Menu Close

ఉన్నత పాఠశాలలో స్వచ్చభారత్ కార్యక్రమం.

స్వచ్చభారత్ కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యం  

“గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు” అన్నారు మహాత్మా గాంధీ. అవును గ్రామం పరిశుభ్రంగా ఉంటే గ్రామం లోని ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.

ఎప్పడైతే ఆరోగ్యంగా ఉంటారో గ్రామం ఆర్ధికంగా అభివృద్ది చెందుతుంది. గ్రామాలు ఆర్ధికంగా ఉంటే దేశం ఆర్ధికంగా బలపడుతుంది.

మహాత్మా గాంధీ కలలుగన్నఅలాంటి పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే మన ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా భావించారు.గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2 అక్టోబర్ 2014న ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ప్రకటించి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం ఏ ఒక్కరికోసమో కాదు. ఇది మనందరి కోసం,  రాబోయే మన భావి భారత పౌరుల కోసం. ఇలాంటి కార్యక్రమంలో మనందరం స్వచ్చంధంగా భాగస్వామ్యం కావల్సిన భాధ్యత మనందరిపైనా ఉన్నది.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశ్యం

  • బహిరంగ మల విసర్జన నిర్మూలించటం.
  • అపరిశుభ్ర మరుగుదొడ్లను ఫ్లష్ టాయిలెట్లుగా మార్చుటం.
  • పరిసరాలు పరిశుబ్రంగా ఉంచుకోవటం.
  • ప్రజారోగ్యం, మరియు ఆరోగ్యకరమైన పారిశుధ్య పద్ధతులను అవలంభించుట,
  • పర్యావరణం పరిరక్షించుటపై ప్రజలలో అవగాహన కలిగించి ప్రవర్తనా మార్పు తీసుకురావటం.

 (కార్యక్రమం జరిగిన  తేది:31.01.2016. ఆదివారం.)

Zilla Parishad High School, Ponugupadu

పొనుగుపాడు జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం గౌరవ ఆధ్యక్షలు డాక్టరు మర్రి పెద్దయ్య యం.డి., ఈ కార్యక్రమానికి నేత్ర త్వం వహించారు.

గుంటుపల్లి జగన్నాధం (బెష్ట్ సి.ఇ.ఒ. అవార్డు గ్రహీత) మార్గ దర్శకత్వం వహించారు.

పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంటు కోయ రామారావు, (రిటైర్డు బ్యాంకు మేనేజరు) ఆధ్వర్యంలో   పాఠశాల ఆవరణలో  కార్యక్రమం ప్రారంభించబడింది.

ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో ఉన్నవ్యర్థ పదార్థములు, పిచ్చి చెట్లును తొలగించారు.

గదులలో ఉన్న అవసరమైన సామానులను శుభ్రంగా సర్థారు. పనికిరాని సామానులను తొలగించారు.

గదులలోని ప్లోరింగు, గోడలను, మరుగు దొడ్లును పరిశుభ్రపరిచారు.

ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతి సర్పంచ్ వంకాయలపాటి లక్మిమాధవరావు, మండల ప్రాదేశిక సభ్యులు బొట్ల అమరయ్యలు హాజరైయ్యారు.

డాక్టరు అచ్యుతబాబు, సోషల్ సర్వీసు ఆర్గనైజర్సు పూర్ణచంద్రరావు, కృష్ణయ్య మాష్టరు, రిటైర్డు మండల విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు హాజరైనారు.

ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మావతి, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉషారాణి, కోటేశ్వరి, శంకరరావు, అరోరరావు, పూర్ణయ్య, వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు తదితర సిబ్బంది, పాఠశాలలో చదువుచున్న విద్యా కుసుమాలు ఈకార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు.

పూర్వ విద్యార్థులు వంకాయలపాటి కోట్లింగయ్య, వలి మాష్టరు, కొంగర రాఘవయ్య, యామాని రామారావు, ఈదర హరిబాబు, గుంటుపల్లి వెంకటేశ్వరరావు, వక్కంటి వెంకటేశ్వరరావు, కర్లపూడి రాఘవరావు,శివయ్య మాష్టారు కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసారు.

గ్రామస్థులు దాడి రాధాకృష్ణ, యర్రమాసు బ్రహ్మయ్య, పచ్చా సుబ్బారావు, చంద్రమౌళి తదితర గ్రామ పెద్దలు, ప్రజలు, అంగనవాడి కార్యకర్తలు ఈకార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసారు.

అవగాహన సమావేశం

కార్యక్రమ అనంతరం  పూర్వ విద్యార్ధి గుంటుపల్లి జగన్నాధం (బెష్ట్ సి.ఇ.ఒ.అవార్డు గ్రహీత) అధ్యక్షతన స్వచ్చభారత్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

డాక్టరు పెద్దయ్య మాట్లాడుతూ అందరూ అరోగ్య సూత్రాలు పాటించాలని, పారిశుద్ధ్యం విషయంలో ప్రతిపౌరుడు అలోచనా విధానాన్ని మార్చుకోవాలని తెలిపారు.

ఇంకా వ్యక్తిగత శుభ్రతతోపాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తెలియని వార్కి  వాటిపై అవగాహన కల్పించడం మనందరి భాధ్యత అని చెపాపారు.

ఇంకా విద్యతోపాటు విద్యార్దులకు ప్రత్యేకంగా నైతికవిలువలు గురించి భోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి పౌరుడు సేవా దృక్పదం అలవర్చుకోవాలని వక్కాణించారు. 

డాక్టరు అచ్యుతబాబు మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే ఏకైక మార్గం చెట్లను విరివిగా పెంచి పోషించాలని చెప్పారు.

సర్పంచ్ వంకాయలపాటి లక్ష్మిమాధవరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విధిగా మరుగు దొడ్లు వాడటం పాటించాలని చెప్పారు.

ఇంకా ముఖ్యంగా మురుగు కాలువులలో మురికినీరు పారుదలకు ఆటంకాలు కలిగించుకుండా పారిశుధ్య సిబ్బందికి మనందరం సహకరించాలని తెలిపారు.

కృష్ణయ్య మాష్టరు పరిసరాలు పరిశుభ్రతపై తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి చెప్పారు.

నాగేశ్వరరావు రిటైర్డు మండల విద్యాశాఖాధికారి స్వచ్చభారత్ ఆవశ్యకతను గురించి మాట్లాడారు.

సమావేశంనకు అధ్యక్షత వహించిన గుంటుపల్లి జగన్నాధం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఒక్కపాఠశాలలోనే కాకుండా గ్రామంలో కూడా నిర్వహించుదామని పిలుపునిచ్చారు.

ప్రదానోపాధ్యాయులు పద్మావతి, ఉపాధ్యాయులు పూర్ణచంద్రరావు తదితరులు విద్యార్థుల క్రమ శిక్షణ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం అని చెప్పారు.

పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి అని అందులో బాగంగా మనం ప్లాస్టిక్ సంచుల వాడకం తగ్గించాలని, వాటికి బదులు  గుడ్డ సంచులు, కాగితం సంచులు వాడాలని చెప్పారు.

అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు  విధిగా కొంత ఖాళీ స్థలంలో చెట్లు నాటి పెంచాలని చెప్పారు. చివరగా తెలుగు ఉపాధ్యాయులు కోటేశ్వరరావు వందన సమర్పణ గావించారు.

 PHOTO SLIDER

Swachh Bharat-24
Swachh Bharat-23
Swachh Bharat-22
Swachh Bharat-21
Swachh Bharat-18
Swachh Bharat-16
Swachh Bharat-13
Swachh Bharat-8
Swachh Bharat-1
Ponugupadu Z.P.High School.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *