జనవరి 4:చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు

చరిత్రలో ఈ రోజు

  • శివ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రామగోపాల్ వర్మ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో తన ‘అంతం’ సినిమా షూటింగ్ ప్రారంభించారు! బ్లాక్ కర్టెన్ వెనుక నుండి ఆర్క్ లైట్లు ఫోకస్ అవుతుండగా, పొగతో నిండిన స్క్రీన్‌పై ‘అంతం’ అక్షరాలు క్రమంగా ఏర్పడుతుండగా, హీరో నాగార్జున వేదికపైకి వస్తున్న దృశ్యం మొదటి షాట్ చిత్రీకరణ జరిగింది.
  • 1643: భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ జననం (మ.1727). (చిత్రంలో)
  • 1809: అంధులకు ప్రత్యేక లిపిని (బ్రెయిలీ లిపి) రూపొందించిన లూయీ బ్రెయిలీ జననం (మ.1852).
  • 1915: భారతీయ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి జననం (మ.1996).
  • 1945: నటుడు, నాటక రచయిత, దర్శకుడు ఎస్.కె. మిశ్రో జననం.
  • 1988: భారత దేశంలో మొట్టమొదటి “టెస్ట్ ట్యూబ్ బేబీ” ని ప్రముఖ వైద్యులు ఇందిరా హిందుజా జన్మింపజేశారు.
  • 2007: కూచిపూడి నాట్యాచార్యుడు కోరాడ నరసింహారావు మరణం (జ.1936)

సేకరణ:తెలుగు వికీపీడియా, పాలకోడేటివారి సినీకథ సంకలనం నుండి

Check Also

2024 భారత సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు భారత ప్రస్తుత 17వ లోకసభ 2024 జూన్ 16న ముగియనుంది. ఆ రోజుకు 18వ లోకసభ …