ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా మన గ్రామంలో సంక్రాంతి సంబరాలు మూడు రోజులు భోగి,సంక్రాంతి మరియు కనుమ మూడు రోజులు చిన్న ,పెద్ద తేడా లేకుండా గ్రామ ప్రజలంతా మన గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద ఘనంగా జరుపుకున్నారు.
వీటీలో భాగంగా భోగి రోజు తెల్లవారుజామున అన్నీ బజార్లలో భోగి మంటలు వేసారు.అదే రోజు సంబరాలలో భాగంగా మద్యాహ్నం పంచాయితీ ఆఫీసు వద్ద ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి.లెమన్ స్పూన్ , రన్నింగ్ రేసు, స్కీపింగ్, మ్యూజికల్ చైర్, స్లో సైక్లింగ్ మరియు సీసాలు నింపుట వంటి పోటీలు బాల బాలికలకు నిర్వహించారు.భోగి రోజు ఆటల పోటీలు ఇలా ముగుసాయి , మరుసటి రోజు సంక్రాంతి సంబరంగా మహిళలకు ముగ్గుల పోటీ మరియు మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించడం జరిగింది . అలానే చిన్న పిల్లలకు చిత్రలేఖనం, డ్యాన్స్ , ఫ్యాషన్ షో పోటీలు నిర్వహించడం జరిగింది.ముగ్గుల పోటీలో 25 మంది మహిళలు పాల్గొన్నారు . చిన్న పిల్లలు ఎంతో ఉత్సాహంగా డాన్స్ పోటిలలో పాల్గొన్నారు , ఆ తరవాత రోజు కనుమ సందర్భంగా మధ్యానం 3 గంటలకు రైతులకి ట్రాక్టర్ రివర్స్ పోటీలు ప్రారంభమయ్యాయి , ఈ పోటీలో 10 మంది పాల్గొన్నారు. తర్వత వెంటనే మగవారికి బైక్ స్లో , తాడూ లాగుట పోటీలు కూడా నిర్వహించటం జరిగింది , ఐపోయిన వెంటనేయ్ మ్యాజిక్ షో అహ్ తరవాత హౌసే గేమ్ కూడా నిర్వహించి ఈ మూడు రోజులు జరిగినటువంటి ఆటల పోటీలో పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది . ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి యర్రమాసు మాధవరావు గారు మరియు తుము వేణుగోపాల్ గారు బహుమతులు స్పాన్సర్ చేసారు , మిగిలనటువంటి ఆటల పోటీలకు మరియు ఇతర ఖర్చులకు గ్రామ తెలుగుయువత ఖర్చు పెట్టడం జరిగింది. విజేతలకు వలి మాస్టర్ , యర్రమాసు మాధవరావు మరియు తుము వేణు గోపాల్ బహుమతులు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన సభలో హైకోర్టు ప్రముఖలాయర్ తూము వేణుగోపాల్ మరియు యర్రమాసు మాధవరావు సందేశాలు ఇచ్చారు. సభ ముగింపు సందర్భంగా S.M.వలి(వలి మాస్టర్) మాట్లాడుతూ మన గ్రామంలో 43 సంవత్సరాల నుంచి సంక్రాంతి ఆటలు పోటీలు మరియు 19 సంవత్సరాల నుండి అభినయ నాటక కళాపరిషత్ రాష్ట్రస్థాయి పోటీలు జయప్రదంగా జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం చాలా ఉత్సాహంగా జరిగాయి. ఇదేవిధంగా ప్రతి సంవత్సరం గ్రామంలోని యువతీ యువకులు ఈ సంక్రాంతి సంబరాలను జయప్రదం చేయాలని కోరారు , గ్రామంలో రాష్ట్రస్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్న గద్దె శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ పోటీలో జయప్రదం చేయటంలో సహకరించిన గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు బహుమతులకు, ఆర్థికంగా సహకరించిన మిత్రులకు, గతంలో రెండు సంవత్సరము నుండి ముగ్గుల పోటీలకు జడ్జిలుగా మా గ్రామానికి రావాలని కోరిన వెంటనే వచ్చి జడ్జిమెంట్ చేసిన జి. శ్రీనివాస్ కార్తీక్ మాస్టర్ (నదురుపాడు) టీమ్ కు గ్రామ యువతి యువకులకు, మరియు గ్రామంలో జరిగిన పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు, కళాకారుల కళాకారులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ముగ్గుల పోటీ విజేతలు :
మొదటి బహుమతి | దమ్మాటి జానకి గారు |
రెండవ బహుమతి | ఒంటిపులి స్వాతి గారు |
మూడవ బహుమతి | ముత్తిపాటి మల్లీశ్వరి గారు |
మ్యూజికల్ చైర్ విజేతలు:
మొదటి బహుమతి | కొర్రపాటి రాధిక గారు |
రెండవ బహుమతి | యర్రమాసు నాగ జ్యోతి గారు |
ట్రాక్టర్ రివర్స్ విజేతలు:
మొదటి బహుమతి | తొండపి శ్రీకాంత్ గారు |
రెండవ బహుమతి | తొండపి శ్రీనివాస్ గారు |
బైక్ స్లో విజేతలు:
మొదటి బహుమతి | జమ్ముల వెంకటేష్ గారు |
రెండవ బహుమతి | యర్రమాసు రవి తేజ గారు |