- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

శాంతి కళ్యాణంలో పాల్గొనిన దంపతుల చిత్రమాలిక.

[vc_row][vc_column][vc_column_text]
ఫొటోగ్యాలరీ 

[1]

మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం 2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి    తెలుసు.

ఆ సందర్బంగా 26 వ తేది శనివారం  సాయంత్రం స్వామి వార్కి అత్యంతవైభవంగా శాంతి కళ్యాణం జరిగింది.

శాంతి కళ్యాణంలో 142 మంది దంపతులు  సాంప్రదాయ దుస్తులు ధరించి పీటల మీద కూర్చొని భక్తిప్రపత్తులతో కళ్యాణం తిలకించారు.

కుమార్తెలు ఉండి వివాహ సమయంలో కన్యాదానం చేయని దంపతులు, అలాగే కుమారులు మాత్రమే ఉండి కన్యాదానంనకు నోచుకోని దంపతులు కన్యాదానం చేసినంతటి ప్రతిఫలం కలుగుతుందని  పురాణాలు,శాస్త్రాల ద్వారా మనకు తెలుస్తుంది.

అంటే భర్త వైపు పది తరాలు,భార్య వైపు పది తరాలు వారు మోక్షమార్గం పొందుతారు. కుటుంబంలో శాంతిసౌభాగ్యాలు ఉంటాయి. కృతయుగంలో తపస్సుకు, త్రేతాయుగంలో జ్ఞానానికి, ద్వాపర యుగంలో యజ్ఞానికి, కలియుగంలో కన్యాదానానికి విశిష్ట స్ధానం ఉన్నట్లుగా పద్మ పురాణం చెపుతుంది.

పీటల మీద కూర్చొనిన దంపతులందరి చేత స్వామి వారికి తలంబ్రాలు పోయించి,

వారందరికి ఆలయ పాలకవర్గం తరుపున డాక్టరు మర్రి పెద్దయ్య వంకాయలపాటి బవరామకృష్ణయ్య, తదితరులు నూతన వస్త్రాలు బహుకరించారు.

ఆ చిత్రమాలికను క్లిక్ చేసి వీక్షించండి [/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=ze9io3CEdOw” align=”center”][/vc_column][/vc_row]