- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

టీ బండే రేయంబవుళ్లు వృద్దదంపతుల నివాసం

వృద్ద దంపతులు జీవన ప్రయాణం

పై ఫొటోలోని వృద్ద దంపతులు  వెంకటేశ్వర్లు (70 సం.) , నాగేంద్రమ్మ (60 సం.). వీరిది పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట. వెంకటేశ్వర్లు భార్య సామ్రాజ్యం పుట్టిల్లు నరసరావుపేట మండలంలోని దేచవరం. వీరికి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. వీరికి నరసరావుపేట రైల్వేస్ఠేషను సమీపంలో ఉన్న కొద్దిపాటి ఇంటిని 20 సంవత్సరాల కిందట ఒక లక్ష రుపాయలకు అమ్మి, దానిని తాకట్లు పెట్టి  తీసుకున్న 30000, దానికి వడ్డీ కింద 20000  మొత్తం 50000 పోను మిగిలిన 50000 సొమ్ముతో ఆడపిల్లల పెండ్లిల్లు చేసారు. పెద్ద కొడుకు గుండె జబ్బుతో పెండ్లి  తరువాత కొంత కాలానికి చనిపోయాడు. చిన్న కొడుకు గుంటూరులో అతి కష్టంగా తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఇక పోతే వీరిద్దరూ సుమారు ఆరు, ఏడు  సంవత్సరాల నుండి రైల్వే స్ఠేషను ప్రధాన గేటు ఎదురుగా ఉన్న మునిసిపాలిటీ ఓవర్ హెడ్ ట్యాంకు గేటు పక్క, వాహనాలు వచ్చేపోయే రోడ్డులో  టీ బండి నడుపుకుంటూ రాత్రిబవళ్లు నివాసం అక్కడే సాగిస్తున్నారు. వెంకటేశ్వర్లు రాత్రి టీ బండిమీద చింపిరి గుడ్డలతో (దాదాపుగా ఎప్పుడూ అలానే ఉంటాడు)  పడుకుంటే, సామ్రాజ్యమ్మ దాని పక్కనే చిన్న మంచం వేసుకుని తెల్లవార్లు దోమలు భాధకు విసురుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అక్కడ టీ కూడా ఎక్కువ మంది తాగని పరిస్థితి ఉంది. వెంకటేశ్వర్లుకు ప్రభుత్వం ఇచ్చే వద్దాప్య పించను అందుతుంది. అయితే వారిద్దరిలో ఎటువంటి బాధను కనపర్చకపోవటం చాలా విశేషం. ఈ పరిస్థితులలో వారిని సంతానం పట్టించుకోవటంలేదని  ఎలా అనగలం. ఇలాంటి నిర్బాగ్యులు ఇంకా ఎంతమంది ఉన్నారో? ఇది ఒక అంతులేని ప్రశ్న.