- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొనుగుపాడు.

పాఠశాల పూర్వాపరాలు.

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 90 [1]

ఉన్నత పాఠశాల నిర్మించిన సర్వే నెం, 512-1. య.2-17 సెంట్లు, 513-1. య.2.83 సెంట్లు. మొత్తం విస్తీర్ణం: య.5-00.లు.

పాఠశాల నిర్మాణంనకు ఉచితంగా స్తలం ఇచ్చిన దాతలు: శ్రీయుతులు 1. రాయంకుల వెంకయ్య 2. మర్రి విశ్వేశ్వరరావు, గోపాలకృష్ణయ్య, 3. యామాని కోటయ్య, 4. కట్టా ఆదినారాయణ, రామకోటయ్య, వెంకయ్య, 5. గరికపాటి రామస్వామి, విశ్వనాధం, 6. శ్రీమతి కాకర్ల అచ్చమ్మ.

మంజూరు ఉత్తర్వులు సంఖ్య: అర్.ఒ.సి.2030-జి2-1951, తేది.29.06.1951./ డి.పి.ఐ./ ఉమ్మడి మద్రాసు రాష్టం.

ప్రారంభించిన తేది: 06.07.1951. మొదట ప్రారంభించిన బిల్డింగు: శివాలయంనకు చెందిన సత్రం  (రాయంకుల తాతయ్య పంతులు గారి బడిలో)

మొదటి ప్రధానోపాధ్యాయులు: శ్రీ వై.కిష్ణమూర్తి. మొదట పనిచేసిన మీనియల్ సిబ్బంది. 1. శ్రీ సుంకుల నారాయణ (అటెండర్) 2.శ్రీ జొన్నలగడ్డ రామస్వామి. (నైట్ వాచ్ మన్).

computer-lab-opening-in-zph-school-3 [2]ఉన్నత పాఠశాల కంప్యూటరు ల్యాబ్ నిర్మాణం.  “కొరిటాల ఇందిరా శేషగిరిరావు చారిటబుల్ ట్రష్టు” విరాళం 3.5 లక్షలతో జన్మభూమి పథకం క్రింద నిర్మించబడింది.

కంప్యూటరు ల్యాబ్ ను 19.05.2002 న  అప్పటి రాజ్యసభ సభ్యులు శ్రీ యడ్లపాటి వెంకట్రావు ప్రారంబోత్సవం చేసారు.

కార్యక్రమానికి అప్పటి సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ యలమంచిలి వీరాంజనేయులు అధ్యక్షత వహించారు.

కార్యక్రమానికి అప్పటి గుంటూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వెంపరాల వెంకటేశ్వరరావు,  జిల్లాపరిషత్ చైర్మెన్ శ్రీ పాతూరి నాగభూషణం,  గ్రామ పంచాయితి సర్పంచ్ శ్రీమతి  షేక్ మహబూబా, తదితరులు గౌరవ అతిధులుగా హాజరైయ్యారు.

ల్యాబ్ నిర్మాణం ప్రముఖ పారిశ్రామికవేత్త  శ్రీ వంకాయలపాటి బలరామకృష్ణయ్య పర్వేక్షణలో  శ్రీ వంకాయలపాటి సుధాకరరావు, శ్రీ రాయుడి చంద్రశేఖరరావు, అప్పటి గ్రామ పంచాయితి వైస్ ప్రెసిడెంట్ శ్రీ కర్లపూడి రాఘవరావుల పర్వేక్షణలో నిర్మించబడింది.

పూర్వ విద్యార్థుల సంఘం కార్యనిర్వాహకవర్గం.

2013-2014 విద్యాసంవత్సరం పదవ తరగతి పాఠశాల ప్రథమ విద్యార్థులు.