పొనుగుపాడు, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం.522549. ఎస్.టి.డి.కోడ్=08647.ఈ గ్రామం గడ్డ ఎవరు ఎప్పడు ఎత్తారో ఇదమిత్ధముగా ఆధారం లేదు. కాకపోతే ఈ గ్రామానికి చెందిన తూము వెంకటేశ్వర్లు (పంతులుగారు) రాసిన ‘పొనుగుపాడు గ్రామ చరిత్ర’ లో ఖండ్రిక రేగులగడ్డ దగ్గర పొనుగుపాటి అగ్రహారీకులనబడే బ్రాహ్మణులు తమకిచ్చిన అగ్రహారం భూమి సారవంతమైంది కానందున పరిసర గ్రామాలలోని వారితో, లోగడ గ్రామం లోని పాటిమీద ఉన్న గ్రామస్తులతో కలిపి, ప్రస్తుతం పొనుగుపాడు ఉన్నచోట పొనుగుపాటి వంశీయులైన నియోగి బ్రాహ్మణులు గడ్డెత్తి, వారి వంశం పేరుతో ‘పొనుగుపాడు’ అని నామకరణం చేసినట్లుగా ఉటంకించారు. ఇందుకు ఎటువంటి ఆధారాలు లేవు.
పూర్వం ఈ గ్రామానికి ‘వొణుకుబాడు’ అనే పేరు వాడికలో వున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ వారు ప్రచురించిన గుంటూరు జిల్లా గ్రామ కైఫియ్యత్తులు మూడవ భాగం పేజి నెం. 204, 205 ల ద్వారా తెలుస్తుంది.
అప్పుడు ఈ గ్రామం ముర్తిజానగరు సర్కారు (The Persian name of Guntur) క్రింద చింతపల్లి తాలూకాలో ఒక భాగమైన నాదెండ్ల గ్రామ పరిధిలో చేరిన చిన్న పల్లెగా ఉండేదని తెలుస్తుంది.
(వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పరిపాలనలో చింతపల్లి ఒకప్పటి రాజధాని, ప్రస్తుతం అచ్చంపేట మండలానికి చెందిన గ్రామం) ఆ తరువాత ఉచ్ఛారణలో మార్పులు వచ్చి’పొణుకుపాడు’ అనే పేరుతో పిలచినట్లుగా గుంటూరు జిల్లా గ్రామ కైఫియ్యత్తులు నాలుగవ భాగం పేజి నెం. 192, 193 ల ద్వారా తెలుస్తుంది.
తరువాత కొంత కాలానికి ఈ గ్రామం ముర్తిజానగరు సర్కారు క్రింద చింతపల్లి తాలూకాలో, ఒక భాగమైన తాళ్ళూరు హైవేలి (నగరు) పరిధిలో చేరిన చిన్న పల్లెగా ఉండేదని కైఫియ్యత్తుల ద్వారా తెలుస్తుంది.
ఆకాలంలో పరిసరాలు పరిశుభ్రంగా లేనందున కలరా, మశూచి, టైఫాయిడ్ ఇతర అంటువ్యాధులు వ్యాపించి గ్రామాలకు గ్రామాలు తుడిచి పెట్టుకుని పోయేవి అని మన పెద్దలు చెప్పుట మనందరకు తెలిసిన విషయమే.
అలా జరిగినప్పుడు మూఢ నమ్మకాలతో దెయ్యం, భూతం పారిపోతేనే ఈవ్యాధులు తగ్గుతాయి అనే నమ్మకం గ్రామస్తులకు ఉండేది. దీనికి మార్గం గ్రామాన్నితగల బెట్టడమే పరిష్కారం అని నిర్ణయించుకుని పూర్తిగా తగలపెట్టే వారు.
అలా తగలబెట్టిన తరువాత కొద్ది సమీపంలో తిరిగి ఆవాసాలు నిర్మించుకునేవారు.
కొంతకాలం తరువాత అక్కడ వదిలేసి తిరిగి తగలబెట్టిన ప్రదేశంలో గ్రామం మధ్యలో బొడ్డురాయిని స్థాపించి, అంకమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మ, మాచమ్మ మొదలైన పేర్లతో గ్రామానికి నాలుగు వైపుల గ్రామ దేవతలను ప్రతిష్టించే వారు.
ఇప్పటికి మనం వాటిని గ్రామ దేవతలుగా పరిగణిస్తున్నాం.
కొన్నాళ్లు ఆ ప్రదేశంను పాడు పెట్టినందున అంతకు ముందు వాడుకలో నున్న పేరుకు ‘పాడు’ లేదా ‘బాడు’ అని చేర్చి “వొణుకుబాడు”గా పిలచి ఉంటారని, ప్రతి గ్రామానికి ‘పాడు’ అనే పదం ఇలానే సంక్రమించి ఉండవచ్చు అని విజ్ఞల అబిప్రాయం.
కాకపోతే గ్రామానికి తూర్పుభాగం అర మైలు సమీపంలో లోగడ కొరిటాల, ఆ తరువాత కామినేని వారికి చెందిన పాటిచేలో 1960 ప్రాంతంలోవరవకట్ట వేస్తుండగా చిన్న మట్టి పిడతలో నాణేలు బయల్పడినట్లు పెద్దలు ద్వారా తెలుస్తుంది.
అక్కడ కొన్ని కుటుంబాలు నివాసం వున్నట్లు ఈ గ్రామానికి చెందిన తూము వెంకటేశ్వర్లు రాసిన పొనుగుపాడు చరిత్ర మొదటి పేజిలో ఈవిషయం ఉటంకించారు.
పలుకుబడులలో తేడాల వలన అది కాలాంతరంలో ‘పొణుకుబాడు’, / ‘పొనుగుపాడు’ గా వాడుక బడినట్లు తెలుస్తుంది.
1900కు పూర్వం ప్రభుత్వ రికార్డులో ‘పొణుకుపాడు’ గా వ్యవహరించినట్లు తెలుస్తుంది.20 వ శతాబ్దం ప్రారంభం నుండి “పొనుగుపాడు” గా వ్యవహరిస్తున్నట్లు మనందరికి తెలిసిన విషయమే.
ఏదైనా ఒక ప్రదేశానికి మొదట ఆ పేరు ఎలా వస్తుంది?
ఏదైనా ఒక ప్రదేశానికి మొదట ఆ పేరు ఎలా వస్తుంది? అనే దానిపై డాక్టరు ముప్పాళ్ల హనుమంతురావు రచించిన కమ్మవారి చరిత్ర గ్రంథం పేజి 27 లో మూడు విధాలుగా జరుగుతుంది అని తెలిపారు. అవి….
- మొదట చూసినవారు వారికి ఇష్టమైన పేరు పెడతారు. అది వ్యక్తి పేరు కావచ్చు మరేదైనా కావచ్చు. ఆ పెట్టేపేరు అంతకు ముందే ప్రఖ్యాతి వహించి ఉంటుంది. ఉదా. భరతుడు పరిపాలించాడు కనుక భరతఖండం/భారతదేశం.
- అచట వుండే పరిస్థితిని బట్టి వాటి ఉనికిని బట్టి . ఉదా. వరంగల్ కోటలో ఒకే ఒక్క శిల వున్నందున ఏకశిలానగరం.
- ఆ ప్రదేశంలో నివశించిన జాతిని బట్టి వస్తుందని తెలిపారు. ఉదా.కళింగ జాతి నివశించి నందున కళింగదేశం.
ఇంకొక వాదన: ప్రతి గ్రామానికి అక్కడ ఎక్కువగా ఉన్నమొక్క/వృక్షముల జాతి పేర్లు వచ్చినట్లుగా లోగడ పొనుగుపాడు ప్రాంతంలో ‘పునుగు’ జాతికి చెందిన పిల్లులు ఎక్కువగా ఉండుటచే ఆ పేరు ఏర్పడి ఉండచ్చు అనే అభిప్రాయం కొందరిది.
కాని ‘పొనుగు’అనే పదం సుమారు 100 సంవత్సరంల లోపు నుండి మాత్రమే ఉన్నట్లుగా ప్రభుత్వ రికార్డులను బట్టి తెలుస్తుంది.
రెవిన్యూ సమాచారం
గ్రామకంఠం సర్వే నెంబరు:514. గ్రామ విస్తీర్ణం య.31-30 శెంట్లు.గ్రామంలో దొడ్లు,కొష్టంల క్రింద సర్వే నెంబరు 514/1-1 య.0-09 శెంట్లు, 514/1-2లో య. 0-52 సెంట్లు గ్రామ కంఠంలో చేరినది.గ్రామ కుడికట్టు య 4548-04 శెంట్లు.
27 ఆర్ మేజరు మేరిగపూడి క్రింద మాగాణి ఆయకట్టు య 1300-00 శెంట్లు,మెట్ట య 2295-00 శెంట్లు.
పెదనందిపాడు బ్రాంచి కాల్వ క్రింద మాగాణి ఆయకట్టు య 810-80 శెంట్లు, మెట్ట య 190-00 శెంట్లు, పోరంబోకులు క్రింద య 352-21 శెంట్లు.
పోరంబోకులును వర్గీకరించగా డొంకలు, రోడ్లు క్రింద య.233-00 శెంట్లు పి.డబ్ల్యు.డి కాలువుల క్రింద య.101-00 శెంట్లు, జిల్లా పరిషత్ హైస్కూలు క్రింద య.5-00 శెంట్లు, యిండ్ల స్ధలంల క్రింద య.13- 21 శెంట్లు.
ఈ గ్రామంలో యల్ 1 భూమి వివరంలు అనగా ఇతర మండలంల లోని గ్రామాలకు చెందినటువంటి భూమి లంకెలకూరపాడు య.247-00 శెంట్లు, దొండపాడు య.348-00 శెంట్లు, నార్నెపాడు య.122-00 శెంట్లు.
అలాగే యల్ 2 భూమి అనగా స్వంత మండలంలోని గ్రామాలకు చెందినటువంటి భూమి గుండాలపాడు య.428-00 శెంట్లు, మునగపాడు య.96-00 శెంట్లు, మేరిగపూడి య.163-00 శెంట్లు.
మత సంస్థల భూముల వివరాలు:(ఎ) శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంనకు సర్వే నెం.464 య.22.00 శెంట్లు.(బి) పీర్లు మాన్యం క్రింద సర్వే నెం.136 య.13.40 శెంట్లు.
బావులు క్రింద: సర్వే నెం.130రు లో య.0.08 శెంట్లు,సర్వే నెం.517రు లో య.0.16 శెంట్లు,సర్వెేనెం.817రు లోయ.0.25 శెంట్లు వెరసి మొత్తం య.0.49 శెంట్లు.
3.చెఱువులు క్రింద:సర్వే నెం.151 రు లో య.4.32 శెంట్లు,సర్వే నెం.172 రు లో య.2.03 శెంట్లు,సర్వెేనెం.202 రు లోయ.3.80 శెంట్లు, సర్వే నెం.745 రు లో య.5.20 శెంట్లు,సర్వే నెం.746 రు లో య.0.74 శెంట్లు,సర్వెేనెం.790 రు లోయ.1.12 శెంట్లు,సర్వే నెం.818 రు లో య.14.85 శెంట్లు, వెరసి మొత్తం య.32.06 శెంట్లు.
4.కుంటలు క్రింద:సర్వే నెం.151 రు లో య.0.63 శెంట్లు,సర్వే నెం.372 రు లో య.1.25 శెంట్లు వెరసి మొత్తం య.1.88 శెంట్లు.
5.స్మశానములు క్రింద: సర్వే నెం.95 రు లో య.7.66 శెంట్లు,సర్వే నెం.131 రు లో య.0.65 శెంట్లు,సర్వెేనెం.516/బిరు లోయ.3.06 శెంట్లు వెరసి మొత్తం య.11.37 శెంట్లు.
“Remaining information under construction“