పున:నిర్మాణ కార్యక్రమం ఆలయ ట్రష్టుబోర్డు చైర్మెన్ గా క్రోసూరి వెంకట్రావు పనిచేసే కాలంలో (2008 సం.ము) దేవాలయం పూర్తిగా శిధిలమై పడిపోయే స్థితికి చేరువైనది. దేవాలయం జీర్ణోద్దరణ గావించవలసిన సమయం ఆసన్నమైనదని గ్రామ పెద్దలు గ్రహించారు. దేవాలయం పున:నిర్మించాలనే సంకల్పం గ్రామస్థుల అందరి మనసులో అభిప్రాయం కలిగింది. ఆ అభిప్రాయం ఆచరణలో పెట్టుటకు కొంగర జగన్నాధం, యర్రం కోటేశ్వరరావు, దాడి రాధాకృష్ణ, గుర్రం రామారాయుడు, క్రోసూరి బుచ్చయ్య, కోయ వెంకట్రావు, క్రోసూరి బాలరాజు, ఆలయ అర్చక…