యువతా చెప్పానని కినుక వహించకమా!

యువతా చెప్పానని కినుక వహించకమా!

ఓ యువతా నీ ఓటు హక్కు దుర్వినియోగం చేయకుమా,

అవినీతి తెగులు, నేర చరిత్ర, లేని మంచి అభ్యర్థికి వేయాలి నీ ఓటు

అంతేగాదు అక్రమ మార్గాలలో సంపాదించిన నేరగాళ్లకు,

పీకల్లోతు కుంబకోణాలలో కూరుకుపోయిన వ్యక్తులకు

నీ ఓటు వేసి తదుపరి తప్పు చేసానని తపన పడకుమా!

మంచికి మారుపేరు గల వార్కి వేయాలి సుమా నీ ఓటు

ఈ దేశానికి పట్టిన అవినీతి రుగ్మతలు నుండి ఒడ్డున

పడగలవేయ సత్తా మీ యువతకు ఉందని మేమంతా

ఎదురు చూచుటను వమ్ము చేయకురా!

ఇంతేకాదు సుమా, అంతకన్నా ముందు మీరు

ఆరోగ్యంగా ఉంటేనే జాతి, దేశం బలంగా ఉండేది,

చెప్పానని కినుక వహించుక, కొద్దిగా ఆలోచించు సుమా,

మధ్యపానం, దూమపానం వధ్దురా! మాదకద్రవ్యాల జోలి

అసలు పోబోకురా! మీ ఆరోగ్యం బాగుంటే జాతికి, దేశానికి,

మిమ్మల్ని కన్నవార్కి, అంతకన్న కావలసింది

ఇంకేముంది గ్రహించు  మిత్రమా!

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *