గురించి

నాగురించి తెలుసుకోవటానికి చదవక తప్పదు.

పేరు రామారావు యర్రా. తల్లిదండ్రులు రామకృష్ణయ్య, రామతులిశమ్మ. పూర్వీకుల స్వగ్రామం గుంటూరు  జిల్లా, పిరంగిపురం మండలం కోమెరపూడి. పుట్టింది (1951),  పెరిగింది పొనుగుపాడు. ప్రాధమిక విద్య, ఉన్నతపాఠశాల విద్య పొనుగుపాడు. ఆతరువాత చదివింది నరసరావుపేట. 

మన గ్రామ పంచాయతీలోనే చిరు ఉద్యోగంలో 01.01.1969న ఆరంగేట్రం. మన గ్రామంలోనే 1984 వరకు పనిచేసాను. ఆ తరువాత వివిధ చోట్ల వివిధ సర్వీసులు చేసి, గజిటెడ్ అధికారిగా కారెంపూడి మండల పరిషత్ నందు విస్తరణాధికారి (పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి అదికారి) గా  పనిచేసి 31.08.2009న పదవీ విరమణ చేసాను.

ధన్యవాదాలు