- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

మన గ్రామ కాపరస్తులు మన పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ కొరిటాల శేషగిరిరావు గారు M.A., M.Sc., MS(U.S.A). వీరు మన పాఠశాలలో మొదటి బ్యాచ్ S.S.L.C.లో మొదటి ర్యాంక్ సాధించారు. వీరు కొరిటాల ఇందిరా శేషగిరిరావు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మన పాఠశాలకు ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ప్రారంభం సందర్భంగా కొరిటాల శేషగిరి రావు గారికి మన పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు సాంబశివరావు గారు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ , పూర్వ విద్యార్థి కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.