగు పాటి వెంకట మంత్రి, శృంగవరపుకోట ను పరిపాలించిన ముఖి కాసిపతిరాజు గారి మంత్రి అని ఆడిదం సూరకవి గారి చరిత్రలో ఉన్నది.

  10. మీ సెల్ నెంబరు తెలపగలరు

  11. We are also from Ponugupati Venkata Mantri Family.,, Who belongs to Srungavarapu Kota of Vizianagaram District ( AP)
    This Ponugupati Gotram is Srivatsasa.
    Thir Rushi s are Aapluva, Chavana, Bhargava, Aurava,& Jamadagni.
    We are noted as Golkonda Vyaparlu of the Niyyogi Subsect.
    Our Lineage follows as below to the best of my Knowledge

    Ponugupati Veraraja Amatya( 1700 ad)
    Ponugupati Venkatamantri ( 1724 ad)
    Ponugupati ( Not Known)
    Ponugupati Baya nna
    Ponugupati Sri Rama chandramurthy
    Ponugupati Venkata Rayudu ( 1837 ad)
    Ponugupati Chinna Krishnayya (1867 ad)
    Ponugupati Ramadasu (1895 ad)
    Ponugupati Jaga nnadham ( 1921 ad)
    Ponugupati Saibabu( Its Me) ( 1961 )

    If somebody can help me in finding the details of Venkata Mantri Garu, I will be very much thankful to them.. I read the Adidapu Sura Kavi Poems and history Where I got some history of Venkata Mantri Garu

  12. pleas inform your Cell no

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *