ఆనందం వెల్లివిరిసినవేళ ఘనంగా జరిగిన ఆత్మీయ కలయక

పొనుగుపాడు ఉన్నత పాఠశాల 2004-05సం.టెన్త్ క్లాస్ జట్టు ఆత్మీయ కలయిక

ఈ జట్టు విద్యార్థులు పొనుగుపాడు ఉన్నత పాఠశాలలో 2000-2001 సం.నందు 6 తరగతిలో చేరారు. 2004-05 సం. 10 తరగతి  పబ్లిక్ ఎక్జామ్స్ రాసారు. జీవిత ప్రయాణంలో 13 సంవత్సరాలు ప్రయాణించి వారందరు జీవితంలో అజ్ఞానం అనే చీకటిని పొగొట్టి, వెలుగు చూపిన పాఠశాల అనే దేవాలయంలోని దేవుళ్లు అనే గురువులను కలవాలని అనుకున్నారు. 13.01.2019 (ఆదివారం)న కలసి పాదాబి వందనం చేసుకున్నారు. ఈ సందర్బంగా జరిగిన ఆత్మీయ సమావేశానికి పాఠశాల ప్రదనోపాధ్యాయిని పద్మావతి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. గతంలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన ప్రభుదాసు,  విద్యాబోధన చేసిన గురువులు సాంబశివరావు, కృష్ణయ్య, హనుమయ్య, జాన్సీ, సుబ్బారావు, ఖాశిం,ఇంకా తదితరులను సన్మానించారు.

ఈ సందర్బంగా ఇంకా ఓనామాలు నేర్పిన వలి మాష్టరు,10 తరగతిలో ట్యూషన్ చెప్పిన నరసింహారావు మాష్టరు గార్లను కూడా పురష్కరించారు.

సమావేశంలో ఈ సందర్బంగా పలువురు పూర్వ విద్యార్ధులు పాఠశాల అభివృద్దికి తోడ్పడగలమని చెప్పారు.

సమావేశం తదుపరి వారి చిన్ననాటి స్నేహితులతో మరపుగాని సంఘటనలు, ముచ్చట్లు గుర్తుకు తెచ్చుకుని మురిసిపోయారు.

ఈ ఆత్మీయ సమావేశంలో ఈదర ఆనందబాబు, నిడమానూరి నరేష్,ప్రత్తిపాటి అనిల్ కుమార్, గద్దె ప్రసన్న,యర్రం వెంకటేశ్వరరావు, గుర్రం అనూష,  సుంకుల కోటినాగలక్ష్మి, కర్లపూడి సురేంద్ర, అర్వపల్లి విజయ కుమార్, ఒంటిపులి శ్రీనివాసరావు, జమ్ముల శ్రీనివాసరావు, గార భరత్, క్రోసూరి సాయిలక్ష్మి, బొట్ల వెంకట నరసమ్మ, భాను, శ్రీలక్ష్మి, తన్నీరు సుమలత, సుజాత, చావా అనూష, చావా నాగేశ్వరరావు, బెజ్జం వందన,  నిజాంముద్దీన్, మస్తాన్ వలి, గాజుల శ్రీలత, రవికిరణ్, కోటి, పసల రాజారావు, రాజేశ్, చంటి, రామారావు, మేళం ప్రతాప్, మేళం సాంబశివరావు, దారా మోహన్ బాబు,తన్నీరు కోటేశ్వరరావు,గేరా అనిల్ కుమార్, అంజి, ప్రసాద్, విజయ్, గేరపాటి శ్రీను,తాతపూడి వీరాంజనేయులు ఇంకా తదితర విద్యార్దులు పాల్గొన్నారు.

ఈ సమావేశం జరగటానికి తగిన కృషి చేసిన ఈదర ఆనందబాబు, నిడమానూరి నరేష్, ప్రత్తిపాటి అనిల్ కుమార్, యర్రం వెంకటేశ్వరరావులను పలువురు అభినందించారు.

కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంటు కోయ రామారావు, వలి మాష్టరు తగిన తోడ్పాటు, సహకారం అందించారు. 

చిత్రమాలిక
previous arrow
next arrow
Slider
Tagged with: , , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*