శ్రీ విశ్వేశ్వరస్వామి వందవ కళ్యాణ మహోత్సవం ఫొటో గ్యాలరీ

చిత్రమాలిక వీక్షించండి.

మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి తెలుసు.

ఆ సందర్బంగా స్వామి వారి శతజయంతి కళ్యాణం  2016 మార్చి 23వ తేది పౌర్ణమి రోజు ఉదయం ఆలయ పాలక వర్గంవారు అత్యంత భక్తిప్రపత్తులతో వైభవంగా జరిపారు.

Slider
Tagged with: , , ,

శివాలయం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఫోటో గ్యాలరీ.

శివాలయం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఫోటోలు గ్యాలరీ.

శ్రీ కాశీ విశ్వేశ్వరుని బ్రహ్మోత్సవం కనివిని ఎరుగని రీతిలో ఘనంగా జరిగిన సంగతి మనందరుకు తెలుసు. అందులో భాగంగా ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది.

ఆకార్యక్రమంలో జరిగిన కలశంల మహా ఊరేగింపు, ఆలయ కుంభాభిషేక మహోత్సవం, స్వామి వారి మహాదర్శనం మొదలగు కార్యక్రమాల చిత్రమాలికను వీక్షించండి.

Tagged with: , , ,

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణం చిత్రమాలిక.

శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణం చిత్రమాలిక.

మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి తెలుసు.

ఆ సందర్బంగా 26 వ తేది శనివారం స్వామి వార్కి జరిగిన శాంతి కళ్యాణం  కనుల పండగగా జరిగింది. ఆ చిత్రమాలికను క్లిక్ చేసి వీక్షించండి. 

Slider
Tagged with: , , , ,

శాంతి కళ్యాణంలో పాల్గొనిన దంపతుల చిత్రమాలిక.

ఫొటోగ్యాలరీ 

మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం 2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి    తెలుసు.

ఆ సందర్బంగా 26 వ తేది శనివారం  సాయంత్రం స్వామి వార్కి అత్యంతవైభవంగా శాంతి కళ్యాణం జరిగింది.

శాంతి కళ్యాణంలో 142 మంది దంపతులు  సాంప్రదాయ దుస్తులు ధరించి పీటల మీద కూర్చొని భక్తిప్రపత్తులతో కళ్యాణం తిలకించారు.

కుమార్తెలు ఉండి వివాహ సమయంలో కన్యాదానం చేయని దంపతులు, అలాగే కుమారులు మాత్రమే ఉండి కన్యాదానంనకు నోచుకోని దంపతులు కన్యాదానం చేసినంతటి ప్రతిఫలం కలుగుతుందని  పురాణాలు,శాస్త్రాల ద్వారా మనకు తెలుస్తుంది.

అంటే భర్త వైపు పది తరాలు,భార్య వైపు పది తరాలు వారు మోక్షమార్గం పొందుతారు. కుటుంబంలో శాంతిసౌభాగ్యాలు ఉంటాయి. కృతయుగంలో తపస్సుకు, త్రేతాయుగంలో జ్ఞానానికి, ద్వాపర యుగంలో యజ్ఞానికి, కలియుగంలో కన్యాదానానికి విశిష్ట స్ధానం ఉన్నట్లుగా పద్మ పురాణం చెపుతుంది.

పీటల మీద కూర్చొనిన దంపతులందరి చేత స్వామి వారికి తలంబ్రాలు పోయించి,

వారందరికి ఆలయ పాలకవర్గం తరుపున డాక్టరు మర్రి పెద్దయ్య వంకాయలపాటి బవరామకృష్ణయ్య, తదితరులు నూతన వస్త్రాలు బహుకరించారు.

ఆ చిత్రమాలికను క్లిక్ చేసి వీక్షించండి 

Tagged with: , , , ,

నిజంగా పుణ్యం చేసుకున్న పొనుగుపాడు

సర్వేజనా:సుఖినోభవంతు

శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  సందర్బంగా నిర్వహించిన శత చండీయాగం, మహాకుంభాభిషేకం, పూజలు వీక్షించి, భక్తులను ఆశ్వీరదించిన ఐదుపడగల ఆదిశేషుని దర్శన భాగ్యం భక్తులకు లభించటం (25.03.2016) నిజంగా పొనుగుపాడు పుణ్యం చేసుకుంది. ఇది గొప్ప విశేషం.

ఆకార్యక్రమాల చిత్రమాలిక వీక్షించండి

Slider

అలాగే ఈ వందేళ్ల పండగ సందర్బంగా జరిగిన మహాకుంభాభిషేకం కార్యక్రమానికి హంపీ పీఠాధిపతి శ్రీవిధ్యారణ్య భారతీ మహాస్వామి, రిషికేశ్ పీఠాధిపతి శ్రీవేదానందగురు మహాస్వామి, కారంచేడు ఆశ్రమ పీఠాధిపతి ప్రణవానందగిరి స్వామి తదితర పీఠాధిపతులు విచ్చేసి అధ్యాత్మిక భాషణం చేసి భక్తులకు దీవెనలు అందజేయటం ద్వారా నిజంగా పొనుగుపాడు పుణీతం అయ్యింది.

Tagged with: , , , ,

కుమారి చిన్మయి భరతనాట్యం భంగిమలు

తిలకించండి.

కుమారి.చిన్మయి భరతనాట్యం వివిధ భంగిమలు

మన పొనుగుపాడు గ్రామంలో  శ్రీగంగా అన్నపూర్ణ సమేత శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి 100వ కళ్యాణ మహోత్సవంలో  ది.25.03.2016న మణిదీప వైభవం సాహిత్య రూపకం జరిగిన సంగతి మనందరికి తెలుసు.

జగన్మాత పార్వతీదేవి ఆ కార్యక్రమంలో  శ్రీ త్రిభువనేశ్వరీదేవి (శ్రీ మహలక్ష్మీదేవి) రూపంగా నిలయమై ఉంటుంది. శ్రీ త్రిభువనేశ్వరీదేవి పాత్రను శ్రీమతి అచ్యుతుని రాధామాధవి పోషించారు.ఆ రూపకంలో భాగంగా వారి కుమార్తె కుమారి చిన్మయి భరతనాట్యం భక్తులందరిని అలరారించింది.

ఆ భరతనాట్యం లోని వివిధ భంగిమలు  మరియెకసారి తిలకించండి.

Play
Slider
Tagged with: , , ,

వందేళ్ల పండగలో సత్కారం పొందిన ముఖ్యులు.

ఫొటో గ్యాలరీ

మన గ్రామంలో 2016 మార్చిలో శివాలయం జరిగిన వందేళ్ళ పండగ జరిగిన సంగతి మనందరకు తెలుసు. మన గ్రామం మీద అభిమానంతో దూర ప్రాంతంలనుండి ముఖ్యులు విచ్చేయుట మనమందరం గర్వించతగ్గ విషయం. అలాగే వారినందరిని సత్కరించుట కూడ కార్యక్రమ నిర్వహకుల కనీస భాధ్యత.

కె.వి.కె.రామారావు,  గుంటుపల్లి  తులసీధరరావు, అభినయ (గద్దె) శ్రీనివాస్,ల సహకారంతో శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పాలక వర్గం తరుపున వంకాయలపాటి  బలరామకృష్ణయ్య, డాక్టరు మర్రి పెద్దయ్య తదితర ఆలయపాలక వర్గ సభ్యులు ఓపిక, సమన్వయంతో  ఆ కార్యక్రమం నెరవేర్చుట చాలా గొప్ప విషయం.

వారందరికి  www.manaponugupadu.com తరుపున అభినందనలు.

Slider

అతిధులను, అధికారుల,అనధికారుల, కళాకారుల,ఫీఠాధిపతుల.ఇతర ముఖ్యులను సత్కరించిన చిత్రమాలికను వీక్షించగలరని ఆశిస్తున్నాం.మీరు లేదా మీకు తెలిసిన ప్రముఖులు ఉండవచ్చు.

చిత్రమాలికను వీక్షించి వారికి తెలియచేస్తే వారు సంతోషిస్తారు.

Tagged with: , , ,

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి 99వ కళ్యాణం ఫొటో గ్యాలరీ

2015 మార్చిలో జరిగిన శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి 99వ కళ్యాణమహోత్సవం చిత్రమాలిక

Slider
Tagged with: , ,

శివాలయం బ్రహ్మోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాల వీడియోలు

 శతజయంతి మహోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాల వీడియోలు.

స్వామి వారి వందవ కళ్యాణం.(మొదటి భాగం.)

స్వామి వారి వందవ కళ్యాణం.(రెండవ భాగం.)

స్వామి వారి వందవ కళ్యాణం.(మూడవ భాగం)

స్వామి వారి వందవ కళ్యాణం.(నాలుగవ భాగం)

స్వామి వారి వందవ కళ్యాణం.(ఐదవ భాగం.)

కుంభాభిషేక కలశంల ఊరేగింపు మహోత్సవం

ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం.

స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం.

సువాసిని పూజా కార్యక్రమం

భజన కార్యక్రమాలు

పూజా కార్యక్రమాలు

రధంపై స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం.

Tagged with: , ,

శివాలయం బ్రహ్మోత్సవం సందర్భంగా ముఖ్యుల అభిప్రాయాలు.

శివాలయం బ్రహ్మోత్సవం సందర్భంగా ముఖ్యుల అభిప్రాయాలు.

వీడియో

Tagged with: , , ,

శివాలయం వందేళ్ల పండగ సాంస్కృతిక కార్యక్రమంల వీడియోలు

మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి శతజయంతి వార్షిక కళ్యాణం, బ్రహ్మోత్సవం 2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి  తెలుసు.

ఆ సందర్బంగా ఆలయంలో జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యమాలికలను వీక్షించండి. 

Tagged with: , , , , ,

హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్యభారతీ స్వామి ఆధ్యాత్మిక ప్రసంగం.

శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవం సందర్బంగా ప్రసంగించిన హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామి ఆధ్యాత్మిక ప్రసంగం.

వీడియో   

Tagged with: , , , , ,

డాక్టరు మీగడ రామలింగస్వామి ఆధ్యాత్మిక ప్రసంగము.

శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవం సందర్బంగా చేసిన

డాక్టరు మీగడ రామలింగస్వామి ఆధ్యాత్మిక ప్రసంగము.

వీడియో

Tagged with: , , , ,

మణిదీప వైభవం.(సాహిత్య రూపకం) వీడియో.

మణిదీప వైభవం. (సాహిత్య రూపకం)

శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవం ఆ సందర్బంగా మణిదీప వైభవం గురించి వర్ణించిన సాహిత్య రూపకం వీడియో.

జగన్మాత పార్వతీదేవి మణిదీపంలో శ్రీత్రిభువనేశ్వరీదేవి (శ్రీ మహాలక్ష్మిదేవి) రూపంగానిలయమై ఉంటుంది. అచ్యుతుని రాధామాధవి శ్రీ త్రిభువనేశ్వరదేవి పాత్రలో భక్తులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు డాక్టరు కోగంటి రంగనాయకి,(తిరుప్పాయై అమృతవర్షిణి),మంచికంటి వెంకట సత్యవతి (ఉపన్యాస భారతి) సారధ్యం వహించారు.అమ్మవారి సప్తమ రూపాలైన బ్రహ్మి, మహేశ్వరి,కౌమారి,వైష్ణవి,వారహి,ఇంద్రాణి,చాముండి పాత్రలలో వైష్ణవిదుర్గ,లక్ష్మికుమారి, శివకుమారి తదితరులు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.మణిదీప వైభవంలో భాగంగా కుమారి చిన్మయి భరత నాట్యం ప్రేక్షకులను రంజింప చేసింది.

Tagged with: , , ,

వయో వృద్ధులను సన్మానించిన వీడియా.

శ్రీ మర్రి గోపాలకృష్ణయ్యగారికి పురష్కారం.

వయో వృద్ధులను సన్మానించిన వీడియో.

మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి  తెలుసు.

ఆ సందర్బంగా గ్రామంలో ఎనుబది సంవత్సరంలు దాటిన పెద్దవారిని ఆలయ పాలకవర్గం వారు సత్కరించగా తీసిన దృశ్యమాలిక

Tagged with: , , , ,

అల్లాబక్ష్చుకు శుభాకాంక్షలు

   అందుకో అల్లాబక్ష్చు మా శుభాకాంక్షలు.

మన పొనుగుపాడులోని ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, ఫోటోగ్రఫీలో అత్యున్నత స్థాయికి అంచెలంచలుగా ఎదిగి,రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖులు అందరికి చిరపరిచితుడైన పొనుగుపాడు గ్రామ ప్రజలు గర్వించే ముద్దు బిడ్డలలో ఒకరైన అల్లాబక్ష్చు ఫొటోగ్రఫీలో అమెరికాకు చెందిన ఇమేజ్ కొలీగ్ సొసైటీ వారు నిర్వహించిన ఇంటర్నేషనల్ పోటీలో అరకు లోయలో గిరిజనుల జీవిత విధానం పై పంపిన “ఎంజాయ్”, “మనలో ఒకరు” చిత్రాలకు అంతర్జాతీయ ప్రతిభా పురష్కారం అందుకున్న సందర్బంలో ది.01.07.2017 శనివారం విజయవాడలో రాష్ట్ర సృజానాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో ఐసీయస్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో పురష్కారం అందుకున్న సందర్బంగా పొనుగుపాడు గ్రామ ప్రజలు తరుపున

www.manaponugupadu.com శుభాకాంక్షలు.

ప్రముఖులతో అల్లాబక్ష్చు

Tagged with: , ,

శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమం.

పున:నిర్మాణ కార్యక్రమం

 

ఆలయ ట్రష్టుబోర్డు చైర్మెన్ గా క్రోసూరి వెంకట్రావు పనిచేసే కాలంలో (2008 సం.ము) దేవాలయం పూర్తిగా శిధిలమై పడిపోయే స్థితికి చేరువైనది. దేవాలయం జీర్ణోద్దరణ గావించవలసిన సమయం ఆసన్నమైనదని గ్రామ పెద్దలు గ్రహించారు.

దేవాలయం పున:నిర్మించాలనే సంకల్పం గ్రామస్థుల అందరి మనసులో అభిప్రాయం కలిగింది. ఆ అభిప్రాయం ఆచరణలో పెట్టుటకు కొంగర జగన్నాధం, యర్రం కోటేశ్వరరావు, దాడి రాధాకృష్ణ, గుర్రం రామారాయుడు, క్రోసూరి బుచ్చయ్య, కోయ వెంకట్రావు, క్రోసూరి బాలరాజు,  ఆలయ అర్చక స్వామి శ్రీనివాస రాజ గోపాలాచార్యులు మరి కొంతమంది కలసి 2008లో హైదరాబాదు వెళ్లి అప్పటి దేవాదాయ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారిని కలసి అర్జీ సమర్పించుట జరిగింది.

పాలక వర్గం ప్రమాణ స్వీకారం

ట్రష్టుబోర్డు చైర్మెన్ క్రోసూరి వెంకట్రావు పదవీ కాలం ఏప్రియల్ 2010 తో ముగిసింది. తదుపరి మాజీ చైర్మెన్ వెంకట్రావు భార్య పున్నమ్మ,మాగులూరి సత్వవతి, తెలగతోటి చినలక్ష్మయ్యలతో పాలక వర్గం ఏర్పడింది.

పాలకవర్గం చైర్మెన్ గా క్రోసూరి పున్నమ్మ పదవీ బాధ్యతలు చేపట్టింది. పూజారి రాజ గోపాలా చారి ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించబడ్డారు.

ఆ తరువాత ది.19.11.2011న జరిగిన అప్పటి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ  దేవాదాయశాఖ బోర్డు సమావేశంలో  1/3 వంతు సి.జి.యఫ్. విరాళం రు.8,15,000 చెల్లించే పద్దతిపై ఆలయ జీర్ణోద్దరణకు రు.24,45,000/- లు మంజూరుకు ఆమోదం పొందబడింది.

సాయిగోపాల్ ముందడగు

యర్రం కోటేశ్వరావు ప్రోత్సాహంతో కీ.శే.మాచవరపు కోటేశ్వరరావు కుమార్డు సాయిగోపాల్, రీతి (అమెరికా) దంపతులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి 1/3 వంతు సి.జి.యఫ్. విరాళం సొమ్ము రు.8,15,000 లు చెల్లించారు.

సాయిగోపాల్

యర్రం కోటేశ్వరరావు

గేరా కోటేశ్వరరావు

తాడికొండ నియోజకవర్గ సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవర ప్రసాదరావు మంత్రిగా పని చేసిన కాలంలో గేరా కోటేశ్వరరావు సహకారంతో దేవాలయ జీర్ణోద్దరణకు అనుమతి ఉత్తర్వులు లభించినవి.

గ్రామ పెద్దలు, ప్రజలు,దేశ విదేశాలలో ఉన్న పొనుగుపాడు నివాసులు యావన్మంది కుల మతాలకు అతీతంగా జీర్ణోద్దరణ గావించుటకు ప్రభుత్వం మంజూరు చేసిన రు.24,45,000 లుకు తోడు ఎవరెవరి శక్తి కొలది వారి వంతు సహకారం తప్పనిసరిగా అందించగలమని వాగ్దానాలు చేసారు.కొంత మంది దాతలు పెద్ద మనసుతో అడిగిందే తడవుగా  అప్పటికప్పుడు ఆర్ధిక సహాయం చేసారు.

గ్రామానికి ఆ కొరత తీరింది.

రామకోటేశ్వరరావు

గ్రామంలో లోగడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లేదు. చాలాకాలం నుండి గ్రామానికి కొరతగా ఉంది.జీర్ణోద్దరణ జరుగుచున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నూతనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపాలయం నిర్మించితే, గ్రామానికి  ఆకొరత తీరిందని హైదరాబాదులో నివసించుచున్న క్రోసూరి రామ కోటేశ్వరరావు మొదటగా తన అభిప్రాయం గ్రామ పెద్దలకు తెలిపారు.అంతేగాదు శ్రీ వెంకటేశ్వరస్వామి అలయం పూర్తి నిర్మాణ బాధ్యతలు తానే వహిస్తాను అని వాగ్దానం చేసారు.ఆ అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు.అయితే ఇక్కడ ఒక సాంకేతిక సమస్య ఎదురైంది.శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధీనంలో ఉంది. ఆలయ నిర్మాణ ఖర్చు ప్రజలు భరించినప్పటికి ప్రభుత్వం నుండి తగిన సాంకేతిక అనుమతి ఉత్తర్వులు పొందవలసి యున్నది. “శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం” ప్రభుత్వ గ్రాంటుతో సంబంధం లేకుండా పూర్తి నిర్మాణం ప్రజల నుండి సేకరించిన విరాళం సొమ్ముతో నిర్మించటానికి అనుమతి ఉత్తర్వులు మంజూరు కోరుచూ  గ్రామస్తులు, ఆలయ ట్రష్టు బోర్డు పాలకవర్గం వారు ప్రభుత్వం వారికి  అర్జీని దాఖలు చేసారు.

క్రోసూరి సుబ్బారావు

అభినయ శ్రీనివాస్

అనుమతి ఉత్తర్వులు హైదరాబాదులో ఉంటున్న క్రోసూరి సుబ్బారావు, అభినయ శ్రీనివాస్, పొనుగుపాటి వెంకట నాగభూషణంల కృషివలన  సకాలంలో అందినవి.

ఆలయ శిల్పి సూరిబాబు

ఆలయ నిర్మాణ బొమ్మకట్టు,మరియు ద్వజస్థంబాల ఏర్పాటు పనులు తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ది పొందిన ప్రముఖ శిల్పి, తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం గ్రామానికి చెందిన సూరి సూరిబాబు ఆధ్వర్యంలో జరిగినవి.

దేవాదాయ, ధర్మాదాయ శాఖ వారు శ్రీ ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయం,శ్రీ సీతా రామ లక్ష్మణ స్వామి ఉపాలయం, జీవ ద్వజస్థంబంలు జీర్ణోద్ధరణకు టెండరులు కోరగా, కన్నెగంటి బుచ్చయ్య చౌదరి కన్స్ట్రక్షన్ కంపెనీ, గుంటూరు వారు రు.23.80. లక్షలతో నిర్మించుటకు దాఖలు చేసిన టెండరును ఆమోదించి నిర్మాణ భాధ్యతను వారికి అప్పగించబడినది.

ఆలయంను దేవాలయం, రాజగోపురం అని కూడా అంటారు. రాజగోపురం నిర్మాణంలో ఆధారాలు, చిత్త వాహనం, ఉప పీఠం, అధిస్ఠానం, స్తంబవర్గం, ప్రస్తరం, గోపురం అను ఏడు నిర్మాణ భాగంలు ఉంటాయి. ఆలయ నిర్మాణ రూపకల్పన చేసేవారిని స్థపతులు అంటారు

పున:నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమం

దేవాలయ అర్చకస్వామి శ్రీనివాస రాజ గోపాలాచార్యులు పర్వేక్షణలో, అనంతాచార్యులు తదితర వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శాంతిపూజ, వాస్తుపూజ శాస్త్ర సమ్మతి ప్రకారం నిర్వహించారు.

తదనంతరం ట్రష్టు బోర్డు చైర్మన్ శ్రీమతి క్రోసూరి పున్నమ్మ, భర్త వెంకట్రావు ఆధ్వర్యంలో స్వస్తిశ్రీ చాంద్రమానేన, ఖరనామ సంవత్సర, పాల్గుణమాసం, బహుళ పాడ్యమి,శుక్రవారం, ఉదయం గం.06.59 ని.లకు ఉత్తరా నక్షత్ర యుక్త మీన లగ్న పుష్కరాంశమందు (ది.09.03.2012) శ్రీ ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంనకు కుడివైపు శ్రీ వెంకటేశ్వరస్వామి ఉపాలయం నూతనంగా నిర్మించుటకు ఎడమ వైపు శ్రీ సీతారామలక్ష్మణ స్వామి ఉపాలయం పున:నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమం జరిగింది.

 ప్రముఖులు ఆగమనం

శంఖుస్థాపన కార్యక్రమంనకు అప్పటి ఆంద్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది, ఉపాధి హామీ శాఖా మాత్యులు డొక్కా మాణిక్య వర ప్రసాదరావు, దేవాదాయ శాఖ ఉప కమీషనర్ గుదిబండ సుబ్బారెడ్డి, సహాయ కమీషనర్ బొంతు పరమేశ్వరరెడ్డి, ఇనస్పెక్టరు సుబ్రమణ్యం, డిప్యూటి ఎక్జిక్యూటివ్ ఇంజనీరు సి.హెచ్. శ్రీనివాసులు, ఆలయ కార్య నిర్వహణాధికారి డి.సి.హెచ్.వెంకటరెడ్డి తదితర అధికారులు, అనధికారులు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేవాలయ నిర్మాణానికి కృషి చేసిన కొంగర జగన్నాధం,యర్రం కోటేశ్వరరావు, దాడి రాధాకృష్ణ, క్రోసూరి బాలరాజు, క్రోసూరి కాంతారావు, క్రోసూరి సుబ్బారావు, అభినయ శ్రీనివాస్, కోయ వెంకట్రావు, గుర్రం రామారాయుడు, గుంటుపల్లి చంద్రమౌళి, ప్రస్తుత ఆలయ చైర్మెన్ గుంటుపల్లి తులసీధరరావు మరి కొంత మంది పెద్దలు ముందుండి శంఖుస్థాపన కార్యక్రమంను నడిపించారు. 

అమెరికా నుండి 1/3 వంతు సి.జి.యఫ్. విరాళం చెల్లించిన సాయిగోపాల్, గ్రామ సర్పంచ్ మాధవరావు, ప్రముఖులు వంకాయలపాటి బలరామకృష్ణయ్య, మాజీ సర్పంచ్ శివరామకృష్ణయ్య, కీ.శే.రామచంద్రయ్య, సాంబశివరావు, సూర్యనారాయణ, కోయ రామారావు, గుర్రం లక్ష్మణరావు, యర్రమాసు బ్రహ్మయ్య మరి కొంత మంది పెద్దలు, తదితరులు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.ట్రష్టు బోర్డు సభ్యులు తెలగతోటి చిన లక్ష్మయ్య, శ్రీమతి మాగులూరి సత్వవతి, మాజీ ట్రష్టు బోర్డు సభ్యులు కట్టమూరి సుబ్బారావు,కనమర్లపూడి జగన్నాధం కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాదు నుండి గుర్రం పెదబాబు, యర్రా నాగేశ్వరరావు, క్రోసూరి రామ కోటేశ్వరరావు, కీ.శే.గుర్రం తిరపతిరావు, మరి కొంత మంది ముఖ్యులు వారి సతీమణులతో శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, ఆలయ పూజారిచే శేష వస్త్రంలతో ఆశ్వీరవచనం పొందారు.

దేవాలయ నిర్మాణం విశేషాలు

ది.09.03.2012న జరిగిన శంఖుస్థాపన కార్యక్రమం ఫొటోగ్యాలరీ.

Play
Slider

 ది.15.11.2012న భక్తులు పీఠంనందు ఇసుక నింపుచున్న ఫొటో గ్యాలరీ.

Play
Slider

ఉప పీఠం నిర్మాణ ప్రారంభ ఫొటో గ్యాలరీ

ఉప పీఠం నిర్మాణంలో భాగంగా మొదటి రాయిని శాస్త్రోక్తంగా పూజించి, ది.08.12.2012న శ్రీ అంజనేయస్వామి ప్రధాన ఆలయంనకు,శ్రీ వేంకటేశ్వరస్వామి ఉపాలయంనకు ది.15.12.2012న, అలాగే శ్రీ సీతారామలక్ష్మణస్వామి ఉపాలయంనకు ది.23.12.2012న న ఉప పీఠం నిర్మాణం ప్రారంభం గావించారు.
 
Play
Slider

దర్వాజలు అమర్చిన కార్యక్రమం  ఫొటోగ్యాలరీ

ధి.13.06.2013న శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దేవాలయ సముదాయనకు దర్వాజలు అమర్చారు. తరువాత ఆలయ నిర్మాణ కట్టుబడి కార్యక్రమం శ్రామికులకు నిర్వహకులు భక్తులుచే నూతన వస్త్రంలు బహుకరించారు.

Play
Slider
 

దేవాలయ నిర్మాణంలో బ్రహ్మకపాలం శిలాఫలకంలు 18.02.2014న భక్తుల కోలాహలంతో ఊరేగింపు చేయబడినవి.మరుసటి రోజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయంలకు అమర్చారు.

బ్రహ్మకపాలం శిలాఫలకంలు ఊరేగింపు,అమర్చిన  ఫొటో గ్యాలరీ.

Play
Slider

ప్రస్తరం, గోపురం నిర్మాణ కార్యక్రమాల ఫొటోగ్యాలరీ.(26.03.2015)

Play
Slider

జీవ ధ్వజస్తంబముల మూలాలు గ్రామానికి చేరిక

దేవాలయ సముదాయం జీవ ధ్వజస్తంబముల మూలాలు తూర్పు గోదావరి జిల్లా, రంపచోడవరం మండలం, మారేడుమల్లి అటవీ ప్రాంతం నుండి సేకరించబడినవి.

 

Slider

దేవాలయం సుమారు రెండు కోట్ల వ్యయంతో దాదాపుగా అన్ని హంగులతో ఆగమశాస్త్ర ప్రకారం పున:నిర్మించబడింది. జీర్ణోద్దరణ దేవాలయంలకు అవసరమైన మూల విగ్రహాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పొందబడినవి.

గమనిక:త్వరలో జీర్ణోద్ధరణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వివరాల మీ ముందుకు తీసుకురాగలమని తెలియజేస్తున్నాం.

Tagged with: , , , , ,

వినుకొండ అంకమ్మ తల్లి కొలుపులు.

మన పొనుగుపాడు గ్రామంలో వేంచేసియున్న వినుకొండ అంకమ్మ తల్లి కొలుపులు శుక్రవారం (26.05.2017) నుండి ప్రారంభించబడినవి.

కార్యక్రమ వివరాలు

1.ది.20.05.2017 ఉదయం.శుక్రవారం అమ్మ (అంకమ్మ తల్లి) వారికి పాలతో అభిషేకం నిర్వహించి,పొంగళ్లు నైవేధ్యం గావించారు. సాయంత్రం మార్కాపురం శ్రీను బృందం వారిచే అయప్ప స్వామి భజన కార్యక్రమం జరిగింది. 

2.ది.27.05.2017 శనివారం అమ్మవారి జాతర, ఊరేగింపు,మాతంగి జానపద నృత్యం, విన్యాసాలు ఆడంబరంగా నిర్వహించబడినవి.

3.ది.28.05.2017 ఆదివారం అన్న ప్రసాద  వితరణ కార్యక్రమం  భారీఎత్తున నిర్వహించారు.

వేడుకుల ప్రారంభ ఫొటోలు

Tagged with: , , ,

కొలుపులు అంటే ఏమిటి?

కొలుపులు అంటే ఏమిటి?

గ్రామ దేవతలుకు జరిపే ప్రత్యేక ఉత్సవంను కొలుపులు అంటారు. ఈ కొలుపులును ఊర పండగ అని కూడా అంటారు. కొన్ని చోట్ల ఉత్సవం జరిగే దేవత పేరుతో జాతర అని కూడ అంటుంటారు. ఉదా:-అంకమ్మ జాతర, పోలేరమ్మ జాతర మొదలగునవి. అన్ని గ్రామ దేవతల పండుగలు ఏ పేరుతో జరిగినా సూత్రధారిగా పోతురాజు ప్రాధాన్యం వహిస్తాడు.ఈ ఉత్సవాలలో పోతురాజుది కీలక పాత్ర.

గ్రామాన్ని గ్రామ దేవతలు రక్షిస్తే, గ్రామ దేవతలను సోదరుడుగా పోతురాజు రక్షింస్తాడని సాంప్రదాయవాదులు అంటారు. కొంత మంది పరిశోధకులు  ఒకప్పుడు గ్రామ దేవతల భర్తగాను, వారి సేవకుని గానూ వర్ణించబడ్డాడని అభిప్రాయం.

పూర్వం కలరా, మసూచి, ఆటలమ్మ అను వ్యాధులు త్రీవ స్థాయిలో విజృంబించి జన నష్టం భారీగా ఉండేది. అలాగే వర్షాలు పడకుండా త్రీవ అనావృష్ఠి ఏర్పడి, తినటానికి తిండిలేక ఇబ్బందులు పడేవారు.అలాంటి సమయంలో అమ్మ వారికి కోపం వచ్చింది, అందువలనే  ఈ వ్యాధులు, కష్టాలు మనకు దాపురించాయి అనే నమ్మకం ప్రజలలో బలంగా ఉండేది. ఈ రోగాలు, మహమ్మారిల నుంచి, కరువు కాటకాల నుంచి రక్షించమని కోరుతూ, ఇలాంటివి ఏమి లేకపోతే రాకుండా కాపాడమని  గ్రామదేవతకు ఊర పండుగ అని చేస్తారు.ఈ ఉత్సవాలు జరపక పోతే అమ్మ వారికి కోపం వస్తుందని ప్రజల నమ్మకం. ఆ జాతరలో జంతువులను,మేకలు, పొట్టేళ్లు, కోళ్లను బలిఇచ్చి, పొంగళ్లు చేసి అమ్మ వారికి నైవేధ్యంగా సమర్సిస్తారు.ఈ జాతర కొన్ని చోట్ల మూడు రోజులు, కొన్ని చోట్ల ఐదు రోజులు నిర్వహిస్తారు. ఇలా  గ్రామ దేవతలకు జరిగే ఊరపండగ, జాతరలను కొలుపులు అంటారు. 

కొలుపులు ప్రారంభానికి ముందు గ్రామ పెద్ద కాపు ఇంటి వద్ద నుండి మేళతాళాలతో పూజా సామాగ్రితో వచ్చి, దేవాలయంలో తొలుత పెద్ద కాపు పూజల అనంతరం కొలుపులు ప్రారంభించటం ఆనవాయితి.

గ్రామ  దేవతలు అంటే ఎవరు?

పూర్వం  మన పూర్వీకులు గ్రామ ప్రజలను చల్లాగా చూస్తూ,అంటు వ్యాధుల నుండి కాపాడుతూ, భూత ప్రేతాలనుండి రక్షిస్తూ, పాడి పంటలు సవ్యంగా ఉండేలా చేస్తూ, గ్రామ సరిహద్దులను కాపాడే దేవతలు అనే నమ్మకంతో పుట్ట, భావి కలిగియున్న వేపచెట్టు సమీపంలో గ్రామానికి నాలుగు వైపుల పొలిమేరలలో మరియు అప్పటి గ్రామం మధ్యలో ఎటువంటి ఆలయాలు లేకుండా శిలా విగ్రహాలను ప్రతిష్ఠించారు. పంచభూతాలు గాలి, నీరు, సూర్యుడు, భూమి, ఆకాశం కారణంగానే ఈ ప్రపంచం ఏర్పడింది. అందుకనే పంచభూతాలుకు ప్రతీకలుగా ఐదు ప్రదేశంలనందు గ్రామ దేవతలను ఏర్పాటుచేసారు.

గ్రామ ప్రజలను సదా కాపాడు చున్నందున వీటికి గ్రామ దేవతలని పిలుస్తున్నారు. పెండ్లిండ్లకు ముందుగా గ్రామ దేవతను ఆరాధించటం హిందువుల ఆచారం. లోగడ మసూచి, ఆటలమ్మ వ్యాధులు సోకినప్పడు తగ్గితే  అమ్మవారికి (పోలేరమ్మ) కు “చద్ది” పెట్టే అచారం మన గ్రామాలలో ఇప్పటికి ఉంది.పాడి పంట బాగుండాలని గ్రామ దేవతలను పూజించే విధానం మనకు తరతరాలుగా వస్తున్న గ్రామీణ సంప్రదాయం. గ్రామ దేవతలు వివిధ స్త్రీ దేవతా రూపాలలో వివిధ పేర్లుతో కలిగియున్నశక్తి స్వరూపిణిగా మన అందరం భావిస్తాం. 

గ్రామ దేవతలను ప్రతిష్ఠించంటంలో  పూర్వీకుల మరొక ముఖ్య ఉద్దేశ్యం. దేవి నవరాత్రులు అలాంటి పండగలుకు వేరే ప్రాంతాలలో ఉన్న  కంచి కామాక్షమ్మ, మదుర మీనాక్షమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ వద్దకు వెళ్లాలంటే కుదరకపోవచ్చు. అందరం అన్ని చోట్లకు వెళ్లలేరు. కుదిరినప్పడు డబ్బు ఉండక పోవచ్చు. ఢబ్బు ఉన్నప్పడు అందరికి కుదరక పోవచ్చు. ఇలాంటి సమయాలలో  అమ్మ వారిని దర్సించే భాగ్యం మనకు కలగలేదే అనే అసంతృప్తి పడకుండా, ఎక్కడో ఉన్న అమ్మ వారిని ఇక్కడే దర్సించు కున్నామనే భావన వారి మనసులో కలిగేందుకు ముందు చూపుతో మన పూర్వీకులు గ్రామ దేవతల వ్వవస్థను నెలకొల్పారు.

పంచ భూతాలుకు ప్రతీకలు గ్రామ దేవతలు.

ఆ గ్రామ దేవతలకు భూదేవత, అగ్నిదేవత, జలదేవత, వాయు దేవత, ఆకాశ దేవత అని పేర్లు పెట్టారు.

పుడమి దేవత: పుడమి అంటే భూమి. భూమి లేనిదే పంట లేదు.ఆయా ప్రాంతంలో పండే పంటలను పుడమి దేవతను భూమిలో పండే పంట పేర్లతో జొన్నలు పండే చోట జొన్నలమ్మ, నూకలు అంటే వరి ధాన్యం పండే చోట నూకాలమ్మ అని పిలుస్తున్నారు.అలాగే గోగు పంట పండే చోట గోగులమ్మ అని వివధ రకాలుగా పేర్లు పెట్టారు.

అగ్ని దేవత: అగ్ని వెలుగుకు ప్రతీతి.మనకు సూర్య చంద్రులు వెలుగు నిస్తారు. పగటి పూట వెలుగు నిచ్చే సూర్యుడుని సూరమ్మ తల్లిని, రాత్రి తేజస్సు నిచ్చే చంద్రుడుని పున్నమ్మ తల్లిని, ఇక అమ్మ వారికి సూర్యుడు కుడి కన్నుగా, చంద్రుడు ఎడమ కన్నుగా భావించి (ఇరుకళ్లు అంటే రెండు కళ్లు) ఇరుకలమ్మగా పిలుస్తున్నారు.

జల దేవత: జలం అంటే నీరు అని మనందరకు తెలుసు. ఈ తల్లిని గంగమ్మ, గంగానమ్మ అని పిలుస్తున్నారు.గంగకు మూలస్థానం పాతాళం. మనం ఎక్కడైనా గమనించండి.గంగమ్మ తల్లి ఆలయాలు ఎంత ఎత్తులో కట్టినప్పటికి దేవతను చూచాలంటే మెట్లు దిగి క్రిందికి వెళ్లి దర్శనం చేసుకోవాలి.

వాయు దేవత: వాయువు ఉగ్రరూపం ధరించినప్పడు గాలికి చెట్టూ చేమా అతాలాకుతలమైతాయి. ఈ గాలిని కర్వలి/కరువలి అని అంటారు.అలాంటి ఉపద్రవాల నుండి కాపాడటానికి కురువలమ్మ దేవతగా పిలుస్తున్నారు.

ఆకాశ దేవత:ఆకాశం ఎత్తుగా ఉన్నందున కొండని ఆకాశ దేవతకు ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, గాలివాన, మెరుపులు బారి నుండి రక్షించటానికి ఈ దేవతను ఏర్పాటు చేసుకున్నారు. అందుకని ఈ దేవతని కొండమ్మ తల్లిగా పిలుస్తున్నారు.

ఈ రకంగా వివిధ ప్రాంతాలలో గ్రామ దేవతలకు నూట ఒక్క పేర్లుతో ఆరాధిస్తున్నట్లుగా తెలుస్తుంది.

పోతురాజు ఈ వృత్తిలోకి ఎలా వచ్చాడు?

ఈ కొలుపులుకు బ్రాహ్మణ పూజారి ఉనికి ఉండదు. పూర్వాచారాలను బట్టి  ఈ ఉత్సవాలకు అధికారికమైన పూజారి పొతురాజు. గ్రామాలలో చిన్నతనం నుండి మనం చూస్తుంటాం. గ్రామ దేవతలను కుమ్మరి, యాదవ, మరి కొన్ని చోట్ల దళిత వర్గాలకు చెందినవారు మాత్రమే పూజా కార్యక్రమం చేస్తుంటారు.అలా పూజించే కుటుంబాల వంశీకులను వంశపారంపర్యంగా వారిని పోతురాజులు గా పరిగణించారు. ఈ పోతురాజును గ్రామదేవతలకు సోదరుడుగా భావించి పోతురాజు విగ్రహాలను పూజించడం, గౌరవించడం ఆచారంగా ఉంది. నూతనంగా వివాహమైన ఆడపడుచులకు అట్ల తద్దె తీర్చే రోజు పోతురాజు పాత్ర ఉంది.

పోతురాజు ఆహార్యం

వంశ పారంపర్య  పోతురాజుగా వ్యవహరించే వ్యక్తికి పుట్టు వెంట్రుకలు తియ్యరు. పుట్టిన అప్పుడు ఉన్న వెంట్రుకలే జీవింతాంతం ఉంటాయి. క్షురకర్మకు తావులేదు. కొందరు జుట్టును ముడివేసుకుంటారు. కొందరి జుట్టు జడలు కడుతుంది.  ఉత్సవాల సమయంలో కాళ్ళకు కడియాలు, చేతిలో కొరడా, నడుం చుట్టూ చిన్న గంటలు, మణికట్టుకు కడియం, కాళ్ళకు గజ్జెలు ఉంటాయి. చొక్కా ధరించడు. పసుపు, కుంకుమ ముఖానికి, మిగిలిన దేహ భాగాలకు రాసుకుంటారు. కళ్ళకు కాటుక, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. వేపాకు రెమ్మలు వంటి నిండా ధరిస్తాడు. పోతురాజు ఆహార్యం చూడగానే చిన్న పిల్లలు భయపడతారు.

గ్రామంలో కొలుపులు, ఊరేగింపుల సందర్భంలో పోతురాజు వేషంలో ఉండే వ్యక్తి ముందుండి దేవత ఊరేగింపుకు దిశానిర్ధేశం చేస్తాడు. ప్రజలను మార్గానికి అడ్డు రాకుండా అదుపు చేస్తాడు. తాను బలిచ్చిన జంతువు పేగులను మెడలో వేసుకుంటాడు. మాంసం ముక్కలను నోట్లో పెట్టుకుంటాడు. పేడ తట్టను తలపై పెట్టుకుని మోస్తాడు.వీర తాడుతో తనను తాను కొట్టుకుంటూ ఉగ్ర రూపంతో చిందులు తొక్కుతుంటాడు. 

పోతురాజు నిర్వహించే కీలక ఘట్టం

కొలుపులు ఉత్సవంలో ముఖ్య విధి పోతురాజు గావుపట్టడం. అంటే అమ్మవారికి జంతుబలి ఇవ్వడం. సాధారణంగా బలివ్వడమంటే కత్తితో జంతువు మెడను కోసి దేవతకు అర్పించడాన్ని బలి అంటారు. కొలుపుల లో పోతురాజు ఇచ్చే బలి నోటితో జంతువు మెడను కొరికి చంపడం. దీనినే గావు పట్టడం అంటారు. అయితే ఇక్కడ దున్నపోతు తలను మాత్రం ఒక్క కత్తి వేటుతో మొండెం నుంచి వేరుచేసి బలిస్తారు. మేక, లేక గొర్రె అయితే పోతురాజుకు గావు పట్టడం కష్టమైన వ్యవహారమే.కోడినైతే ఒకే ఒక్క గాటుతో మెండెం నుంచి తలను వేరు చేస్తారు.దాదాపుగా వేడుకగా పూర్వాచార ప్రకారం నోటితో గావు పడతారు తప్ప పూర్తిగా బలి ఇచ్చుట లేదు.

ఇదే సమయంలో అక్కడ భీతావహ పరిస్థితి కనిపిస్తుంది. డోలు, తప్పెట్ల మోతలతో ఆ ప్రదేశం మారుమోగిపోతుంది. ఒకపక్క బలిస్తున్న మేక అరుపులు దయనీయంగా ఉంటాయి.పోతురాజులను ఉత్సాహపరచ డానికి అక్కడ చేరిన భక్తుల కోరితలు చప్పట్లుతో మారుమ్రోగతాయి. ఎటువంటి వారికైనా గావు ప్రక్రియ కొత్తవారి ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తుంది.ఆ వాతావరణం పోతురాజును గావు పట్టే ఉన్మాద స్థితికి తీసుకు వెళ్లింది. కొలుపులలో  జంతుబలిని పోతురాజు ద్వారానే ఇవ్యడం పూర్వం నుండి వస్తున్న ఆచారం.      

సర్వమానవ సౌభ్రాతృత్వం.

గ్రామ దేవతలు అన్ని వర్గాల ప్రజల సంస్కృతి పరిరక్షకులు.మధ్యం  తాగిన మత్తులో కష్టాలు అన్నీ మరచి చిందులు వేసే భక్తులకు కులాలు గుర్తురావు.అంటరానితనం ఉండదు.ఏది ఏమైనా ధనికా పేదా, చిన్నా పెద్దా, తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా జరుగుతాయి.సర్వమానవ సమానత్వం ఈ జాతరల్లో కనపడతుంది. అదే కొలుపులు, జాతర, ఊరపండగ  గొప్పతనం.సమాజంలోని బడుగు కులాలవారు కూడా అగ్రకులాలతో పాటు సమానంగా సామాన్య, సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా మమేకం కావటం ఈ గ్రామదేవతల జాతరలలోనే కనపడుతుంది.వేరే ఉత్సవాలలో కనపడదు.

Tagged with: , , ,

దేవాలయంలు సందర్శించిన డాక్టరు కోడెల.

విశేషాలు

మన గ్రామంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా నేను ఉన్నానూ అంటూ, ప్రతి కార్యకమానికి విచ్చేసే, మన గ్రామ ప్రజలకు అంత్యంత ఆప్తుడు, మన రాష్ట్ర శాసన సభాపతి డాక్టరు కోడెల శివప్రసాదరావు గారు అనివార్య కారణంల వలన దేవాలయాల ప్రతిష్ట మహోత్సవంలకు రాలేక పోయిన సంగతి మనందరుకు తెలుసు.

 ఆ రోజు అభిమానులు పడిన నిరుత్సాహం తొలగించుటకు ది.23.05.2017న జరిగిన స్వామివారల పదహారు రోజుల పండగ మహోత్సం సందర్బంగా జరిగిన కార్యక్రమంనకు డాక్టరు కోడెల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్దకు గ్రామ టి.డి.పి.అధ్యక్షులు రత్తయ్య, దేవాలయాల ట్రష్టు బోర్డు చైర్మెన్లు తులసీధరరావు, కామినేని రామారావు, పాపారావులు, మెట్రో వార్త డైలీ ఎడిటర్ క్రోసూరి సుబ్బారావు, అభినయ శ్రీనివాస్, టి.డి.పి.యువ నాయకులు ఆలోకం శ్రీనివాసరావు, యర్రమాసు శ్రీనివాసరావు, కోమటినేని వీరయ్య, యర్రమాసు నాగేశ్వరరావు గ్రామ పెద్దలు, తదితరులు ఎదురేగి మేళతాళాలుతో, బాణాసంచా పేలుస్తూ, యువత బైకు ర్యాలితో స్వాగతం పలికి ఊరేగింపుగా తోడ్కొని వచ్చారు.

ఫొటో గ్యాలరీ

Slider

ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు, పురోహితులు పూర్ణకుంభంతో సభాపతి డాక్టరు కోడెలకు స్వాగతం పలికారు. దేవాలయాలలో స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.అర్చక బృందం డాక్టరు కోడెలకు స్వామి వారి ప్రసాదాన్ని అందించి ఆశీర్వదించి సత్కరించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పొనుగుపాడు దేవాలయాల సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అదికారులు, అనధికారులు డాక్టరు కోడెలను ఘనంగా సత్కరించారు.

అనంతరం డాక్టరు కోడెల మాట్లాడుతూ ఈ గ్రామ ప్రజలుతో నాకు నలబై సంవత్సరంల నుండి మంచి అనుబంధం ఉందని చెప్పారు.ఈ గ్రామంలో ఉన్న ఆధ్యాత్మిక స్పూర్తితోనే ఆయన కోటప్పకొండను అభివృద్ధి చేసానని చెప్పారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో  బలరామకృష్ణయ్య లాంటి మహానుభావులు, ఆలయ కమిటీ చైర్మెన్ తులసీధరరావు, పాలకవర్గ సభ్యులు,  ఉన్నత చదువులు చదివి నేడు దేశ, విదేశాలలో ఉన్న డాక్టర్లు, యన్.ఆర్.ఐ.లు, ఇంజనీర్లు, అనేక మంది పెద్ధలు, యువత ప్రతి అభివృద్దిలో మేము ఉన్నామంటూ ఈ గ్రామస్తులుగా ఉండటం వలనే అపూర్వమైన ఆలయాలు నిర్మించి, గ్రామాన్ని ఒక అధ్యాత్మిక గ్రామంగా తీర్చిదిద్దారని అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవరావు, యం.పి.టి.సి.సభ్యులు అమరయ్య, వంకాయలపాటి బలరామకృష్ణయ్య, బొల్లేపల్లి సత్యనారాయణ, క్రోసూరి రామ కోటేశ్వరరావు, శ్రీ ఆంజనేయస్వామి మాజీ ట్రష్ఠు బోర్డు చైర్మెన్లు కొంగర జగన్నాధం,దాడి రాధాకృష్ణ,క్రోసూరి వెంకటరావు, యామాని రామారావు,యర్రమాసు బ్రహ్మయ్య, గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్‌  జె.పార్దసారధి, శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ఇ.ఓ. వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tagged with: , ,
powered by rekommend.io