- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు

భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. సభ్యుల సంఖ్య 250. ఇందులో రాష్ట్రాల నుండి 229 మందిని, కేంద్రప్రాలిత ప్రాంతాల నుండి 9 మందిని ఎన్నుకొనగా, 12 స్థానాలకు వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు.

అయితే ప్రస్తుతం సభ్యుల సంఖ్య 245. ఇందులో రాష్ట్రాల నుండి 229, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 4 ఎన్నికకాగా, వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారిని 12 మందిని రాష్ట్రపతి ద్వారా నామినేట్ అవుతారు. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి రెండేళ్ళకు ఒకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ఆ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటాయి. అందులో భాగంగా 2024లో రాజ్యసభలో ఖాళీ అయిన 56  స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 27న ఎన్నికలను నిర్వహించింది.రాష్ట్రాల వారిగా ఈ దిగువ వివరించిన సభ్యులు ఎన్నికయ్యారు.

మొత్తం 56 మంది సభ్యులలో 50 మంది సభ్యులు 2024 ఫిబ్రవరి 3 నుండి పదవీకాలం ప్రారంభం కానుండగా, ఒడిశా , రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 6 గురు సభ్యులు 2024 ఏప్రిల్ 4 నుండి పదవీకాలం ప్రారంభంకానుంది.

తెలంగాణ

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 రేణుకా చౌదరి కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024
2 ఎం. అనిల్ కుమార్ యాదవ్ 03 ఏప్రిల్ 2024
3 వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ 03 ఏప్రిల్ 2024

ఆంధ్రప్రదేశ్

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 వై.వి.సుబ్బారెడ్డి వైసీపిీ 03 ఏప్రిల్ 2024
2 మేడా రఘునాథ్ రెడ్డి 03 ఏప్రిల్ 2024
3 గొల్ల బాబూరావు 03 ఏప్రిల్ 2024

ఉత్తర ప్రదేశ్

యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో బీజేపీ 8 స్థానాల్లో, రెండు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు గెలిచారు.] [1]

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 సుధాంశు త్రివేది బిజెపి 03-ఏప్రిల్-2024
2 రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ బిజెపి 03-ఏప్రిల్-2024
3 చౌదరి తేజ్వీర్ సింగ్ బిజెపి 03-ఏప్రిల్-2024
4 సాధనా సింగ్ బిజెపి 03-ఏప్రిల్-2024
5 అమర్‌పాల్ మౌర్య బిజెపి 03-ఏప్రిల్-2024
6 సంగీతా బల్వంత్ బిజెపి 03-ఏప్రిల్-2024
7 నవీన్ జైన్ బిజెపి 03-ఏప్రిల్-2024
8 సంజయ్ సేథ్ బిజెపి 03-ఏప్రిల్-2024
9 రామ్‌జీ లాల్ సుమన్

సమాజ్ వాదీ

03-ఏప్రిల్-2024
10 జయ బచ్చన్

సమాజ్ వాదీ

03-ఏప్రిల్-2024

ఉత్తరాఖండ్

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 మహేంద్ర భట్ బిజెపి 03 ఏప్రిల్ 2024

హిమాచల్ ప్రదేశ్

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 హర్ష్ మహాజన్ బిజెపి 03 ఏప్రిల్ 2024

హర్యానా

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 సుభాష్ బరాలా బిజెపి 03 ఏప్రిల్ 2024

బీహార్

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ టర్మ్ ప్రారంభం
1 ధర్మశిలా గుప్తా బిజెపి 03-ఏప్రిల్-2024
2 భీమ్ సింగ్ బిజెపి 03-ఏప్రిల్-2024
3 సంజయ్ కుమార్ ఝా జెడియు 03-ఏప్రిల్-2024
4 అఖిలేష్ ప్రసాద్ సింగ్ కాంగ్రెస్ 03-ఏప్రిల్-2024
5 సంజయ్ యాదవ్ ఆర్.జె.డి 03-ఏప్రిల్-2024
6 మనోజ్ ఝా ఆర్.జె.డి 03-ఏప్రిల్-2024

ఛత్తీస్‌గఢ్

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్ బీజేపీ 03 ఏప్రిల్ 2024

గుజరాత్

గుజరాత్ నుంచి నలుగురు బీజేపీ అభ్యర్థులు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 జెపి నడ్డా బిజెపి 03 ఏప్రిల్ 2024
2 గోవింద్‌భాయ్ ధోలాకియా బిజెపి 03 ఏప్రిల్ 2024
3 మయాంక్ భాయ్ నాయక్ బిజెపి 03 ఏప్రిల్ 2024
4 జస్వంత్‌సిన్హ్ సలాంసింహ పర్మార్ బిజెపి 03 ఏప్రిల్ 2024

కర్ణాటక

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 సయ్యద్ నసీర్ హుస్సేన్ కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024
2 అజయ్ మాకెన్ కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024
3 జిసి చంద్రశేఖర్ కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024
4 నారాయణ భాండాగే బిజెపి 03 ఏప్రిల్ 2024

పశ్చిమ బెంగాల్

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 నడిముల్ హక్ తృణమూల్ కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024
2 మమతా బాలా ఠాకూర్ తృణమూల్ కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024
3 సాగరిక ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024
4 సుస్మితా దేవ్ తృణమూల్ కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024
5 సమిక్ భట్టాచార్య బిజెపి 03 ఏప్రిల్ 2024

మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 ఎల్. మురుగన్ బిజెపి 03 ఏప్రిల్ 2024
2 ఉమేష్ నాథ్ మహారాజ్ బిజెపి 03 ఏప్రిల్ 2024
3 మాయ నరోలియా బిజెపి 03 ఏప్రిల్ 2024
4 బన్సీలాల్ గుర్జార్ బిజెపి 03 ఏప్రిల్ 2024
5 అశోక్ సింగ్ కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024

మహారాష్ట్ర

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 మేధా కులకర్ణి బిజెపి 03 ఏప్రిల్ 2024
2 అజిత్ గోప్‌చాడే బిజెపి 03 ఏప్రిల్ 2024
3 అశోక్ చవాన్ బిజెపి 03 ఏప్రిల్ 2024
4 మిలింద్ దేవరా శివసేన 03 ఏప్రిల్ 2024
5 ప్రఫుల్ పటేల్ ఎన్‌సీపీ 03 ఏప్రిల్ 2024
6 చంద్రకాంత్ హందో కాంగ్రెస్ 03 ఏప్రిల్ 2024

ఒడిశా

ఒడిశాలోని మూడు స్థానాలకు ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 దేబాశిష్ సామంతరాయ్ బీజేడీ 04 ఏప్రిల్ 2024
2 సుభాశిష్ ఖుంటియా 04 ఏప్రిల్ 2024
3 అశ్విని వైష్ణవ్ బీజేపీ 04 ఏప్రిల్ 2024

రాజస్థాన్

వ.సంఖ్య ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 సోనియా గాంధీ కాంగ్రెస్ 04 ఏప్రిల్ 2024
2 చున్నిలాల్ గరాసియా బిజెపి 04 ఏప్రిల్ 2024
3 మదన్ రాథోడ్ బిజెపి 04 ఏప్రిల్ 2024

రాష్ట్రపతి నామినేట్ ద్వారా నామినేట్ అయిన సభ్యులు

వ.సంఖ్య నామినేటెడ్ ఎంపీ ఏరంగంలో ప్రసిద్ధులు రాష్ట్రం పదవీకాలం ప్రారంభం
1 సత్నామ్ సింగ్ సంధు విద్యారంగం పంజాబ్ 30 జనవరి 2024