Skip to content

మన పొనుగుపాడు

సర్వేజనాః సుఖినోభవంతు – అందరూ బాగుండాలి

Menu
  • హోమ్
  • వార్టలు
  • మన గ్రామాలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • వికీపీడియా
  • ఆధ్యాత్మికం
  • మన పొనుగుపాడు
    • పొనుగుపాడు గ్రామ చరిత్ర
      • పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
    • జంపని వారసుల చరిత్ర.
      • శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం చరిత్ర
      • వంశవృక్షాలు
    • శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం చరిత్ర. పొనుగుపాడు.
      • శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమం.
    • శ్రీ రామేశ్వర దేవాలయం చరిత్ర. (చోళేశ్వరాలయం)
    • శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ చరిత్ర.
    • కుటుంబాల చరిత్రలు
    • ముఖ్యుల జీవిత చరిత్రలు
      • గురించి.
        • సంప్రదించండి
Menu

లీడ్ ఇండియా-2020 కార్యక్రమం.

Posted on February 13, 2016July 26, 2017 by Yarra Ramarao

[vc_row][vc_column][vc_column_text]

లీడ్ ఇండియా 2020 కార్యక్రమం

lead-india welcome poster

మన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 08.02.2016 నుండి 10.12.2016 వరకు డాక్టరు మర్రి పెద్దయ్య నేత్రత్వంలో, పూర్య విద్యార్థుల సంఘం అధ్యక్షులు కోయ రామారావు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. 

ఈ కార్యక్రమంనకు శివశక్తి అంజనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మెన్ జి.లీలావతి, వినుకొండ శాసనసభ్యులు జి.ఆంజనేయులు వారి సౌజన్యంతో నిర్వహించ బడింది. 

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాదవరావు, యం.పి.టి.సి. సభ్యులు అమరయ్య, గుంటుపల్లి జగన్నాధం, పలువురు గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 కార్యక్రమం రూపకర్త

మాజి రాష్ట్రపతి డాక్టరు అబ్దుల్ కలాం జాతి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన దేశంలో ఉన్న 640 మిలియన్ల యువత అవినీతి, అసమానతలు, సామాజిక రుగ్మతలకు  దూరంగా ఉండటానికి,యువతలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి, సమాజంలో మానవతా విలువలు కలిగి ఎలా జీవించాలో తెలియ చేయటానికి, అన్ని రంగాలలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలనే కృత నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు

 కార్యక్రమం  ముఖ్య ఉద్దేశాలు.

  • కుటుంబంపట్ల, తల్లిదండ్రుల పట్ల ప్రేమ అభిమానం కలిగి ఉండటానికి,
  • సిగ్గు, బిడియం విడనాడి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మాట్లాడటానికి,
  • విశ్వ నాయకత్వ లక్షణాలు పెంపొదించటానికి,
  • చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి, సమాజంలో విలువైన వ్యక్తిగా మెలగటానికి, 
  • కులం, మతం కేవలం వ్యక్తిగతంగా భావించి మొదట భారతీయుడనే భావన కలిగించటానికి, 
  • దేశం పట్ల భాద్యతాయుత పౌరుడుగా మెలగటానికి,
  • అధ్యాత్మికాభివృధ్ది, శారీరకాభివృద్ది, మానసికాభివృద్ది పెంపొందించటానికి, 
  • అంగ్లభాషలో పటుత్వం, కంప్యూటరు పరిజ్ఞానం పెంపొందించటానికి,
  • క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవటానికి,
  • మాతృభాషను మర్చి పోకుండా ఉండటానికి,
  • ఎవరినో అనుకరించకుండా ఎవరికివారు తనకంటూ స్వంతశైలిని కలిగి ఉండటానికి,
  • ఇతరులకు స్పూర్తిగా ఉండటానికి.

సభా కార్యక్రమం.

lead-india-zphs-1ఆ సందర్బంగా జరిగిన సమావేశంనకు ప్రధానోపాధ్యాయిని టి.పద్మావతి అధ్యక్షత వహించారు.ముందుగా ప్రధానోపాధ్యాయిని టి. పద్మావతిచే జ్వోతి ప్రజ్వలన చేయబడింది.

సమావేశంనకు సర్పంచ్ లక్ష్మి మాధవరావు, యం.పి.టి.సి. సభ్యులు అమరయ్య హాజరైయ్యారు.ముఖ్య అతిధిగా  విశ్రాంత బెష్ట్ సి.ఇ.ఒ.అవార్డు గ్రహీత గుంటుపల్లి జగన్నాధం హాజరైయ్యారు.

పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంటు రామారావు, కోశాధికారి కోట్లింగయ్య, తదితర పూర్వ విద్యార్థుల సంఘం కార్యవర్గం సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, అరోరారావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, పూర్ణయ్య, ఉషారాణి, కోటేశ్వరి, మస్తానువలి తదితరులు పాల్గొన్నారు.ఇంకా వలిమాష్టరు, హరిబాబు, బాలరాజు, బాలకృష్ణ, రాఘవయ్య, రామారావు, వెంకటేశ్వరరావు, పూర్ణచంద్రరావు, శివయ్య మాష్టరు, రాదాకృష్ణ, తులసీరావు, తదితర గ్రామస్తులు, పెద్దలు హాజరైయ్యారు.

ప్రముఖుల ప్రసంగాలు

lead-india-zphs-2సమావేశంలో ప్రధానోపాధ్యాయిని టి.పద్మావతి మాట్లడుతూ విద్యతోపాటు సత్యం, దర్మం, క్రమశిక్షణ, మానవతా విలువలు పాటించాలని తెలిపారు.

అలాగే అంగ్లభాషలో, కంప్యూటరు పరిజ్ఞానంలో పట్టు సాధించాలని చెప్పారు.

ప్రతి పనిలో పోటి తత్వం అలవర్చుకోవాలని తెలిపారు. లీడ్ ఇండియా 2020 ముఖ్య ఉద్దేశ్యం యువత అభివృద్దే దేశాభివృధ్ది అని చెప్పారు. తోటివారికి సాయపడే మనస్తత్వం కలిగి ఉండాలని చెప్పారు.

సర్పంచ్ లక్ష్మిమాధవరావు మాట్లాడుతూ విద్యతో పాటు తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల, సమాజంపట్ల ప్రేమ అభిమానం కలిగి ఉండాలని, చెడు అలవాట్లుకు దూరంగా ఉండాలని గుర్తు చేసారు.

ముఖ్య అతిధి జగన్నాధం ప్రసంగం

lead-india-zphs-4ముఖ్య అతిధి గుంటుపల్లి జగన్నాధం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని చెప్పారు.

ప్రతి చిన్నారి సోమరితనాన్ని విడనాడి క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు.

నైతిక విలువలుతో కూడిన విద్యనభ్యసిస్తే అనుకున్న లక్ష్యం నేరవేరుతుందని తెలిపారు.

ప్రతి విషయంలో సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, అత్మ విశ్వాసంతో భావ వ్యక్తీకరణ ఉండాలని చెప్పారు.

ప్రతి చిన్నారి ఓ భారతరత్న కావాలని డాక్టరు ఎ.పి.జె. అబ్దుల్ కలాం కలగన్న ఆశయం నెరవేరాలని చెప్పారు.

 అప్ కా బాధ్ దేశ్ కా బాధో.  (మీ అభివృద్ధే దేశాభివృద్ధి)

యువత అబివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లే అని బావించి డాక్టరు ఎ.పి.జె.అబ్దుల్ కలాం ఈ నీడ్ ఇండియా 2020 కార్యక్రమం రూపొందించారని చెప్పారు.

lead-india-zphs-3పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంటు రామారావు మాట్లాడుతూ  ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని అన్నారు.

కులం మతం ఎవరెవరి వ్యక్తిగతం అని, కాని మనమందరం భారతీయులం అని చెప్పారు.

విశ్వ నాయకత్వ లక్షణాలు అలవర్చుకావాలని, ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనటానికి సిద్దపడే తత్వం అలవర్చుకోవాలని చెప్పారు.ఇంకా సమావేశంలో వలిమాష్టరు, కోట్లింగయ్య  తదితరులు ప్రసంగించారు.

లీడ్ ఇండియా  మాష్టర్ ట్రైనర్స్ టీము లీడరు వెంకట్రావు ఆధ్వర్యంలో మురళి, కోటేశ్వరరావు, రాజేష్, తదితరులు ఈ కార్యక్రమం క్రింద విద్యార్థిని విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించారు.

చివరి రోజు మాష్టర్ ట్రైనర్స్ విద్యార్థులుతో ఆలపించిన పాడుదమా జాతీయగీతం, ఎగరేయుదమా జాతి పతాకం అనే పాటను అలపించారు. దేశభక్తి గేయంతో విద్యార్థులలో ఒక్కసారిగా ఆనందం పరవశించి పరవళ్లు తొక్కింది.

చివరగా పాఠశాల తెలుగు ఉపాద్యాయులు ఎ.కోటేశ్వరరావుచే వందన సమర్పణ గావించబడింది.

దేశభక్తి గేయం వీడియో [/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=hC8FXDQN0BQ” align=”center”][/vc_column][/vc_row]

Continue Reading

Next Post:
ఉన్నత పాఠశాలలో స్వచ్చభారత్ కార్యక్రమం.
Previous Post:
శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Archives

Categories

Recent Posts

  • టీ బండే రేయంబవుళ్లు వృద్దదంపతుల నివాసం June 27, 2022
  • పదవ తరగతిలో ప్రధమ స్థానం సాధించిన పొనుగుపాడు మానస June 3, 2019
  • పొనుగుపాడు ఉన్నత పాఠశాల 68వ వార్షికోత్సవ విశేషాలు April 13, 2019
  • ఉన్నత పాఠశాల 68వ వార్షికోత్సవం ఆహ్వానం. February 27, 2019
  • ఆనందం వెల్లివిరిసినవేళ ఘనంగా జరిగిన ఆత్మీయ కలయక January 21, 2019

Recent Comments

  • Maheswara rao Guntakala on సుంకుల రామాంజనేయులు.
  • Venugopal on మన వనం మనమే కాపాడుకుందాం – స్పందించిన దాతలకు కృతజ్ఞతలు.
  • పొనుగుపాటి ప్రసాద్ on మన పొనుగుపాడు దేవాలయాల ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం
  • పొనుగుపాటి ప్రసాద్ on మన పొనుగుపాడు దేవాలయాల ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం
  • పొనుగుపాటి ప్రసాద్ on మన పొనుగుపాడు దేవాలయాల ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం
©2022 మన పొనుగుపాడు | Built using WordPress and Responsive Blogily theme by Superb