- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

పొనుగుపాడు బిడ్డ కోటినాగలక్ష్మి కవితలు.

మన ఊరి అమ్మాయే!..

[1]సుంకుల వీరయ్య మనవరాలు. తండ్రి రామకనకం. తల్లి సీతమ్మ. కోటి నాగలక్ష్మి వృత్తి పరంగా సాప్టువేర్ కంపెనిలో సీనియర్ అనలిష్ట్ గా హైదరాబాదులో ఉద్యోగం. ప్రవృత్తిగా కవితలు వ్రాయటంపల్లెటూరులో పుట్టి పెరిగినవారి భావాలు,ఆతరువాత పట్నంనకు వెళ్లిన  వారి భావాలు ఎలా ఉంటాయో ఈ కవితలలో మనకు కొట్టవచ్చినట్లు అర్ధంమవుతుంది.అంతేగాదు సంఘంలో మోసపోయినవారి కసి భావాలు, భగ్న ప్రేమికుల జ్వాలలు ఉన్నాయి. ప్రకృతిని పరిరక్షించవలసిన భాధ్యతలను గుర్తెరెగచేసింది. ఇంకా సంఘంలో జరుగుచున్న అన్యాయాలు కవితలు,కథానికలు రూపంలో ప్రతి వారికి అర్ధమయ్యే తెలుగు భాషలో సుమారు 50 పైగా వ్రాసి తన స్వంత బ్లాగులో పొందు పర్చింది. ఇది మన పొనుగుపాడు ప్రజలు అందరు గర్వించతగ్గ విషయం.ఆ కవితలును మనం ఒకసారైనా చదివి మన ఊరి బిడ్డ కోటినాగలక్ష్మిని కామెంట్లు రూపంలో సమాజానికి మరిన్నిమంచి కవితలు, కథానికలు అందించటానికి ప్రోత్సహించుదాం.  

https://maayainsights.blogspot.in [2]

 ఆ కవితలుపై క్లిక్ చేసి చదవచ్చు