కాలువలో శవంలా తేలియాడే కోటిరెడ్డి

శవంలా తేలియాడే కోటిరెడ్డి

పల్నాడు జిల్లా, ఈపూరు మండలం, ఊడిజర్ల గ్రామానికి చెందిన యర్రం కోటిరెడ్డి వయస్సు సుమారు 75 సంవత్సరాల పైనే.  వృత్తి వ్యవసాయం. ఇతనికి ఈత అంటే  చాలా మక్కువ.  చిన్నతనంలోనే, రొంపిచర్ల మండలం లోని బుచ్చిపాపన్నపల్లె గ్రామంలో పమ్మి ముసలారెడ్డి అను గురువు వద్ద ఈ విద్య నేర్చుకున్నాడు. ఇప్పటికీ ఖాళీ దొరికినప్పుడలా ప్రక్కనే ఉన్న నాగార్జున సాగరు కాలువలో ఈతకు వెళుతుంటాడు. ఇతను అందరిలాగా కాకుండా వైవిధ్యంగా ఈదుతాడు. ఆ వయస్సులో అతను వంతెనపై నుండి కాలువలోకి పల్టీలు కొట్టి ఈతను ప్రారంబిస్తాడు. వెల్లకిలా నీళ్ళపై పడుకుని కాళ్ళు, చేతులా ఆడించకుండా ఈదుతూ నీళ్ళపై ఎంతసేపైనా నీటితోపాటు తెలియాడుతూ ప్రయాణిస్తాడు.. అనుకోకుండా అలా వెళుతున్న ఇతనిని చూసినవారు కాలువులో ఎదో శవం వెళుతుందని అనుకుంటారు.

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …