బత్తల మానస
మన పొనుగుపాడు జెడ్.పి.హెచ్. పాఠశాల 2018-19 విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాలనందు 9.8 గ్రేడుతో బత్తల మానస స్కూలు ప్రథమ స్థానం సాధించింది. సంకల్పబలం ఉంటే దూర తీరాలపై ఆశ పడాల్సిన అవసరం లేదని నిరూపించిది. ప్రభుత్వ పాఠశాలలను చిన్న చూపు చూసేవారికి కనువింపు కలుగ చేసింది. పాఠశాల తరుపున 39 మంది విద్యార్థులు హాజరుకాగా 37 మంది (94.87 %) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బత్తుల మానస ప్రధమ స్థానం సాదించగా, బండారు నమో వెంకట్ (9.7) ద్వితీయ స్థానం సాదించగా, గద్దె మౌనిక (9.3) తృతీయ స్థానం సాధించింది. వీరందరికి శుభాకాంక్షలు