Skip to content
యువతా చెప్పానని కినుక వహించుకమా!
- ఓ యువతా నీ ఓటు హక్కు దుర్వినియోగం చేయకుమా,
- అవినీతి తెగులు, నేర చరిత్ర, లేని మంచి అభ్యర్థికి వేయాలి నీ ఓటు
- అంతేగాదు అక్రమ మార్గాలలో సంపాదించిన నేరగాళ్లకు,
- పీకల్లోతు కుంబకోణాలలో కూరుకుపోయిన వ్యక్తులకు
- నీ ఓటు వేసి తదుపరి తప్పు చేసానని ప్రాశ్చాత్య పడకుమా!
- మంచికి మారుపేరు గల వార్కి వేయాలి సుమా నీ ఓటు
- ఈ దేశానికి పట్టిన అవినీతి రుగ్మతలు నుండి ఒడ్డున
- పడగలవేయ సత్తా మీ యువతకు ఉందని మేమంతా
- ఎదురు చూచుటను వమ్ము చేయకురా!
- ఇంతేకాదు సుమా అంతకన్నా ముందు మీరు
- ఆరోగ్యంగా ఉంటేనే జాతి, దేశం బలంగా ఉండేది,
- చెప్పానని కినుక వహించుక కొద్దిగా ఆలోచించు సుమా,
- మధ్యపానం,దూమపానం వధ్దురా! మాదకద్రవ్యాల జోలి
- అసలు పోబోకురా! మీ ఆరోగ్యం బాగుంటే జాతికి,దేశానికి,
- మిమ్మల్ని కన్నవార్కి అంతకన్న కావలసింది
- ఇంకేముంది గ్రహించు మిత్రమా!