- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

వయో వృద్ధుల పురష్కారం చిత్రమాలిక.

(తల్లిదండ్రులను గౌరవించుట, వారి ఆలనా, పాలనా చూడటం మన భాధ్యత)

వృద్ధులైన తల్లిదండ్రులను దైవ సమానంగా ఆదరిస్తూ వారి జీవితానికి సార్దకత చేకూర్చాల్సిన బాధ్యత సమాజంలోని  ప్రతి కుటుంబ సభ్యునిపై ఉంది.గతంలో ఎన్నడూ ఎక్కడా జరగని రీతిలో వయోవృద్ధులకు సన్మాన కార్యక్రమాన్ని పొనుగుపాడు గ్రామంలో నిర్వహించుట చాలా విశేషం.

శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి శతజయంతి కళ్యాణ మహోత్సవం సందర్బంగా ముందుగా ఆలయ పాలకవర్గం వారు కుల మతాలకు అతీతంగా ఎనుభై సంవత్సరంలు దాటిన వృద్ధులను గుర్తించారు.24.03.2016న వారందరిని సాదరంగా ఆహ్వానించి, ఆలయ ప్రాంగణంలో బంధువుల, పెద్దల అందరి సమక్షంలో నూతన వస్త్రాలుతో బహుకరించారు.గ్రామస్తులు,బంధువులు, ఇతర పెద్దలు వయోవృద్ధులపై పూలజల్లు కురిపించి ఘనంగా సన్మానించి వారి ఆశీసులు పొందారు. 

ఆలయ పాలకవర్గం వారు వారందరికి నూతన వస్త్రంలు బహుకరించారు.ఈ కార్యక్రమం పొనుగుపాడు గ్రామంలో నిర్వహించుట అందరు హర్షించతగ్గ విషయం. పొనుగుపాడు పౌరులందరూ గర్వించ తగ్గ విషయం.

[smartslider3 slider=15]