- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

పదవ తరగతిలో ప్రధమ స్థానం సాధించిన మౌనిక.

అక్క జాహ్నవి బాటలోనే మౌనిక

[1]
మౌనిక

ఎంతో ఘన వ్యయ ప్రయాసలతో వందలాది మంది విద్యార్థులు, కార్పోరేట్ విద్యాసంస్థల నందు చదువుచున్నారని మనందరకు తెలుసు.

అటువంటి ఈ రోజుల్లో మరో గ్రామం, ఇంకొక పాఠశాల విషయం తెలియదు.బండారు రవీంద్రబాబు, కోటేశ్వరమ్మ దంపతులకు ద్వితీయ కుమార్తెగా జన్మించింది.చిన్నతనం నుండి పొనుగుపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల లోనే చదివింది.

మన మన పొనుగుపాడు జెడ్.పి.హెచ్. పాఠశాల 2016-17 విద్యా సంవత్సరం  పదవ తరగతి  పరీక్షా ఫలితాలనందు 9.5 గ్రేడుతో  స్కూలు ప్రథమ స్థానం సాధించింది.

సంకల్పబలం ఉంటే దూర తీరాలపై ఆశ పడాల్సిన అవసరం లేదని నిరూపించిది.ప్రభుత్వ పాఠశాల లను చిన్న చూపు చూసేవారికి  కనువింపు కలుగ చేసింది.

అలాగే అదే పాఠశాలలో పదవ తరగతి 9.3 గ్రేడుతో దూదేకుల ఆషా స్కూలు రెండవ స్థానం సాధించింది. తండ్రి మీరావలి, తల్లి  నసీమా.ఆ విద్యార్థులకు అందరూ జేజేలు పలికారు.

అలాగే ఈ పాఠశాల పదవ తరగతి ఫలితాలనందు 96% ఉత్తీర్ణత సాధించినందుకు, ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మావతిని, ఉపాధ్యా యులను, విద్యార్ధుల తల్లిదండ్రులు అభినందించారు.

విద్యార్ధులకు. తల్లిదండ్రులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ఈ సందర్బంగా www.manaponugupadu.com శుభాకాంక్షలు.