- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

కోయ రామారావు, రాణి దంపతుల సేవా కార్యక్రమాలు.

[1]పేద విద్యార్ఝులకు భోజన పళ్లెంలు ఉచిత పంపిణీ.

పొనుగుపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పేద విద్యార్థులుకు రామారావు, రాణి దంపతులు 16.04.2015 న 100 స్టీలు ప్లేట్లు ఉచిత పంపిణీ చేసారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇంకా ఈకార్యక్రమంలో కోట్లింగయ్య, రాఘవయ్య, హరిబాబు, బాలరాజు, వెంకటేశ్వరరావు, వలి మాష్టరు, శివయ్య  మాష్ఠరు తదితర గ్రామ పెద్దలు హాజరైయ్యారు.

అన్నదానం కార్యక్రమం

[2]రామారావు అంద్రా బ్యాంకు మేనేజరుగా పనిచేసి నవంబరు 30 2015న పదవీ విరమణ చేసిన సంగతి మనందరకు తెలిసిన విషయమే.

స్వంతంగా ఇంట్లో భోజన పదార్థములు తయారుచేసి, పొన్నూరు మండలం, నిడుబ్రోలు గ్రామంలోని గోతలస్వామి ఆశ్రమంలోని వృద్ద దంపతులకు, అనాధలకు, వికలాంగులకు సుమారు 100 మందికి 08.12.2015న అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

రామారావు కుటుంబానికి ముఖ్య స్నేహితులు కటకం విజయకుమార్ రెడ్డి, గుర్రం చెన్నకేశవరెడ్డి (లేటు) కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పొనుగుపాడు గ్రామంలో ఉచిత కంటి పరిక్షలు 

కంటి పరిక్షల నిర్వహణ గోడ పత్రిక [3]అంతేగాదు రామారావు సౌజన్యంతో తన తండ్రి జ్ఞాపకార్థం గత రెండు సంవత్సరాల నుండి సేవా కార్యక్రమములు నిర్వహించుచపన్నారు.

స్వగ్రామంలో మరియు చుట్టుప్రక్కల పది గ్రామాల ప్రజలకు ఉచిత కంటి పరిక్షలు నిర్వహించారు.

యన్.ఆర్.ఐ. హాస్పటల్, విజయవాడ వారి ద్వారా 1500 మందికి  ఉచిత కంటి పరిక్షలు చేయించారు.  

వారిలో  అవసరమైన 600 మందికి సద్గురు సేవా సమితి, నరసరావుపేట  వారి సౌజన్యంతో కంటి ఆపరేషన్లు చేయించి  కళ్లద్దాలు ఇప్పించారు.