- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

చరిత్రలో ఈ రోజు 1957 ఫిబ్రవరి 20

నేటికి 67 సంవత్సరాల క్రిందట మనందరి ఇలవేల్పు “శ్రీ వెంకటేశ్వరుడిని నీవుండేదా కొండపై, నాస్వామీ నేనుండేదీ నేలపై”  అని కొలుస్తూ భాగ్యరేఖ చిత్రం విడుదలైన రోజు ఇదే. ఈ పాట తెలుగువారి గుండెల్లో బాగా హత్తుకుపోయిన సంగతి మనందరికీ  తెలుసు. గాయని పి.సుశీల పాడిన ఈ పాట జమునపై చిత్రీకరించారు. వాహినీ సినీ నిర్మాణ సంస్థ అధిపతులలో ఒకరైన బి.ఎన్.రెడ్డి బయట నిర్మాతల కోసం తీసిన మొదటి చిత్రం ఇది. ఈ చిత్రంలో తిరుపతి, తిరుమల కొండలపై చిత్రీకరించిన అనేక దృశ్యాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ చిత్రంలో హీరో ఎన్.టి. రామారావుకు అన్ని పాటలు  ఎ.ఎమ్. రాజా పాడటం ఒక విశేషం.ఈ చిత్రం తరువాత బి.ఎన్. రెడ్డి,  పూజాఫలం చిత్రాన్ని మాత్రమే బయట నిర్మాతల కోసం తీసాడు.