మన వనం మనమే కాపాడుకుందాం – స్పందించిన దాతలకు కృతజ్ఞతలు.

 “మన వనం మనమే కాపాడుకుందాం” – స్పందించిన దాతలకు కృతజ్ఞతలు.

పొనుగుపాడు గ్రామంలో ప్రభుత్వం వారి ఆర్థిక సహాయంతో  2017, ఆగష్టులో నాటబడిన మొక్కలు మనం ఆశించినట్లుగా అన్ని బతికి ఏపుగా పెరుగుతున్నందుకు సంతోషం.ఈ కార్యక్రమంలో మొదటనుండి శ్రీ వేణుగోపాల్ ఎడ్యుకేషనల్ ట్రష్టు తరుపున ప్రెసిడెంటు తూము వేణుగోపాల్ పడుచున్న కృషి మనందరికి తెలిసిందే.

అలాగే “మన వనం మనమే రక్షించుకుందాం” అనే స్లోగనుకు స్పందించి కొత్తమంది దాతలు వేణుగోపాల్ ఎడ్యుకేషనల్ ట్రష్టు తరుపున ప్రెసిడెంటు తూము వేణుగోపాల్ కు విరాళాలు అందజేసారు.దాతలందరికి ట్రష్టుతరుపున ప్రెసిడెంటు వేణుగోపాల్ కృతజ్ఞతలు తెలుపుచూ ఇప్పటి వరకు వరకు అందిన విరాళాల సొమ్ముకు జమా ఖర్చులు మన పొనుగుపాడు.కామ్ ద్వారా తెలుపవలసిందిగా కోరినందున అతని కోరిక మేరకు వివరాలు దిగువ తెలపటమైంది.

జమా ఖర్చులు

ఆగష్టు 2018 వరకు రాబడివ విరాళం సొమ్ము వివరాలు

వ.సంఖ్య దాత పేరు

 అందించిన విరాళం

1 వంకాయలపాటి బలరామకృష్ణయ్య 10,000
2 కె.వెంకటేశ్వర్లు 10,000
3 డాక్టరు మర్రి పెద్దయ్య 10,000
4 కోయ రామారావు 15,000
5 గుర్రం విశ్వేశ్వరరావు 18,000
6 గుర్రం మాధవరావు   5,000
6 గుర్రం రామచంద్రరావు s/o పెదబాబు 25,000
7 గుంటుపల్లి జగన్నాధం   5,000
  మొత్తం 98,000

ఆగష్టు 2018 వరకు రాబడివ విరాళం సొమ్ముకు ఖర్చు వివరాలు

1 మొక్కలు రవాణా చార్జీలు వెలగపూడి నుండి రెండు ట్రాక్టర్లు ద్వారా 9,000
2 ఐరన్ మెస్ ట్రీ గార్డ్సు 270 25,200
3 కలప కర్ర ముక్కలు ట్రీ గార్డ్సు సపోర్టుకు 2 బండిల్సు 7,000
4 ప్లాస్టిక్ ట్రీ గార్డ్సు 40   8,300
5 ట్రీ గార్డ్సు ఏర్పాటుకు లేబర్ చార్జి. (ప్రభుదాసు,ప్రసాదు)   9,450
6 పొనుగుపాడులో చేయించిన ట్రీ గ్రార్డ్సు 5   2,400
7  కొత్తగా సెప్టెంబరు 2018లో కొన్న ఐరన్ మెస్ బండిల్స్ & కలప కర్ర ముక్కలు ట్రీ గార్డ్సు సపోర్టుకు 16,000
  ఖర్చు మొత్తం 77,350

విరాళం జమ మొత్తం 31.08.2018 వరకు —-    రు.98,000

ఖర్చు మొత్తం 31.08.2018 వరకు           —-    రు.77,350

10.09.2018 నాటికి నిల్వ (నిర్వహణ కొరకు)-     రు.20,650

Tagged with: , , ,

మన పొనుగుపాడు ఉన్నత పాఠశాలలో గురుపూజా మహోత్సవం విశేషాలు

గురుపూజా మహోత్సవం.

మన పొనుగుపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులకు ది.07.09.2018 న గురుపూజా మహోత్సవం జరపబడింది.ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

 • గురువు అంటే ఎవరు?
 • అసలు ఈ కార్యక్రమం ఎలా,ఎందుకు మొదలైంది?

కనీసం ఈ విషయాలు గురించి ప్రతివ్యక్తి,విద్యార్థులు తెలుసుకోవాలి,తెలిసిండాలి.

మొదటి విషయానికి వస్తే మనందరం గురు లేదా గురువు అంటే విద్యను నేర్పువాడు అని భావిస్తాం.సంస్కృతంలో గు అంటే  చీకటి లేదా అంధకారం అని అర్థం. రు అంటే వెలుతురు లేదా ప్రకాశం అని అర్థం.అనగా గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి, బ్రహ్మ విద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు.ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది.అంతేగాదు గురువును త్రిమూర్తులు స్వరూపంగా భావించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం.

ఇక రెండవ విషయానికి వస్తే సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి మనందరికి తెలుసు.1962లో రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పుడు  కొందరు శిష్యులు, మిత్రులు,అధికారులు, అభిమానులు పుట్టినరోజు జరుపటానికి అతని దగ్గరకు వెళ్లినప్పుడు, నా పుట్టినరోజును వేడుకులా జరిపే బదులు దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే ఎంతో గర్విస్తాను అన్న మాటల నుంచి ఏర్పడి,  అప్పటి నుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ మాటల బట్టి ఉపాధ్యాయ వృత్తి పట్ల తనకెంత ప్రేమ ఉందో మనందరికి అర్థమవుతుంది. 

కార్యక్రమ విశేషాలు

పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రసిడెంటు కోయ రామారావు పర్వేక్షణలో, డాక్టరు మర్రి పెద్దయ్య, కొరిటాల శేషగిరిరావు, గుంటుపల్లి జగన్నాథరావు అబినందనలతో గురుపూజా దినోత్సవం సందర్బంగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని పద్మావతిని ది.07.09.2018న పాఠశాలలో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి డాక్టరు పాతూరి సీతారామాంజనేయులు (విశ్రాంత ప్రొఫెసర్) ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమం సందర్బంగా సన్ ఫార్మాష్యూటికల్స్ రిప్రెంజెంటేటివ్ శ్రావణ్ 84 మంది పేద విద్యార్థులకు ఆంగ్ల నిఘంటువులు ఉచితంగా పంచిపెట్టారు.ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి, అరోరారావు, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ తులసీథరరావు, పాఠశాల చైర్మెన్, వంకాయలపాటి కొట్లింగయ్య, గుంటుపల్లి వెంకటేశ్వరరావు,వలి మాష్టరు తదితరులు పాల్గొన్నారు.

ఫొటో గ్యాలరీ

Slider
Tagged with: , , , ,

పొనుగుపాడు ఉన్నత పాఠశాల పేద విద్యార్థులకు పుస్తకాలు ఉచిత పంపిణీ.

పేద విద్యార్థులకు పుస్తకాలు ఉచిత పంపిణీ.

పొనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థులకు కంప్యూటరు నోటు పుస్తకాలు,  30 మంది పేద విద్యార్థులకు 30000/- విలువ కలిగిన పాఠశాల సంచులు,పరీక్షల రాయటానికి ప్యాడ్స్, జామెంట్రీ బాక్స్లు మొదలైన 14 వస్తుసామాగ్రి కలిగియున్న కిట్స్ ది.05.07.2018న జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని శ్రీమతి పద్మావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమానికి దూదేకుల షేకు మస్తాను జ్ఞాపకార్థం వారి మనమడు దూదేకుల షేకు మస్తాను (NRI) రు.20000/-లు, మాగులూరి బసవచారి (రిటైర్డ్ యం.ఆర్.ఒ) వారి తల్లి దండ్రులు మాగులూరి నాగభూషణం, సత్యవతి గార్ల జ్ఞాపకార్థం రు.5000/-లు, కోయ రామారావు (రిటైర్డు బ్యాంకు మేనేజరు) రు.5000/-లు ఆర్థిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాక్టరు.పాతూరి సీతారామాంజనేయులు (రిటైర్డు ప్రొఫెసరు, నాగార్జున యూనివర్శిటీ), మాగులూరి బసవాచారి (రిటైర్డు యం.ఆర్.ఒ) హాజరయ్యారు. పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంటు కోయ రామారావు పర్వేక్షణలో కార్యక్రమ నిర్వహణ జరిగింది.

ఇంకా  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల పూర్వ విద్యార్థులు కోట్లింగయ్య, షేక్ మస్తానువలి,పాలపర్తి కోటేశ్వరావు, రాఘవయ్య, హరిబాబు, బాలరాజు, వెంకటేశ్వరరావు, వలి మాష్టరు, శివయ్య  మాష్ఠరు తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఫాఠశాల మ్యాథ్స్ మాష్టరు శ్రీనివాసరావు వందన సమర్పణ గావించారు.

previous arrowprevious arrow
next arrownext arrow
Slider
Tagged with: , , ,

నూతన వధూవరులు నందిని,ప్రేమసాయిలకు శుభాకాంక్షలు.

నూతన వధూవరులకు శుభాకాంక్షలు

మన పొనుగుపాడు గ్రామానికి చెందిన, మనందరికి చిరపరిచితులైన వంకాయలపాటి శివరామకృష్ణయ్య గారి మనమరాలు, కొట్లింగయ్య, రాధ దంపతుల ఏకైక పుత్రిక చి.ల.సౌ నందిని వివాహం ది.01.07.2018 ఆదివారం నరసరావుపేటలోని కొత్తపల్లి కళ్యాణ మండపంనందు హైదరాబాదు (ఎ.యస్.రావు నగర్) వాస్తవ్వులు కళ్యాణ సుందరం, పిచ్చయ్యమణి దంపతుల ఏకైక కుమారుడు చి. సత్యనారాయణ ప్రేమ్‌సాయితో వివాహం జరిగిన సందర్బంగా 

నందిని, ప్రేమ్‌సాయిలకు వారి కుటుంబ సభ్యులకు పొనుగుపాడు గ్రామ ప్రజలు, బంధువులు, స్నేహితుల తరుపున 

www.manaponugupadu.com వారి శుబాకాంక్షలు

Tagged with: , , ,

మన పొనుగుపాడు దేవాలయాల ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం

ప్రియ భగవత్ బంధువులారా,

మన పొనుగుపాడు గ్రామంలో వేంచేసియున్న

 • శ్రీ అంజనేయస్వామి, 
 • శ్రీ శీతారామస్వామి, 
 • కలియుగ దైవం శ్రీ దేవీ భూ నీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహిత, 
 • శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంధ్ర స్వామి, 
 • వినుకొండ అంకమ్మ తల్లి, 

ప్రధమ వార్షికోత్సవ ఆహ్వాన శుభ పత్రిక

దేవాలయాల ప్రధమ వార్షిక బ్రహ్మోత్సవం ది.25.04.2018 (బుధవారం) నుండి ది.28.04.2018 (శనివారం) వరకు పొనుగుపాడు దేవాలయాల సేవా సమితి ఆధ్వర్యంలో జరుపబడునని మీ అందరికి తెలియజేయాటానికి సంతోషిస్తున్నాం.

కావున యావత్ భక్తబృందం, భగవత్ బంధువులూ అందరూ ఈ కార్యక్రమాలను కనులారా వీక్షించి తీర్ద ప్రసాదాలు స్వీకరించి తరించగలరు.

28.04.2018 శనివారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Tagged with: , , ,

ఉగాది శుభాకాంక్షలు.

ముందుగా దేశ విదేశాలలో ఉన్న మన తెలుగు వారందరికి  శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

 

ఉగాది అంటే ఏమిటి?

పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్ఠి కోసం తన దేహాన్ని రెండుగా విభజించుకొని ఒకభాగం మానవుడు (పురుషుడు) గా, రెండవభాగం మానవతి (స్రీ) గా మారి, ఆ పురుషుడు ఆ ‘స్త్రీ’తో  ఛైత్ర శుద్ధ పాఢ్యమి (యుగాది) నాడు సంగమించి బ్రహ్మ తన సృష్టిని ప్రారంభించాడని, అందుకే దీనిని ‘యుగాది’ అని వ్యవహరించేవారని తెలుస్తుంది. కాలాంతరంలో ఆ మాటే ‘ఉగాది’ గా రూపాంతరం చెంది ఒక పండుగగా మారిందని అందరి విశ్వాసం.

ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారం ముగియగానే కలియుగారంభం ఉగాదితో మొదలయ్యింది. కలియుగం క్రీస్తుపూర్వం ఫిబ్రవరి 18, 3102 నాడు అంటే 5120 సంవత్సరాలు క్రితం ప్రారంభం అయినట్లుగా ఖగోళ శాస్త్రం, పురాణాల ప్రకారం తెలుస్తుంది.

ఉగాది రోజు నుండి వసంత ఋతువు మొదలవుతుంది. ప్రకృతి ఒక కొత్త రూపాన్ని సంతరించుకొని మళ్ళీ చిగురించి కొత్త కొత్త అందాలతో అలరిస్తుంది. ఉగాది పండగ  అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి, తలంటు స్ధానం, కొత్త బట్టలు.

ఏది ఏమైనా మనందరం గర్వంగా జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఉగాది పండగ ఒకటి అని చెప్ప వచ్చు.

ఉగాది పచ్చడి అసలు పరమార్ధం.

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు. అనే షడ్రుచులు కలసిన సమ్మేళనం. పచ్చడిని పూజలో నైవేధ్యంగా పెట్టిన తరువాత మనం ప్రసాదంగా స్వీకరించాలి.

 • బెల్లం తీపి ఆనందానికి సంకేతం,
 • ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం.
 • వేప పువ్వు చేదు భాధ కలిగించే అనుభవాలుకు సంకేతం,
 • చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులుకు సంకేతం,
 • పచ్చి మామిడి   పులుపు కొత్త సవాళ్లుకు సంకేతం,
 • మిరపపొడి కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులుకు ఎదురొడ్డటానికి సంకేతం.

అంటే మనకు ప్రతి సంవత్సరములో సంభవించే కష్టసుఖాలు, మంచిచెడులు సంయమనంతో స్వీకరించాలనే భావన మన మనసులో కలుగ చేస్తుంది. మానవుడు “ఆపదల్లో కుంగిపోకుండా, సంపదల్లో పొంగిపోకుండా, విజయాలు సాధిస్తున్నప్పుడు ఒదిగి ఉంటూ, వైఫల్యాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడుతూ”  జీవితం సాగించాలని దీని అర్థం.

Tagged with: , ,

ఉన్నత పాఠశాల 67వ వార్షికోత్సవం ఆహ్వానం.

అందరికి ఆహ్వానం

ప్రతి సంవత్సరం మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం జరిగే సంగతి మనందరకు తెలుసు.

అలాగే 67వ వార్షికోత్సవం ది.17.02.2018 న (శనివారం) జరుగుతుందని మీ అందరికి తెలుపటానికి అవకాశం మాకు కలిగినందుకు సంతోషం.

ఈ కార్యక్రమంలో అందరూ పాల్గోని మన ఉన్నత పాఠశాల వార్షికోత్సవ పండగను జయప్రదం చేయవలసిందిగా కోరటమైనది.

గమనిక:మన పాఠశాల అభివృద్ధికి, పేద విద్యార్ధుల విద్యా అభివృద్ధికి మీరు ఆర్ధిక సహాయం చేయాలనిపిస్తే ఆన్ లైన్ ద్వారా ఈక్రింది తెలుపబడిన బ్యాంకు ఖాతాకు చెల్లించవచ్చు.

OLD STUDENTS ASSOCIATION, Z.P.H.SCHOOL – ANDHRA BANK – IFSC NO: ANDB0001505 – Palnadu Road Branch, Narasaraopet – A/c. No. :150510011000804

CONTACT CELL NO:94409 15861

2016-2017 సంవత్సరంనకు పేద మరియు  మెరిట్ విద్యార్ధులకు పంపిణీ చేయు ఉపకార వేతనంల పంపిణీ వివరంలు. 

గమనిక:మన పాఠశాల అభివృద్ధికి, పేద విద్యార్ధుల విద్యా అభివృద్ధికి మీరు ఆర్ధిక సహాయం చేయాలనిపిస్తే ఆన్ లైన్ ద్వారా పైన వివరింపబడిన  బ్యాంకు ఖాతాకు చెల్లించవచ్చు.

Tagged with: , , ,

సంక్రాంతి శుభాకాంక్షలు

గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన మన అందరికి ఎక్కడ ఉన్నా సంక్రాంతి  పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది మన గ్రామం, మనం పెరిగిన వాతావరణం,పాడి పంటలు.

మకర సంక్రాంతి లేదా సంక్రమణం.. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం..దీనినే సంక్రాంతి అంటారు.

స్వగ్రామం నుండి జీవన ప్రయాణంలో  ఎవరి ఎక్కడకు వెళ్లినా ఇతరత్రా పండగలకు వెళ్లినా,వెళ్లకపోయినా సంక్రాంతి పండగకు అందరూ సొంతూరుకు తప్పనిసరిగా వెళతాం.

పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి రైతుల పండుగ అని చెప్పకుంటాం.

సంక్రాంతి పండుగ మూడు రోజుల పండగ. ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటాం. ఆరోజు ఉదయాన్నే చలి మంటలు వేసుకుంటాం.

మనలోని పాత ఆలోచనలుకు స్వస్తి చెప్పి, కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్ని దేవుడిని వేడుకుంటాం.  అందుకు గుర్తుగా ఇంటిలోని పాత చెత్తా చెదారాన్ని చలిమంటల ద్వారా ఆహుతి చేస్తాం.

ఇండ్ల ఎదురు రంగు రంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో అలంకరిస్తాం. చిన్నారులకు భోగి పండ్లు పోస్తాం.ఈ పండగకు అరిసెలు ముఖ్వమైన పిండివంటగా భావించి ప్రతి ఇంటిలో చేసుకుంటాం.

రెండో రోజు సంక్రాంతి…

ఈ రోజు కూడా  రంగు రంగులతో పోటా పోటీగా ముగ్గులు వేస్తాం. వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటిచుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతుంటాం.

పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తుంటాం.

గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలను అనుగుణంగా వాటిచేత నృత్యాలు చేయిస్తుంటారు. 

అంతేగాక హరిలో రంగ హరీ..అంటూ  బోడి తలపై రాగి అక్షయపాత్ర పెట్టుకుని హరిదాసు ప్రత్యక్షమవుతాడు.

మూడో రోజు కనుమ..

సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తుంటారు.

పశువులను అలకరిస్తాం.

బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. 

 

Tagged with: , ,

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం

శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి శతజయంతి కళ్యాణ మహోత్సవంనకు అందరూ తరలరండి. 

 ఆహ్వాన పత్రిక మరియు కార్యక్రమాల వివరం (ఈ లింకుపై క్లిక్ చేయండి)
Tagged with: , ,

పొనుగుపాడు గ్రామంలో అభినయ నాటక పరిషత్ పోటీలు

 13వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు


Tagged with: ,

కమలమ్మకు కన్నీటి వీడ్కోలు

మన పొనుగుపాడు కి చెందిన వంకాయలపాటి కమలమ్మ భర్త కోటిలింగం ది: 27 . 12 . 2017 (బుధవారం) న స్వర్గస్థులు అయినందుకు చింతిస్తున్నాము.

Tagged with: ,

మన గ్రామ వనాన్ని- మనమే రక్షించుకుందాం

 

వృక్షో రక్షితి రక్షిత:

(అంటే  చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని రక్షిస్తుంది అని అర్థం.)

మన గ్రామంలో మనందరం మన వంతుగా “మేము సైతం” అని కదలి  పర్యావరణాన్ని రక్షించుటలో భాగంగా ది.06.08.2017న “వనం-మనం” కార్యక్రమంలో సుమారు 2000 మొక్కలు నాటాం.

“చెట్లు నాటటం ఒక ఎత్తు. నాటిన వాటిని బ్రతికించి, పెంచటం ఒక ఎత్తు.”

మనం నాటిన మొక్కలలో సుమారు 1800 బ్రతికినవి. వాటికి “ట్రీ గార్డ్సు” ఉంటేనే మనుగడ ఉంటుందని మనందరకు తెలుసు. సుమారు ఒక్కొక్క ట్రీ గార్డు రు.500/- కాగలదని తెలుస్తుంది. కొంతమంది దాతలు వారంతట వారే స్పందించి వారి వంతు సహాయంగా ఇప్పటి వరకు రు. 1,00,000/-లు ప్రకటించారు. వారికి మన గ్రామ ప్రజలందరి తరుపున వేణుగోపాల్  ఎడ్యుకేషనల్ ట్రష్ట్  ప్రెసిడెంటు తూము వేణుగోపాల్ ధన్యవాదాలు తెలుపుచున్నారు.

మన గ్రామానికి సంబందించిన మంచి కార్యక్రమం కావున,  అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ “నేను సైతం” అని ముందుకు వచ్చి మీ వంతు ఆర్థిక సహాయం చేయదలచిన వారు దిగువ వివరింప బడిన సెల్ నెంబర్లకు తెలుపవలసినదిగా కోరుచున్నాం.

నిర్వాహకులు

 • తూము వేణు గోపాల్.9985825589, (ప్రెసిడెంటు,ఎడ్యుకేషనల్ ట్రష్ట్,పొనుగుపాడు.)
 • కోయ రామారావు:9440915861,   (ప్రెసిడెంటు,పూర్వ విద్యార్థుల సంఘం, ZPHS, పొనుగుపాడు

ఈ కార్యక్రమం ఏ ఒక్కరి కోసమో కాదు. మనందరి కార్యక్రమం. మన తరువాత మన భావి తరాలవారి కోసం.మన గ్రామం కోసం.

 “సర్వే జనా: సుఖినోభవంతు” 

ఆగష్టు 2018 వరకు రాబడివ విరాళం సొమ్ము వివరాలు

వ.సంఖ్య దాత పేరు

 అందించిన విరాళం

1 వంకాయలపాటి బలరామకృష్ణయ్య 10,000
2 కె.వెంకటేశ్వర్లు 10,000
3 డాక్టరు మర్రి పెద్దయ్య 10,000
4 కోయ రామారావు 15,000
5 గుర్రం విశ్వేశ్వరరావు 18,000
6 గుర్రం మాధవరావు   5,000
6 గుర్రం రామచంద్రరావు s/o పెదబాబు 25,000
7 గుంటుపల్లి జగన్నాధం   5,000
  మొత్తం 98,000

ఆగష్టు 2018 వరకు రాబడివ విరాళం సొమ్ముకు ఖర్చు వివరాలు

1 మొక్కలు రవాణా చార్జీలు వెలగపూడి నుండి రెండు ట్రాక్టర్లు ద్వారా 9,000
2 ఐరన్ మెస్ ట్రీ గార్డ్సు 270+ 35,200
3 కలప కర్ర ముక్కలు ట్రీ గార్డ్సు సపోర్ట్ 2బండిల్సు 10,500
4 ప్లాస్టిక్ ట్రీ గార్డ్సు 40   8,300
5 ట్రీ గార్డ్సు ఏర్పాటుకు లేబర్ చార్జి. Names    9,450
6 పొనుగుపాడులో చేయించిన ట్రీ గ్రార్డ్సు 5   2,400
7 రవాణా చార్జీలు ఐరన్ మెస్ ట్రీ గార్స్  16,000
  ఖర్చు మొత్తం 90,850

విరాళం జమ మొత్తం 31.08.2018 వరకు —-    రు.98,000

ఖర్చు మొత్తం 31.08.2018 వరకు           —-    రు.90,850

31.08.2018 నాటికి నిల్వ (నిర్వహణ కొరకు)-     రు.  8,850

పై వివరాలు  వేణుగోపాల్  ఎడ్యుకేషనల్ ట్రష్ట్  ప్రెసిడెంటు తూము వేణుగోపాల్ అందించగా అతని కోరిక మేరకు ప్రచురించటమైంది

Tagged with: , ,

యువతా చెప్పానని కినుక వహించుకమా!

యువతా చెప్పానని కినుక వహించుకమా!

 • ఓ యువతా నీ ఓటు హక్కు దుర్వినియోగం చేయకుమా,
 • అవినీతి తెగులు, నేర చరిత్ర, లేని మంచి అభ్యర్థికి వేయాలి నీ ఓటు
 • అంతేగాదు అక్రమ మార్గాలలో సంపాదించిన నేరగాళ్లకు,
 • పీకల్లోతు కుంబకోణాలలో కూరుకుపోయిన వ్యక్తులకు
 • నీ ఓటు వేసి తదుపరి తప్పు చేసానని ప్రాశ్చాత్య పడకుమా!
 • మంచికి మారుపేరు గల వార్కి వేయాలి సుమా నీ ఓటు
 • ఈ దేశానికి పట్టిన అవినీతి రుగ్మతలు నుండి ఒడ్డున
 • పడగలవేయ సత్తా మీ యువతకు ఉందని మేమంతా
 • ఎదురు చూచుటను వమ్ము చేయకురా!
 • ఇంతేకాదు సుమా అంతకన్నా ముందు మీరు
 • ఆరోగ్యంగా ఉంటేనే జాతి, దేశం బలంగా ఉండేది,
 • చెప్పానని కినుక వహించుక కొద్దిగా ఆలోచించు సుమా,
 • మధ్యపానం,దూమపానం వధ్దురా! మాదకద్రవ్యాల జోలి
 • అసలు పోబోకురా! మీ ఆరోగ్యం బాగుంటే జాతికి,దేశానికి,
 • మిమ్మల్ని కన్నవార్కి అంతకన్న కావలసింది
 • ఇంకేముంది గ్రహించు  మిత్రమా!
Tagged with: , ,

పొనుగుపాడులో జరిగిన వనం-మనం కార్యక్రమ విశేషాలు.

వృక్షో రక్షితి రక్షత:

“మనం చెట్టును కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది”.

అసలు మనందరం ఎంత సేపటికి మన సంతానానికి తరతరాలుగా సరిపోను ఇంకొకరికన్న మనం ఎక్కువ ఎలా సంపాదించి ఇద్దమా అనే ధ్యాస మనందరిలో ఉన్నమాట వాస్తవం.

సరే కాసేపు తప్పులేదు అనుకుందాం.ఆ సంపాదింది ఇచ్చినది అనుభవించుటానికి ఆరోగ్యకరమైన వాతావరణం వారికి అందించాలనే ఆలోచన గురించి బహు కొద్ది మంది మాత్రం తప్ప ఎవ్వరూ ఆలోచించుట లేదు.

ఇది ఎవరు కాదన్నా అవునన్నా వాస్తవం. మనం జీవించినదే జీవితం కాదు.మన తరువాత మన భావి తరాలవారు ఆరోగ్యంగా జీవిస్తేనే మన జన్మ సార్ధకమైనట్లు.

అలాంటి మంచి ఆలోచనతో మన గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది వేణుగోపాల్ (ఎజిపి) ఆధ్వర్యంలో ది.06.08.2017 ఆదివారం నాడు “వనం-మనం” కార్యక్రమం మన గ్రామంలో నిర్వహించటం చాలా అభినందించ తగ్గ విషయం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ కైత్ పాల్గొన్నారు.ముందుగా మేళతాళాలుతో పెద్దలు విద్యార్ధిని, విద్యార్దులు వెంటరాగా “మానవ మనుగడకు వృక్షాలే కీలకం” అనేబ్యానర్లు, ప్లేకార్డులు చేతబూని అతిధులను సాదరంగా ఆహ్వానించారు. తదనంతరం పాఠశాల ఆవరణలో పసుపు, కుంకమ, పూలుతో అందంగా అలంకరించిన పాదులలో వేదపండితుల మంత్రోచ్చారణల తో జస్టిస్ సురేష్ కుమార్ కైత్ చే మొక్కలు నాటించారు.

పొనుగుపాడు నుండి గుంటూరు-కర్నూలు వెళ్లు అప్రోచ్ రోడ్డుకు ఇరువైపుల, జిల్లా పరిషత్ ఆవరణలో మరియు మెరికపూడి వెళ్లు మట్టి రోడ్డుకు రెండు వైపుల, నార్నెపాడు వెళ్లు డొంక రోడ్డులో ఇరువైపుల మొక్కలను నాటారు.గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం పండగ వాతావరణాన్ని తలపించింది.

సభా కార్యక్రమం

ఈ కార్యక్రమం సందర్బంగా జిల్లా పరిషత్ ఆవరణలో జరిగిన సమావేశంలో జష్టిష్ సురేష్ కుమార్ కైత్ మాట్లాడుతూ మానవాళికి చెట్లే ప్రాణ దాతలని, సమస్త ప్రాణికోటికి వృక్షం ప్రధానమైనదని చెప్పారు. చెట్టును మనం రక్షిస్తే మనకు అది ప్రాణవాయువు ఇచ్చి మనల్ని రక్షించిదని, వాతావరణ సమతుల్యాన్ని కాపాడుతుందని, మానవ జీవితానికి అవసరమైన కలప, అనేక సుగంధ ద్రవ్యంలు అందిస్తున్నాయని చెప్పారు. జష్టిష్ సురేష్ కుమార్ ఖైత్ ఆంగ్లంలోచేసిన ప్రసంగాన్ని జిల్లా జడ్జి హరిహరనాధ శర్మ తెలుగులో అనువదించి చెప్పారు.న్యాయవాది వేణుగోపాల్ మాట్లాడుతూ నాటిన 2500 మొక్కలను గ్రామస్తుల సహకారంతో కాపాడుతామని, ప్రస్తుతం నాటిన మొక్కలు భవిష్యత్తరానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు.గ్రామాన్ని నందనవనంగా తీర్చి దిద్దుతామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి హరి హరనాధ శర్మ , రెండవ అదనపు జడ్జి సురేష్, నరసరావుపేట జిల్లా జడ్జి జయకుమార్, జాయంటు కలెక్టరు-2 యం. వెంకటేశ్వరరావు, ఆర్.డి.ఒ. బండ్ల శ్రీనివాస్, జిల్లా ఇన్ చార్జి డి.ఇ.ఒ.పిల్లి రమేష్, నరసరావుపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు పంగులూరి ఆంజనేయులు, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి ఉమా మహేశ్వరరావు,మాజీ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వర్లు, డివిజనల్ సామాజిక అటవీ అధికారులు యల్.బీమయ్య, కె.మోహనరావు, తహసీలుదారు పార్ధసారధి, ఎం.పి.డి.ఒ. శ్యామలాదేవి ఇతర ఆధికారులు పాల్గొన్నారు.

గ్రామానికి చెందిన స్థానికులు ముఖ్యులు సర్పంచ్ మాధవరావు, యం.పి.టి.సి.అమరయ్య, వంకాయలపాటి బలరామ కృష్ణయ్య, రాయంకుల శేషతల్పశాయి, గుంటుపల్లి జగన్నాధం, క్రోసూరి సుబ్బారావు, చంద్రమౌళి, తులసీధరరావు, రామాంజనేయులు, హెచ్.యం.పద్మావతి, తదితర గ్రామ పెద్దలు, విద్యార్ధిని విద్యార్దులు పాల్గొన్నారు.

సమావేశ అనంతరం జష్టిష్ సురేష్ కుమార్ ఖైత్ ను గ్రామ పెద్దలు అధికారులు సన్మానించారు.

సర్వేజనా:సుఖినోభవంతు

ఫొటో గ్యాలరీ

Slider
Tagged with: , ,

బదిలీ కాబడిన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు

 ఉపాధ్యాయులకు శుబాకాంక్షలు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న జె.పూర్ణయ్య (సోషల్), జె.శంకరరావు (సైన్స్),  పి.ఉషారాణి (లెక్కలు), వి.రూజువెల్టుబాబు (అంగ్లం), ఎ.కోటేశ్వరరావు (తెలుగు), యం.నాగ మల్లేశ్వరి (సైన్స్) లు బదిలీ అయినందున ది.31.07.2017న ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఆ సందర్బంగా జరిగిన సభకు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మావతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా సర్పంచ్ మాధవరావు, యంపిటిసి సభ్యులు అమరయ్య, విద్యా కమిటి ప్రసిడెంటు కోటేశ్వరరావు, పూర్వ విద్యార్దుల సంఘం తరుపున కోట్లింగయ్య, వలి మాష్టరు, విద్యార్దిని విద్యార్దులు, ఉపాద్యాయిని ఉపాద్యాయులు, తదితరులు హాజరయ్యారు.

సమావేశం తదనంతరం వారందరిని పాఠశాల తరుపున,పూర్వ విద్యార్ధుల సంఘం తరుపున ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా వార్కి గ్రామ ప్రజలు తరుపున WWW.manaponugupadu.com శుభాకాంక్షలు

Tagged with: , ,

మన దేశంలో చదువుల దుర్గతి. – ఏం చేద్దాం?

మన దేశంలో చదువుల దుర్గతి. – ఏం చేద్దాం?                                  

బోడెపూడి ప్రసాదరావు.

వ్యాసకర్త:శ్రీ బోడెపూడి ప్రసాదరావు.

ప్రపంచ బ్యాంకు చెప్పింది. “దక్షిణ ఆసియాలో చదువులు అధ్వాన్నం. ఇండియా, పాకిస్థాన్ లలో మరీ ఘోరం.పాఠాలు చెప్పే మాష్టర్లు కు వారి విద్యార్థుల కంటే స్వల్పంగా ఎక్కువ తెలుసు.” అని.(ఆంధ్ర జ్వోతి – జులై 1, 2014). ప్రధమ్ అనే స్వచ్చంధ సంస్థ – దేశ వ్యాప్తంగా సర్వే చేసి, “ 5 వ తరగతి విద్యార్థులు 1, 2 తరగతుల పాఠాలు చదవ లేరు” అని వ్రాసింది.,- ( Annual education states report, 2010, ’11, ’12, ’13, ’14 లకు) – నేను ప్రశ్నించిన డజన్లు కొద్దీ  పిల్లలు ”3” లో నుంచి 6 తీసేయలేము,  “3” ను 6 పెట్టి భాగించటం వీలులేదు”  అని సమాధానాలు చెప్పారు 7-10 తరగతుల పిల్లలు.ఈ విషయంలో గవర్నమెంటు తెలుగు మీడియం కాని, ఇంగ్లీసు మీడియం కార్పోరేటు స్కూళ్లు కానీ పరిస్థితి ఒకటే. గవర్నమెంటు తెలుగు మీడియం స్కూళ్లులో – ఆడపిల్లలకు మరుగు దొడ్లు లేవు. మాష్టర్లు లేరు.- ఉన్న వాళ్లు స్కూళ్లకు రారు.- వచ్చిన వాళ్లు పాఠాలు చెప్పరు. – చెప్పేవాళ్లకు చదువెంతొచ్చో అనుమానమే ! ఆ స్కూళ్లకు ఇంక ఏ దిక్కు లేని పేద పిల్లలే వెడతారు.అందులో ఆడ పిల్లలు ఎక్కువ. నాలుగిండ్లలో పాచిపని చేసుకునైనా తమ పిల్లల్ని(అందులో మగ మహా రాజుల్ని) ఇంగ్లీసు మీడియంలో నేర్పించాలని ఆరాట పడతారు తల్లులు. కూలీ నాలీ చేసుకునే తండ్రులు సగం సంపాదన తాగుడుకే పోస్తారు.

తలకు మించిన జీతాలు కడతారు.

వారి తలకు మించిన జీతాలు కడతారు.- ‘మమ్మీ’, ‘డాడీ’ అని నేర్పించటానికి. ప్రోగ్రెస్ కార్డుల్లో 98 శాతానికి తగ్గకుండా రిపోర్టులు చూచుకొని తమ పిల్లలకు నిజంగానే చదువొస్తొందని సరదా పడతారు మహా తల్లులు. ఆ మార్కులు క్లాసు పాఠాలు బట్టీ పెట్టి ముక్కున పెట్టుకున్న నాలుగు ముక్కల ఫలితమని తెలియదు పాపం !  ఇక ఇంకా పెద్ద కార్పోరేటు స్కూళ్లలో మరీ ఎక్కువ జీతాలు. – సంవత్సరానికి 50 వేల నుంచి 5 లక్షల వరకు కూడ – నాజీల  Concentration camp ల్లాంటి Techno schools  అనే ఫ్యాక్టరీలలో (ఆత్మహత్యలు చేసుకోవటానికి వీలు లేని హాస్టళ్లుంటాయి – ఫర్వాలేదు లెండి !) ఎమ్సెట్ రేంకు హోల్డర్లను తయారు చేస్తారు పోటా, పోటీగా. అందులో నూటికి 3 శాతం మందికి మాత్రమే  Soft wear కంపెనీల్లో ఉద్యోగార్హత వుంటుంది. మిగతావారి సంగతేంటో ఆ భగవంతుడికే తెలియాలి. ఆ సెలక్టు అయిన వారు – యువతీ, యువకులు కళ్ళు చెదిరేంత డబ్బు సంపాదిస్తారు. కాని జీవితంలో పొందవలసిన సుఖ, సంతోషాలు, స్నేహం, సేహార్థాలు, మంచి చెడుల విచక్షణ – లాంటి విషయాలలో మాత్రం దివాళా! ముప్పయ్యదేళ్ళకే ముసలితనం, విడాకులు. అశాంతి.!

ఒకప్పుడు అధిక జనాభా శాపం అనుకునే వాళ్ళం

                          ఇంజనీరిగు, మెడిసిన్ల వగైరా కోర్సులకు వెళ్ళలేని తెలుగు మీడియం విద్యార్తులు డిగ్రీలు చదివి యూనివర్శిటీల్లో చేరతారు.అక్కడ మీడియం అధికారికంగా ఇంగ్లీష్ కాని పరీక్షలు తెలుగులో వ్రాయచ్చు.(మన పాలకులు సామాజిక న్యాయం బాగా పాటిస్తారు) ఆధునిక విజ్ఞానమంతా ఇంగ్లీసులో వుంది. నలభై ఏళ్ళనాడు తెలుగు ఎకాడమీ ప్రచురించిన పుస్తకాలు – సబ్జక్టులకు ఇంటర్ స్థాయిలో ఒకటి, రెండుంటాయి తప్ప యూనివర్శిటీస్థాయిలో ఒక్కటీ లేదు. అయినా మన గొప్పతనం ఏమిటంటే ఎంఎ, ఎం.యస్సీ లు చదివిన విద్యార్థుల్లో అత్యధిక సంఖ్యాకులకు ఫస్టు క్లాసులూ, డిష్టింగ్షన్లూను. మిరకల్స్ లోనమ్మకం వున్న దేశం కదా మనది – అందువల్ల ఆ ఫస్టు క్లాసులో ఏ ఉద్యోగం రాదు- యూనివర్శిటీలో వున్న సమయం అంతా పోటీపరీక్షల తయారీ కోసం ఉపయోగిస్తారు. అపనికైతే కోచింగు సెంటర్లు చాలుగదా. యూనివర్శిటీ లెందుకు ?

                          ఒకప్పుడు అధిక జనాభా శాపం అనుకునే వాళ్ళం – ఇప్పుడు అది మనకు వరం. ప్రపంచంలోని అధిక సంఖ్యాక దేశాల్లో 60 ఏళ్ళు దాటిన వృద్దుల శాతం 60 కి మించిపోయింది..- అమెరికా, యూరపు, జపాను.- ఇంకా చైనా కూడ. – మన దేశం లోనే 25-45 సంవత్సరాల వయోజనులు 53 శాతం మించి వున్నారు. ఈయువతను మానవ సంపదగానూ, మూలధన వసతుగానూ మలచగలిగితే ప్రపంచాన్నే మలచగలుగుతారు. తగిన ప్రణాళికలు తయారుచేసి, అమలుచేయగల చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం కావాలి.

మరొక్క మాట.

                   ఈనాటి చదువులు ఉదర పోషణకు పనికి రావచ్చు గాని, వివేకవంతమైన సుఖజీవనాన్ని ఇవ్యలేవు. అరోగ్యవంతమైన శరీరం, వివేకవంతమైన మనస్సు, ఉదాత్తమైన మానవతా విలువలూ పాఠ్యాంశాలలో వుండవు. ఉప్పు,- కప్పురానికి మద్య తేడానీ,అల్పుడకీ – సజ్జనుడికీ, మద్య అంతరాన్నీ, ధర్మ- అధర్మాల మద్య విచక్షణనూ, మనిషికీ-మనిషికీ గల భేధాన్ని- ఈ చదువులు చెప్పలేవు. తెలుగులో విజ్ఞానఘనులైనా శతకాలు (వేమన, సుమతి, భాస్కర వగైరా) నూ, సుభాషితాలు (భర్త్రహరి) మాత్రమే వివేకాన్ని, విచక్షణనూ అందిస్తాయి. ఆదర్శాలూ, అలవాట్లూ, విలువలూ, అభిరుచులూ అంకురించి చిగురించేది హైస్కూలు రోజుల్లోనే. పాఠ్యాంశాలతో బాటు వీటి బోధన కూడ అవసరమే కదా !

              అయితే ఈ ‘ సోది ‘ అంతా దేనికంటారేమో ; నాది ‘సోది’ కాదు-ఆవేదన …. ఆలోచనాపరులైన మీకు నానివేదన.

ఇంతకీ నేనెవరు?  అనేగా మీ ప్రశ్న ..

                      నా పేరు బోడేపూడి ప్రసాదరావు. ఆంధ్ర యూనివర్శిటీలో ఆచార్యుడుగా జీవితం గడిపి 20 ఏళ్ళ క్రితం రిటైరయ్యాను. 20 ఏళ్ళ కుర్రాణ్ణి. – అంటే 60 ఏళ్ళు పూర్ణాయుస్సునుకుంటే ఆపైది కొత్త జన్మే కదా. – అందులో 20 ఏళ్ళు గడిచినవి.. మొదట పాఠాలు చెప్పటం నావృత్తి – ఈ extended tenure కు సామాజిక సేవ నాప్రవృత్తి.- విధి ప్రసాదించిన ఈబోనస్ జీవితానికి అర్థం, పరమార్థం వెతుక్కుంటూన్న అన్వేషిని. పిల్లల చదువు నా obsession ; మీ సలహా, సహకారాలు ఆర్థిస్తున్నాను.

శలవు.

Cell no. 9000815272.

Tagged with: , ,

గ్రామానికి సంబంధించిన ఇతర వీడియోలు

ఇతర వీడియోలు.

గ్రామంలో పండగలు, ఇతర సందర్బాలలో తీసిన గ్రామానికి సంబందించిన వ్యక్తుల, కార్యక్రమాల దృశ్యమాలికలు.

Interview of Shri R.S.T. Sai, Ex.Chairman & Managing Director, NHPC on TalkTime – News Live, News Channel on 09/11/2014 – Subansiri Explained

Tagged with:

శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ ఫొటో గ్యాలరీలు.

శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ ఫొటో గ్యాలరీలు.

2012వ సంవత్సరం మార్చి 12న ఆలయం పున:నిర్మాణంనకు శంకుస్థాపన చేసిననాటి నుండి ఆలయం పూర్తి నిర్మాణం జరిగినంతవరకు ( 5/2017 ) వివిధ కార్యక్రమాలు  ఈ ఫొటోలలో వీక్షించవచ్చు. 

Tagged with: , , ,

శ్రీ కాశీ విశ్వేశ్వరుని 101వ కళ్యాణం ఫొటో గ్యాలరీ

చిత్రమాలిక

2017 మార్చి మాసంలో జరిగిన శ్రీ గంగా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి పూర్తి శత జయంతి కళ్యాణం ఫొటోలు వీక్షించండి.

Slider
Tagged with: , ,

రాయంకుల శేషతల్పశాయి పదవీ విరమణ చిత్రమాలిక.

మన పొనుగుపాడు ప్రజలందరం గర్వించే రాయంకుల శేషతల్పశాయి పలు ఉన్నత పదవులు నిర్వహించిన సంగతి మనందరకు తెలుసు.

ఉత్తరాఖండ్ రాష్టంలోని “తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్” చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి రిషికేష్ నందు 30.11.2016 న పదవీ విరమణ పొందారు.

ఆ సందర్బంగా వార్కి మన పొనుగుపాడు ప్రజలు,బంధువులు, స్నేహితులు తరుపున manaponugupadu.com శుభాకాంక్షలు.

చిత్రమాలిక వీక్షించండి.

Slider

శేషతల్పశాయి గారిని NHPC చైర్మెన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ హోదాలో టాక్ టైంన్యూస్ లైవ్ వారి ది.09.11.2014న పలు ఆసక్తికర విషయాలపై ఇంటర్వూ చేసారు.

దృశ్య మాలిక క్లిక్ చేసి వీక్షించండి

Play
Slider
Tagged with: , , ,
powered by rekommend.io