ఆలయాల జీర్ణోద్ధరణ సందర్బంగా పొనుగుపాటి ప్రసాదరావు సందేశం

పొనుగుపాటి ప్రసాదరావు సందేశం

శుభ సాయంత్రం.

మన పొనుగుపాడు  గ్రామంలో మే 3 వ తేది నుండి 8వ తేది వరకు జరిగిన ఆధ్యాత్మిక జాతరలో శ్రీ ఆంజనేయ, శ్రీ సీతారామ స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ వినుకొండ అంకమ్మ తల్లి దేవాలయాలలో జీవ ద్వజస్తంబ, విగ్రహ ప్రతిష్ట సందర్బంగా నేను కుటుంబ సభ్యులుతో వచ్చి దేవాలయం ల అన్నిటిలో స్వాముల వారలకు నూతన వస్త్రములు సమర్పించుకునే అవకాశం కలిగినందుకు నాపూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను.

ఈ సందర్బంగా  పొనుగుపాడు గ్రామ ప్రజలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న పొనుగుపాడు ఆలయాల ధర్మకర్తల మండలిలకు , పొనుగుపాడు దేవాలయాల సేవా సమితి వార్కి, ఎన్నో శతాబ్దాలుగా గ్రామంలో ఒక ఆరోగ్య కరమైన వాతావరణాన్ని , ఆధ్యాత్మికకు ఆలవాలం గా గ్రామాన్ని తీర్చి దిద్దిన గ్రామ పెద్దలకు , మా తోటి గ్రామ ప్రజలకు మా పొనుగుపాటి వంశం తరుపున హృదయ పూర్వక నమ:సుమాంజలి.

“సర్వేజనా:సుఖినోభవంతు” – ” జనని జన్మ భూమిశ్చ స్వర్గా దపి గరీయసీ ” 

ప్రసాదరావు తంఢ్రి ప్రకాశరావు.
తల్లి సీతాదేవి.

అన్న పెద్దల ఉవాచలను సార్ధకం చేస్తూ, గ్రామం లోని ప్రజలందరూ ఒక్క త్రాటి మీద నిలబడి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటం పొనుగుపాడు గడ్డ చేసుకున్న అదృష్టం. ఎక్కడో పుట్టాం. ఎక్కడో పెరిగాం.ఎక్కడో జీవిస్తున్నాం.

కానీ మన పూర్వీకుల చరిత్రలను  తెలుసుకోక పోవటం, ఈనాటి  యాంత్రిక జీవితంలో సాధ్యం కావటం లేదు. ఈ పనిని నేటి సాంకేతికత ఆధారంగా ఒక మనపొనుగుపాడు.కామ్ ఆధారంగా ఈ గ్రామం గురించి, ఈ గ్రామం లో జన్మించి రాష్ట్రాలు, దేశాలు దాటి జీవిస్తున్న ఈ గ్రామం లోని గొప్ప వ్యక్తుల గురించి ఈ వెబ్ సైట్  ద్వారా ప్రపంచానికి తెలియ పరుస్తున్న వెబ్ సైట్  అడ్మిన్  గారికి నా హృదయ పూర్వక నమ:సుమాంజలి.

మా తాతల, తండ్రుల గ్రామం పొనుగుపాడు అన్నప్పుడు ఏమో ? ఆ గ్రామం ఎక్కడుందో ? అక్కడ ఇప్పుడు ఎవరు వున్నారో ? మన కెందుకులే అనే భావన నుండి నేను, నాది, నా వారు అనే భావనకు ఎదగటానికి ఈ సామాజిక మాధ్యమం ద్వారా నేను దగ్గరవడం చాలా ఆనందకరం. ఎందుకో 2016లో మన గ్రామంలో జరిగిన శ్రీగంగా అన్నపూర్ణ సమేత శ్రీకాశీవిశ్వేశ్వస్వామి వారి వందవ కళ్యాణం సందర్బమగా ఈ గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు నాలో ఏదో తెలియని అవినాభావ సంబంధం ఈ గ్రామం తో వున్నదనిపించింది .

నా పూర్వీకులు ఈ గ్రామం అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారని తెలుసుకొని ఆనంద పడ్డాను. ఇక్కడ జరిగే దైవ కార్యక్రమం లో మేము కూడా పాల్గొనటం మా పూర్వ జన్మ సుకృతం . మా పూర్వీకులు పొనుగుపాటి పాపారాజు గారి తరువాత, కొన్ని తరాల తరువాత మేము ఈ పుణ్య కార్యక్రమాలలో మేము పాల్గొనటం నిజంగా మా అదృష్టం .

మీ అందరి ఆధారాభిమానాలు, మీ అశ్శీసులు మాకుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ…

మీ అందరివాడు.

పొనుగుపాటి ప్రసాద రావు , ఛాయకుమారి , పవన్ శ్రీరామ్ , తనిష్క

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *