- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

మాగులూరి బసవాచారి.

విశ్రాంతి మండల రెవిన్యూ అధికారి

maguluri-basavachari-retd-mro [1]పొనుగుపాడు గ్రామంలో మాగులూరి నాగభూషణం, సత్వవతి దంపతులకు ప్రథమ సంతానంగా 01.07.1947న జన్మించారు.

తండ్రి వృత్తి అగసాలి. (కంసాలి). సోదరుడు నరసింహాచారి, సోదరి పిచ్చమ్మ.

ప్రాథమిక విద్యాబ్యాసం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు హిందూ ప్రాథమిక పాఠశాల, పొనుగుపాడులో చదివారు.(1953-1957).

ఉన్నత పాఠశాల విద్య ఆరవ తరగతి నుండి యస్.యస్.యల్.సి. (11 వ తరగతి) వరకు పొనుగుపాడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. (1958-1963).

గుంటూరు జిల్లా, ముప్పాళ్ళ మండలం, మాదల గ్రామానికి చెందిన కొణికి దుర్గా ప్రసాద్, గోవిందమ్మ దంపతుల కుమార్తె  ప్రమీలాదేవిని వివాహమాడారు.

బసవాచారి తండ్రి నాగభూషణం బంగారం పనిముట్లు చేయుటలో నమ్మకమైన వృత్తికారుడు. చుట్టు ప్రక్కల గ్రామాల కుటుంబాలకు చెందిన వారి వివాహాలకు, ఇతర కార్యక్రమాలకు నాగభూషణం  చేత ఆభరణాలు చేయించేవారు.

ప్రసిద్ది పొందిన అగసాలి వృత్తికారుడు. వృత్తిలో మోసానికి తావు ఇవ్వటానికి జీవితంలో ఎక్కడ రాజీ పడిన వ్యక్తి కాదు.

ఆ కాలంలో ఆర్థికస్తోమత అంతంత మాత్రం ఉన్నవారు పైచదువులు చదివించలేక, టైపు నేర్చుకోవటానికి పంపేవారు. ఆ నేపథ్యంలో బసవాచారి ఇంగ్లీసు, తెలుగు  లోయర్, హైయర్ పరీక్షలలో ఉత్తీర్ణత పొందారు.

బసవాచారి ఉద్యోగ ఆరంగేట్రం 

మొదటగా బసవాచారి ప్రకాశం జిల్లా. చీరాలలో  స్పెషల్ డిప్యూటి కలెక్టరు కార్యాలయం, ల్యాండు ఎక్విజిషన్ యూనిట్ (యన్.యస్.పి) నందు 24.10.1968న టైపిష్టుగా చేరారు.అక్కడ 20.08.1972 వరకు పని చేసారు.

ఆ తరువాత కురిచేడు బదిలీ అయ్యారు. కురిచేడు స్పెషల్ డిప్యూటి కలెక్టరు, ల్యాండు ఎక్విజిషన్ యూనిట్, (యన్.యస్.పి) లో స్పెషల్ రెవిన్యూ ఇనస్పెక్టరు/టైపిష్టుగా 31.07.1978 వరకు పని చేసారు.

దరిమిలా ప్రకాశం జిల్లా కలెక్టరు కార్యాలయంలో 31.07.1979 వరకు, కురిచేడు స్పెషల్ డిప్యూటి కలెక్టరు, ల్యాండు ఎక్విజిషన్ యూనిట్, (యన్.యస్.పి) లో 30.06.1983 వరకు టైపిష్టుగా చేసారు.

ఫిర్కా రెవిన్యూ ఇనస్పెక్టరుగా ప్రకాశం జిల్లా, కనిగిరి తాలూకా, చంద్రశేఖరపురం, పామూరు, దర్శిల నందు 30.06.1985 వరకు చేసారు. 01.07.1990 నుండి సీనియర్ అసిస్టెంటుగా ప్రకాశం జిల్లా, పొదిలి, చీమకుర్తి. కారంచేడు మండల రెవిన్యూ కార్యాలయంలలో 30.06.1995 వరకు పనిచేసారు.

డిప్యూటి తహశీలుదారుగా పదోన్నతిపై మార్కాపురం మండలానికి బదిలీ అయ్యారు. అక్కడ ఆయన 30.06.1997 వరకు చేసారు. డిప్యూటి తహశీలుదారు (ఆర్.ఒ.అర్) గా గిద్దలూరు, యర్రగొండపాలెం, ఒంగోలు, ఇంకా పలుచోట్ల 31.12.2004 వరకు చేసారు.

చివరగా మండల రెవిన్యూ అధికారిగా పదోన్నతి పొంది 01.01.2005 నుండి 30.06.2005 వరకు ప్రకాశం జిల్లా చీరాలలో పని చేసారు.

పొనుగుపాడు ఆంజనేయస్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ నిర్మాణంనకు తన వంతు విరాళం ఇచ్చారు. జిల్లా పరిషత్ పాఠశాలకు పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా తగిన ఆర్థిక సహాయం అందచేసారు.

maguluri-basavachari-retd-mro-2 [2]ప్రసిద్ధి పొందిన కోటప్పకోండ (శ్రీత్రికోటేశ్వరస్వామి) ఆలయంవద్ద తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి కులానికి చెందిన సత్రంలో రెండు లక్షలతో గదిని కట్టించారు.

ఆయనకు ఇద్దరు కుమారులు. వెంకట సత్యశేఖర్ బాబు, వెంకటసత్య రవికుమార్. వివాహాలు జరిగి స్థిరపడినారు.

కుమారులు, మనవళ్ళు, మనవరాళ్లుతో ఉమ్మడిగా ప్రశాంతంగా నరసరావుపేటలో స్వంత గృహంలో విశ్రాంతి జీవితం గడుపుచున్నారు.