- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

సుంకుల రామాంజనేయులు.

జననం, విద్యాభ్యాసం

Sunkula-ramanjaneyulu [1]సుంకుల రామాంజనేయులు. వీరు పొనుగుపాడులో 01.07.1947న సాధారణ కుటుబంలో జన్మించారు. తల్లిదండ్రులు రామదాసు, ఆదెమ్మ దంపతులు. ప్రాధమిక విద్య,ఉన్నత పాఠశాల విద్య పొనుగుపాడు లోనే చదివారు.(1953-1963).అటు పిమ్మట పి.యు.సి. నరసరావుపేట శ్రీ సుబ్బరాయ, నారాయణ కళాశాలలో చదివారు (1964).

ఆ పైచదువులు బి.ఎ, (లిట్. ఇంగ్లీసు) హిందూ కళాశాలలో చదివి పట్టాను పొందారు.అటు తర్వాత నల్లపాడు (గుంటూరు) పోష్టు గ్రాడ్యేట్ సెంటరు, ఆంద్ర యూనివర్శిటీలో యం.ఎ. పట్టా పొందారు.

గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, మేరిగపూడి గ్రామానికి చెందిన నీలం గోపాలం, రత్తమ్మ దంపతుల ప్రధమ కుమార్తె శాంతిశ్రీరామ్ (మేనమామ కుమార్తె)ను 11.05.1966న వివాహమాడారు. రామాంజనేయులు, శాంతిశ్రీరామ్ దంపతుల సంతానం  కుమార్డు శ్రీహర్ష, కుమార్తె కవిత.

నాటక రచయిత, నాటక కళాకారుడు.

రామాంజనేయులు విద్యార్ధి దశలో మంచి నాటక రచయిత, నాటక కళాకారుడు. “ఆహుతి” అనే నాటికను రచించారు.ఈ నాటికను పొనుగుపాడు నవయువ లలితకళామండలి పేరుతో 1967లో ప్రదర్శించారు.ఈనాటికకు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో అప్పట్లో  సోషల్ అసిస్టెంటుగా పనిచేసిన పసల ఫ్రాన్సిస్  డైరక్టరుగా చేసారు.కొరిటాల శేషగిరిరావు పర్వేక్షణలో స్వగ్రామం పొనుగుపాడులో, ఇతర గ్రామాలలో పలుచోట్ల ప్రదర్శించారు.

aahuthi-natika-brundham [2]
Ramanjaneyulu 1st Person in siting (Left to Right)

ఈనాటికలో కనపర్తి గ్రామానికి చెందిన నాతాని వెంకటేశ్వర్లు (మాజీ సర్పంచి కీ.శే గుర్రం వెంకటేశ్వర్లు మేనల్లుడు) ‘హీరో’గా నటించారు.’నాయిక’గా మిస్.శాయి కుమారి నటించింది. కొరిటాల ప్రబాకరరావు ‘విలన్’ గా నటించారు.ఈనాటికలో రామాంజనేయులుతో పాటు హాస్యనటుడుగా షేక్ మొహిద్దీన్ పీరా నటించారు. ఇతర పాత్రలలో డా.యామాని వెంకట్రావు,కోయ శ్రీహరిరావు,కొంగర నరసింహరావు, కోయ వెంకటేశ్వరరావు, తదితరులు నటించారు.

ఇంకా పూలరంగడు, భారతి వినిపిస్తుంది, ప్రగతికి పెండ్లిచేద్దాం,  మొదలగు పలు నాటకాలు, నాటికలు ప్రదర్శించారు. అప్పట్లో ఆహుతి, పూలరంగడు నాటకాలు  బాగా పేరు గడించినవి.

భారతమాత యువజన సంఘం మాజీ కార్యదర్శి

పొనుగుపాడు గ్రామానికి చెందిన సరికొండ వెంకట కృష్ణంరాజు అప్పట్లో  గ్రామాభివృద్ధి అధికారిగా పనిచేసారు. వెంకట కృష్ణమరాజు సహకారంతో యర్రా నాగేశ్వరరావు, యామాని వెంకయ్య, మాచవరపు వెంకటప్పయ్య, షేకు మొహిద్దీన్ పీరా, కొరిటాల మురహరిరావు, మరి కొంతమంది కలసి పొనుగుపాడు యువతను దృష్టిలో పెట్టుకుని “భారతమాత  యువజన సంఘం” నొక దానిని 1966 ఆ ప్రాంతంలో స్థాపించారు.

అ యువజన సంఘం సెక్రటరీగా కొంతకాలం   రామాంజనేయులు వ్యవహరించారు. అ సంఘం ద్వారా యువతను  క్రీడల ద్వారా ఉత్తేజపరిచారు. అంతేగాదు అ సంఘం ద్వారా జిల్లా పరిషత్ పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి శ్రమదాన కార్యక్రమాలు చేపట్టారు.పొనుగుపాడు గ్రామానికి చెందిన  తూము వెంకటేశ్వర్లు (పంతులుగారు) 2002లో పొనుగుపాడు గ్రామ చరిత్ర 104,105 పేజీల నందు రామాంజనేయులు తాత వెంకయ్య అప్పట్లోనే రెండు అరకలు వ్యవసాయం చేసేవారని ఉటంకించారు.

సామాజిక సేవా కార్యకర్త

ఇంకా గ్రామ ప్రజలకు వెంకయ్య తనకు చేతనైనంత వరకు ఉచిత వైద్యం చేసేవారని తెలిపారు. రామాంజనేయులు యం.ఎ. చదివే రోజులలో తనకు చనువుగా నున్న రాజకీయ నాయకుల వల్ల రామాంజనేయులు కాంగ్రెసు పార్టిలో చేరి చదువును నిర్లక్ష్యం చేశాడని ఉటంకించారు.

water-Plant Ponugupadu [3]
వాటరు ప్లాంటు ప్రారంబోత్సవం సందర్బంగా మాట్లాడుచున్న రామాంజనేయులు.

అంతేగాదు రామాంజనేయులు పై అభిమానంతో రాజకీయాలలో పాల్గొని నష్టపోవద్దని తాను (తూము పంతులుగారు అని కూడా అంటారు) పలుమార్లు చెప్పానని తను వ్రాసిన పొనుగుపాడు చరిత్ర గ్రంధంలో ఉటంకించారు. ఇంకా తను చెప్పిననూ రామాంజనేయులు రాజకీయాలలో చేరి ప్రజలకు సేవ చేయాలనే భావనతో కాంగ్రెసు పార్టీలో చేరి చురుకైన కార్యకర్తగా పనిచేసారని వెంకటేశ్వర్లు పంతులుగారు తెలిపారు.

దానివలన ఆయన విద్యను నిర్లక్ష్యం చేసి  విద్యాపరంగా చాలా నష్టపోయాడని, లేకపోతే రామాంజనేయులుకు ఉన్న తెలివికి ఐ.ఎ.యస్ ఆఫీనరు అయ్యే వాడని తెలిపారు.ఆయనను ఉపయోగించు కున్న వారు  ఎవ్వరు ఆయనకు ఉపయోగపడ లేదని ఉటంకించారు. ఇప్పటికి గ్రామంలో జరిగే ప్రతి మంచి కార్యక్రామాలలో పాలుపంచుకుంటారు.

ఇంగ్లీసు లెక్షరర్ గా ఉద్యోగ ఆరంగేట్రం.

మెుదటగా శ్రీసుబ్బరాయ, నారాయణ కళాశాల నరసరావుపేటలో ఇంగ్లీసు లెక్షరర్ గా 1971 లో చేరి 1975 వరకు పని చేసారు. 1976 నుండి 1980 వరకు చీరాల రెసిడెన్సియల్ కాలేజిలో ఇంగ్లీసు బోధకుడుగానే పని చేసారు.గుంటూరు గొర్ల హనిమిరెడ్డి కళాశాలలో 1981 నుండి 1986 వరకు, మాజేటి గురవయ్య కళాశాలలో 1987 నుండి 2000 వరకు పనిచేసారు. ప్రస్తుతం అరువది ఏడు వసంతాలు గడిచిననూ రామాంజనేయులు నిరంతర శ్రమ జీవికి మారు పేరుగా చైతన్య కాలేజి, గుంటూరులో ఇంకా పనిచేస్తునే ఉన్నారు. ఇది నిజంగా అయనను అబినందించ తగ్గ విషయం.

రామాంజనేయులు కుమార్డు శ్రీహర్ష యం.యస్ (జనరల్ సర్జరీ) చేసారు. డాక్టరు శ్రీహర్ష ప్రకాశం జిల్లా, కనిగిరికి చెందిన రమణ బి.యస్.సి,. బి.యి.డి ని వివాహమాడారు.కుమారుడు డాక్టరు శ్రీహర్ష ప్రకాశం జిల్లా సంతమాగులూరు ప్రాధమిక ఆరోగ్యకేంధ్రం మెడికల్ ఆపీసరుగా కొంతకాలం పని చేసారు. ప్రస్తుతం డాక్టరు శ్రీహర్ష కాటూరి మెడికల్ కాలేజి, చినకోండ్రుపాడు, గుంటూరులో పి.జి చేస్తున్నారు.కుమార్తె కవిత బి.కామ్., చదివింది. కవిత వివాహం గుంటూరు నగరానికి చెందిన లింగాల శ్రీనివాసరావుతో జరిగింది. అల్లుడు శ్రీనివాసరావు  పబ్లిక్ హెల్తు డిపార్టుమెంటులో అసిస్టెంటు డైరక్టరుగా విజయవాడలో పనిచేస్తున్నారు.

రామాంజనేయులు ఉద్యోగరీత్యా గుంటూరులో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు.