ఈ బాల నటుడు మన పొనుగుపాటి వంశీయుల బిడ్డే.

[vc_row][vc_column][vc_column_text]

సుమారు నూట యాభై సంవంత్సరంల క్రిందట పొనుగుపాటి వంశీయులలో ఈ దిగువ వంశ వృక్షంలో చూపబడిన  గోపరాజు  ముది మనవడు వేంకటరమణయ్య మన పొనుగుపాడు గ్రామం నుండి వలస వెళ్లారు.

చరిత్ర తెలుసుకొనుటలో భాగంగా వీరి వివరాలు సేకరించటమైనది. మన గ్రామం నుండి వలస వెళ్లిన వేంకటరమణయ్య ముది మనవడు ప్రసాదరావు ప్రస్తుతం హైదరాబాదులోని నాగోలులో ఉంటున్నారు. www.manaponugupadu.com ద్వారా పొనుగుపాటి వంశీయుల చరిత్రను ది.25.11.2014న ప్రచురించుట జరిగింది.ప్రసాదరావు సోషల్ మీడియా ద్వారా ఫోష్టును చదివి ఆ వెనువెంటనే సంతోషంతో కామెంటు ద్వారా తన పూర్వీకులు పొనుగుపాడు నుండి వలస వెళ్లినట్లుగా తెలిపారు.

ది.22.02.2016న ప్రసాదరావు పంపిన సందేశం.

“శుభోదయం”. మన పొనుగుపాడు వెబ్ సైట్ నిర్వహిస్తున్న శ్రీ యర్రా రామారావు గారికి, పొనుగుపాడు గ్రామ ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను . దీని ద్వారా చాలా విలువైన సమాచారం తెలుసుకుంటున్నాము.

125 సంవత్సరాల క్రితం పొనుగుపాడు నుండి మా ముత్తాత గారు శ్రీ పొనుగుపాటి వెంకట రమణయ్య గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామవరపు కోట మండలం, చింతలపూడి తాలుకాలో ఉన్న “కళ్ళచెరువు” గ్రామంనకు వలస వెళ్ళటం జరిగింది.మాతాత గారు పొనుగుపాటి కోటేశ్వరరావు గారు అక్కడే టీచర్ గా పనిచేసే వారు.

ప్రసాదరావు గారి తండ్రి ప్రకాశరావు

మా తండ్రి గారు పొనుగుపాటి ప్రకాశ రావు చాలకాలం ఏలూరు అగ్రికల్చర్ డిపార్టుమెంటు లో పనిచేశారు. శ్రీ యర్రా రామారావు గారు చేస్తున్న కృషి అమోఘం . మా ఏడు తరాల చరిత్రను సుమారు రెండు శతాబ్దాల వంశ వృక్షం మాకు పంపడం జరిగింది (మొదటి తరం పాపరాజు గారి నుండి).

ప్రసాదరావు గారి తల్లి సీతాదేవి

ముందు మా తాతయ్య గారి పేరు వెంకయ్యగా వారి తాతగారి పేరు పెట్టారు.కానీ మా ముత్తాత వేంకటరమణయ్య  గారు కోటప్ప కొండకు వెళ్ళినప్పుడు మగ పిల్లాడు పుడితే నీ (కోటయ్య) పేరు పెట్టుకొంటానని మొక్కుకున్నారట . అయితే అది మరచి వెంకయ్య అని పేరు పెట్టారట. పేరు పెట్టిన కొద్ది మాసంలకు మా తాత గారికి  తీవ్ర అనారోగ్యం వచ్చింది.

అప్పుడు మా ముత్తాత వెేంకటరమణయ్య గారికి కోటప్ప కొండ మొక్కు గుర్తుకు వచ్చి పుట్టిన ఒక సంవత్సరానికి మా తాత వెంకయ్య గారి  పేరును మార్చి కోటేశ్వరరావుగా తిరిగి నామకరణం చేసారట.మా ముత్తాత గారి చెల్లెలు విశాలాక్ష్మమ్మ గారిని కళ్ళచెరువు కరణం గారికి ఇచ్చి పెళ్లి చేసారు.

తరువాత అక్కడి వెలమ దొరలు “కళ్ళచెరువు” లో చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు,మీరు వచ్చి ఇక్కడ ఈ గ్రామ ప్రజలకు విద్యాబుద్దులు నేర్పించండి అని కొరారు.1892 ప్రాంతం లో కరువు కారణం గాను, ఆర్ధిక పరమైన ఇబ్బందుల వలన, అక్కడ వారు కొంత స్థలం, పొలం దానంగా ఇవ్వటం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు దగ్గర చింతల పూడి తాలూకా, కళ్ళచెరువు గ్రామానికి వలస వెళ్లారు” అని తెలిపారు.

పొనుగుపాడు సందర్శించిన ప్రసాదరావు కుటుంబం

ప్రసాదరావు కుటుంబం

మన పొనుగుపాడు గ్రామంలో మార్చి 2016లో జరిగిన శ్రీగంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శతజయంతి మహోత్సవంనకు ప్రసాదరావును ఆహ్వానించుట జరిగింది.జన్మభూమి మీద అభిమానం తో  భార్య చాయాదేవి, కుమార్డు పవన్ శ్రీరామ్,(బాల/మాష్టరు నటుడు) కుమార్తె తనిష్క కుంభాభిషేక మహోత్సవంనకు వచ్చారు.

కుంభాభిషేక మహోత్సవం సందర్బంగా ఆలయంలో జరిగిన స్వామివారి శాంతి కళ్యాణంలో పాల్గొన్నారు. ఆలయ పాలక వర్గంవారు వీరికి నూతన వస్త్రం లు బహుకరించి సత్కరించారు. అభిమానంతో శివాలయం నుండి వారి పూర్వీకులు కట్టించిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు నడిచి వెళ్లారు.

జీర్ణోద్దరణ జరుగుచున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం సందర్శించారు.గ్రామస్తుల అందరిని ఆప్యాయతతో పలకరించారు.గ్రామస్థులు కూడా వారిని ఇంతకాలంనకు మీరు ఇక్కడకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వారి అభిమానాన్ని వ్యక్తపరిచారు.

శివాలయం బ్రహ్మోత్సవంలకు  వచ్చిన సందర్బంగా.

[smartslider3 slider=29]

27.03.2016న గ్రామ ప్రజలకు పంపిన సందేశం.

పొనుగుపాడు గ్రామ ప్రజలకు, ఊరి పెద్దలకు నమస్సుమాంజలి. 

మన గ్రామం లో జరిగిన శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100 సంవత్సరాల వేడుకలలో నేను , నా కుటుంబ సభ్యులు పాల్గొనటం మా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాను .

నా రక్త సంబందీకులు ఈ గ్రామానికి సంబందించిన వారని , వారి ద్వారా ఈ గ్రామానికి మంచి పేరు వచ్చిందని , అంతే కాక మా పూర్వీకులు పొనుగుపాడు గ్రామ గడ్డను ఎత్తిన వంశీయుల వారసులంగా మేము పొనుగుపాడుకు రావటం ఎంతో ఆనందకర విషయం. మా పూర్వీకులు శ్రీఅంజనేయస్వామి దేవాలయం నిర్మించినట్లుగా మా చిన్నతనంలో చెప్పేవారు.

మా ముత్తాత గారు ఇక్కడ 1892-1893 వ సంవత్సరం” (నందన నామ సంవత్సరం) పొనుగుపాడు గ్రామం చుట్టుపక్కల కరువు తాండవించినందున ఆ సందర్భంలో మా ముత్తాత గారు అక్కడ నుండి పశ్చిమ గోదావరి జిల్లా , ఏలూరు కు సమీపం లోని చింతలపూడి తాలూకా , కామవరపుకోట మండలం ” కళ్ళచెరువు” గ్రామానికి వలస వెళ్ళినట్లు సమాచారం ఉంది.

1960-70 దశకం లో మా నాన్న గారు పత్రికలలో పొనుగుపాడులో నిర్మించిన హైస్కూల్ గురించి తెలుసుకొని పొనుగుపాడు గ్రామానికి వచ్చినట్లు తెలిసింది .ఆ సమయంలో గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగ రీత్యా లామ్ ఫార్మ్ లో పనిచేసేవారు. అక్కడ పనిచేసేటప్పుడు 1968 వ సంవత్సరంలో నేను (పొనుగుపాటి ప్రసాద రావు ) గుంటూరులో జన్మించాను.ఇంకాసమాచారాన్ని సేకరిస్తున్నాను.నాకు తెలిసిన సమాచారాన్ని మీతో ఎప్పటి కప్పుడు పంచుకుంటాను. దన్యవాదములు

” జనని జన్మ భూమిశ్చ స్వర్గా దపి గరీయసి.”. మీ పొనుగుపాటి ప్రసాదరావు.

ప్రసాదరావు కుమార్డు పవన్ శ్రీరామ్ ప్రొఫైల్: 

శ్రీరామరాజ్యంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో.

పవన్ శ్రీరామ్ జననం ది.18.01.200. సినిమాలలో నటిస్తూనే ఈ సంవత్సరం జరిగిన సీనియర్ ఇంటర్ నందు 960/1000 మార్కులు సాధించాడు. పవన్ శ్రీరామ్ బాలనటుడు మరియు మోడల్ మాస్టర్.దాదాపు ముప్పై తెలుగు సినిమాలలో, ఆరు TV సీరియల్స్ నందు నటించాడు. “హరేరామ్ చిత్రం” లో మొదటగా ఆరంగేట్రం. హీరో కళ్యాణ్ రామ్ కు చైల్డ్ హీరో డ్యూయల్ పాత్రగా నటించాడు.

బాలకృష్ణ గారితో

ప్రముఖ హీరోలు బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు, శ్రీరామరాజ్యం, మిత్రుడు, పాండు రంగడు, వెంకటేష్ హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రాలలో నటించాడు.

అలాగే శ్రీకాంత్ నటించిన నగరం, అఆఇఈ, నాగార్జున నటించిన కింగ్, రవితేజ నటించిన బలాదూర్, హీరో నితిన్ నటించిన టక్కరి చిత్రాలలో నటించాడు.

S V B C చానల్ వారి శ్రీ వేంకటేశ్వర వైభవంలో వామనుడుగా

హీరోయిన్ అనుష్క నటించిన అరుంధతి, హీరో గోపి చంద్ నటించిన శౌర్యం, శంఖం, హీరో నరేష్ నటించిన సీమశాస్త్రి, హీరో జగపతి బాబు నటించిన గాయం-2 అలాగే బాపు దర్శకత్వం వహించిన సుందరకాండ, కె.వాసు దర్శకత్వం వహించిన గజిబిజి చిత్రాలలో నటించాడు. E T V  సీరియల్ “మనసు చూడతరమా”లో నటించాడు. S V B C చానల్ వారి బాపు దర్శకత్వం వహించిన “శ్రీ వెంకటేశ్వర వైభవంలో వామన మరియు శ్రీకృష్ణ పాత్రలలో నటించాడు. ఇంకా మరి కొన్ని TV చానల్ సీరియల్స్ నందు నటించాడు.

పవన్ శ్రీరామ్ మరి కొన్ని ఫొటోలు

[/vc_column_text][vc_media_grid grid_id=”vc_gid:1501081436440-60ca82af-e3b2-0″ include=”12887,12909,12910,12888,12908,12919,12922,12899,12900,12905,12893,12904″]

పవన్ శ్రీరామ్ నటించిన శ్రీరామరాజ్యంలో ఒక పాట

[vc_video link=”https://www.youtube.com/watch?v=wVoyPPrZpXM” align=”center”][/vc_column][/vc_row][vc_row][vc_column][vc_column_text] [/vc_column_text][/vc_column][/vc_row]

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *