జననం,కుటుంబ సభ్యులు,విద్య.
శేషగిరిరావు పొనుగుపాడు గ్రామంలో 12.03.1938న జన్మించారు.తల్లిదండ్రులు మస్తానురావు చౌదరి, నారాయణమ్మ.తాత శేషయ్య, నాయనమ్మ ఆదెమ్మ. కోటయ్య (ముత్తాత) పేరమ్మ (తాతమ్మ).శేషయ్య, రమణమ్మ. (ముత్తాత తల్లి దండ్రులు). పూర్వీకుల వృత్తి వ్యవసాయం.
పెద్ద సోదరి కమలారత్నం, చిన్నసోదరి అనంతాదేవి. చిన్న సోదరులు డాక్టరు పాండురంగారావు, ప్రభాకరరావు.ప్రాధమిక ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు పొనుగుపాడు హిందూ ప్రాధమిక పాఠశాలలో చదివారు. (1943-1953).ఎనిమిదవ తరగతి నుండి పదకొండువ తరగతి వరకు ఫిరంగిపురం, పొనుగుపాడుల నందు చదివారు.వీరు పొనుగుపాడు జిల్లా పరిషత్ హైస్కూలులో యస్.యస్.యల్.సి. మొదటి సంవత్సరం బ్యాచ్ స్కూలు పష్ట్ సాధించారు. (1950-1954).అటు తర్వాత నరసరావుపేట శ్రీ సుబ్బరాయ, నారాయణ కళాశాలలో ఇంటర్ మీడియట్ చదివారు. (1954-1956).
వివాహం,ఉద్యోగ ఆరంగేట్రం
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన తేళ్ళ నాయుడమ్మ, శ్యామలమ్మ దంపతుల కుమార్తె ఇందిరాదేవిని 21.06.1957న వివాహమాడారు.అటు పిమ్మట ఆంధ్ర యూనివర్శటి వాల్తేరులో యం.ఎ. కోర్సు చేసి, యం.యస్.సి చేసారు. (1956-1961).
మొదటగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నాగపూర్, డొంగర్గడ్, హేర్గడ్ మరి కొన్ని ప్రాంతాలలోని ప్రభుత్వ కళాశాలలో మ్యాథ్స్ ప్రొఫెసరుగా 1961 లో చేరి 1968 వరకు పని చేసారు.
అక్కడ నుండి సొంత రాష్ట్రానికి వచ్చి చిలకలూరిపేట లోని చుండి రంగనాయకులు కళాశాలలో మ్యాథ్స్ ప్రొఫెసరుగా చేరి 1969 వరకు పని చేసారు.ఆ తర్వాత జాగర్లమూడి కుప్పుస్వామి కళాశాల గుంటూరులో మ్యాథ్స్ ప్రొఫెసరుగా చేరి 1984 వరకు పనిచేసారు.
కళాశాల సర్వీసులో శేషగిరిరావు బోర్డు ఆఫ్ స్టడీస్, బోర్డు ఆఫ్ ఎక్జామినర్సు మెంబరుగా, మ్యాథ్స్ డిపార్టుమెంట్ హెడ్ ఆఫ్ ది చైర్మెన్ గా వ్యవహరించారు. పలు సెమినార్లులో పాల్గొన్నారు.వీరు 1984లో స్వచ్చంధ పదవీవిరమణ చేసారు.
అమెరికా ప్రయాణం
కుమారులు ఇద్దరూ వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడినందున సతీమణి ఇందిరాదేవి తో అమెరికా వెళ్లారు.ముందు ఆలోచనతో కంప్యూటర్ రంగంవైపు తన దృష్టిని మరల్చారు.కంప్యూటరు రంగంపై ఆపేక్షతో చికాగో ఇల్లినాయిస్, యూనివర్శిటీలో యం.యస్. (కంప్యూటర్ సైన్స్) కోర్సు చేశారు.
(1985-1987). ఈ కోర్సుతో మూడు మాష్టర్స్ డిగ్రీలు పొందారు.మదిలో తాను అమెరికాలో ఉద్యోగం చేయవచ్చు కదా అని కలిగిన ఆలోచనకు స్పందించి “మెట్రోపాలిటిన్ ఇన్సూరెన్స్ కంపెని” చికాగో ఇల్లినాయిస్ లో సిస్టమ్ ఎనలిస్ట్గ్ గా చేసారు. (1988-1993).
అటు తర్వాత మెట్ లైఫ్ ఛికాగో, ఇల్లినాయిస్ లో పైనాన్షియల్ ప్లానరుగా పని చేసారు.మెట్ లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీకి ఉత్తమ నేవలు అందించినందుకు గుర్తింపు పొందారు. అమెరికా ఆఫ్ మెట్ లైఫ్ (గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్) నుండి “సర్వీసు రికగ్నేషన్” అవార్డు పొందారు.ఇంకనూ శేషగిరిరావు అమెరికాలోని చికాగో ప్రాంతంలోఅందించిన సేవలకు గుర్తించి “డీన్స్ లిష్టు ఆఫ్ ది సిటీ కాలేజి ఆఫ్ చికాగో” కు నామినేట్ చేసారు.
అమెరికాలో ఫలు సెమినార్లులో పాల్గొని పలు అవార్డులు పొందారు.అమెరికాలోని పలు యూనివర్శిటీలలో గెష్ట్ లెక్షరర్ గా వ్యవహరించారు.
యచ్. సి. ఐ. సాప్టువేర్ కంపెనీ ష్థాపన.
యువత భవిత కంప్యూటర్ రంగంతో ముడిపడి ఉంది అని దృష్టిలో పెట్టుకుని యచ్. సి. ఐ. అను పేరిట ఓ సాప్టువేర్ కార్పోరేషన్ ను అమెరికాలో స్థాపించారు.ఆ కంపెనీ ద్వారా అటు అమెరికాలోనూ, ఇటు మాతృదేశంలోనూ ఎందరో సాప్టువేర్ ప్రొఫెసనల్స్ కు మంచి బంగారు బాటను చూపారు.
ఉద్యోగాలకోసం అమెరికా వెళ్లిన ముక్కు, మొహం తెలియని ఎంతోమందికి సరియైన సూచనలు సలహాలు వారి కంపెనీ ద్వారా ఆదరించారు.శేషగిరిరావు, ఇందిరాదేవి దంపతులు అమెరికా ట్రై స్టేటు తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆప్ నార్త్ అమెరికా (తానా ) సంస్థలలో జీవితకాల సభ్యులు.అమెరికాలోని ప్రవాస భారతీయుల సేవా కార్యక్రమాలకు తమ వంతు ఆర్థిక సహాయం అందించారు.
సేవా కార్యక్రమాలు
అమెరికా వెళ్లకముందు నుంచే శేషగిరిరావు వివిధ సంస్థల ద్వారా సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ వంతు సహాయ సహకారాలు అందించారు.లయన్స్ క్లబ్ డిస్ట్రిక్టు చైర్మెన్, డిప్యూటి డిస్ట్రిక్టు గవర్నరు, జోన్ చైర్మెన్ గా శేషగిరిరావు పని చేసారు. ఆకాలంలో ఉచిత కంటి, పంటి వైద్య శిబిరాలు, ఇతర సేవాకార్యక్రమాలు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా మూడు వేల మంది ప్రతినిధులు పాల్గొన్న కొచ్చిన్ సెవన్త్ మల్టిపుల్ డిస్ట్రిక్టు కన్వన్షన్ కార్యక్రమంలో” స్మార్ట్ లయన్” పురష్కారాన్ని అందుకున్నారు.
ఈ దంపతులు అమెరికాలో ఉంటూ కూడా పుట్టిన గడ్డను మరువలేదు.స్వదేశంలో నున్నగ్రామీణ ప్రాంత ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఆ ఉద్ధేశ్యంతో మంచి మనసుతో 1999 లోనే గుంటూరు బృందావన గార్డెన్సులో కొరిటాల ఇందిర-శేషగిరిరావు (కె.ఐ.యస్.) పేరుతో చారిటబుల్ ట్రస్టును స్థాపించారు.
గుంటూరు (లక్ష్మిపురం) లో గల శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల నందు అదనపు తరగతి గదుల నిర్మాణంనకు పది లక్షల రుపాయలు విరాళం అందచేసారు.కాకాని గ్రామం వద్దగల శంకర్ నేత్రాలయం నకు వెయ్యి డాలర్లు అందించారు.అలాగే గుంటూరు మెడికల్ కాలేజిలోని జింఖానా అడిటోరియంనకు వెయ్యి డాలర్లు విరాళం ఇచ్చారు.
ఎంత ఎత్తుకు ఎదిగినా తాను పుట్టిన గడ్డను మరువలేదు.స్వగ్రామం పొనుగుపాడు నందు తాను చదివిన జిల్లా పరిషత్ పాఠశాలలో కంప్యూటరు ల్యాబ్ అవసరాన్ని గుర్తించారు.జన్మభూమి పథకం క్రింద మూడు లక్షల అరవై వేల రుపాయలు విరాళం అందజేసి బిల్డింగు నిర్మాణానికి తోడ్పడ్డారు.
నార్త్ సౌత్ ఫౌండేషన్ రివ్యూ 2003 నందు కంప్యూటరు ల్యాబ్ బిల్డింగును గురించి ప్రస్తావించుట జరిగింది.ఇంకా బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర కళ్యాణ మండపంనకు ఏభై వేల రుపాయలు అందచేసారు.కమ్మజన సేవా సమితికి లక్ష రుపాయలు, కాకతీయ సమితి వినుకొండ వారికి లక్ష రుపాయలు ఉదార స్వభావంతో అందచేసారు.ప్రతి సంవత్సరం అర్దికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్ధులకు యాభై వేల రుపాయలు ‘కిష్’ చారిటబుల్ ట్రష్టు ద్వారా అందిస్తారు.
గోగినేని కనకయ్య ఉన్నత పాఠశాల మెరిట్ విద్యార్ధులకు పారితోషకం అందచేయుటకు పాఠశాల తరుపున పదివేల రుపాయలు డిపాజిట్ చేసి వడ్దీ ద్వారా అందచేసే వీలు కల్పించారుఅంతేగాదు ఉచిత కంటి పరిక్ష కేంద్రంలు నిర్వహించి ఉచితంగా కళ్ల అద్దాలు అందించారు.
సతీమణి ఇందిరాదేవి.
గుంటూరుజిల్లా, ప్రత్తిపాడు మండలం, తుమ్మలపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో 21.11.1939 న జన్మించారు.తల్లిదండ్రులు తేళ్ల నాయుడమ్మ, శ్యామలమ్మ దంపతులు.
ప్రాధమిక విద్యాభ్యాసం, ఉన్నత పాఠశాల విద్య గుంటూరు సెంట్ జోషప్ స్కూలులో చదివారు.ఆతర్వాత ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇంటర్ మీడియట్ చదివి, అదే కళాశాలలో భి.యస్.సి కోర్సు చేసారు.
టీచర్సు ట్రైయినింగు కళాశాల, రాయపూర్ (మధ్యప్రదేశ్) లో బి.యి.డి., కోర్సు చేసారు.భర్త శేషగిరిరావుతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిది సంవత్సరాలు టీచరుగా పని చేసారు. (1961-1968).అటు పిమ్మట తిరిగి భర్త శేషగిరిరావు చిలకలూరిపేట చుండి రంగనాయకులు కళాశాలలో పనిచేయు సమయంలో ఇందిరాదేవి శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో టీచరుగా చేరారు.1984 లో స్వచ్చంధ పదవీవిరమణ చేసి కుమారులు వద్దకు దంపతులిద్దరూ అమెరికా వెళ్ళారు.
అమెరికాలో మైక్రో కంప్యూటర్సు డిప్లమా, సీరీస్ 6, సీరీస్ 63 (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజి కమీషన్) పూర్తి చేసారు. అడ్వాన్సు బిజినెస్ కార్పోరేషన్, ఇల్లినాయిస్, వెస్టుమౌంట్ లో సూపర్వైజరుగా చేసారు. (1985-1988) .సన్ టైమ్స్ డిష్ట్రిబ్యూషన్ సిష్టమ్స్, ఐ.యన్.సి. ఇల్లినాయిస్, అరోరాలో క్వాలిటి కంట్రోల్ సూపర్వైజరుగా చేసారు.(1988-1991).
ఇంకనూ అమెరికా వాల్మార్టులో 1993 నుండి 1996 వరకు అసోసియేట్ గా, మెట్ లైఫ్ ఇన్సూరెన్సులో పైనాన్సియల్ సర్వీసెస్ రిప్రజెంటేటివ్ గా పని చేసారు.ప్రస్తుతం కె ఐ య స్ చారిటబుల్ ట్రష్ట్ కార్యకలాపాల్లో భర్తకు చోదోడు వాదోడుగా నిలుస్తూ తమ వంతు సేవలందిస్తున్నారు.
షష్ఠిపూర్తి మహోత్సవం.
శేషగిరిరావు, ఇందిరాదేవి దంపతుల సంతానం ఇద్దరు కుమారులు హేమంత్ కుమార్, చంద్రశేఖరరావు.
శేషగరిరావు, ఇందిరాదేవి దంపతులకు అరువది సంవత్సరంలు దాటిన సందర్బంగా కుమారులు, కోడళ్లు ఘనంగా షష్ఠిపూర్తి మహోత్సవం జరిపారు.పెద్ద కుమార్డు హేమంత్ కుమార్ బి.ఇ. (సివిలు ఇంజనీరింగు), యం.యస్., (ఇండష్ట్రియల్ ఇంజనీరింగ్) చదివారు.
ప్రస్తుతం అమెరికాలో ఇంజనీరుగా పని చేస్తున్నారు.హేమంతకుమార్ అమరావతి మండలం మక్కామల గ్రామానికి చెందిన మన్నవ సాంబశివరావు, హైమావతి దంపతుల ప్రథమ కుమార్తె చెల్లమ్మ యం.యస్.సి., (మ్యాథ్స్) ని వివాహమాడారు. ఈ దంపతుల సంతానం. ఇద్దరు కుమార్తెలు హరిప్రియ, హర్షప్రియ. కుమారుడు శ్రీరామ్ సాయితేజ.
రెండవ కుమార్డు చంద్రశేఖర్ యం.బి.బి.యస్., మరియు యం.యస్., (ఇంటర్నల్ మెడిషన్, అనస్తీషియాలజీ) డాక్టరుగా అమెరికాలో ఉంటున్నారు.చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జడ్జిగా పనిచేసిన ఈశ్వరప్రసాద్, చామంతి దంపతుల ద్వితీయ కుమార్తె శశికళను వివాహమాడారు.ఈదంపతుల సంతానం ఇద్దరు కుమార్తెలు రమ్యప్రియ, రేణుకాప్రియ.
తల్లి నారాయణమ్మకు పురష్కారం
శేషగిరిరావు తల్లి కీ.శే. నారాయణమ్మ జీవిత ప్రయాణంలో 90 దశకంలో పడి, సహస్ర చంద్రోదయం దర్శనం భాగ్యం లభించిన మహామాన్విత.ఆ సందర్బంగా, కుమారులు, కుమార్తెలు అరుదుగా జరిగే “సహస్ర చంద్ర దర్శన సన్మానం” ను 13.03.2006 న ఆమెకు ఘనంగా చేసారు.
ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంనకు బంధువులు, గ్రామ పెద్దలు ఆమెను సత్కరించారు.ప్రతి మాతృమూర్తికి ఇలాంటి సన్మానాలు జరిపే అవకాశం ప్రతి తల్లిదండ్రుల సంతానానికి కలగాలని భగవంతుని కోరదాం.
పోలేరమ్మ ఆలయ నిర్మాణం
పొనుగుపాడులో వీరి కుటుంబానికి చెందిన స్తలంలో పోలేరమ్మ విగ్రహం పూర్వం నుండి ఉంది.గ్రామదేవతగా గుర్తింపు పొంది ఎటువంటి ఆలయం లేకుండా ఎండ తగులచూ, వర్షానికి తడుస్తూ ఉంది.
అటువంటి పరిస్థితులును వీరి కుటుంబ సభ్యులు గమనించారు.వీరి సోదరుల సహకారంతో మరికొంత స్తలం అదనంగా సమకూర్చి ఆలయం నిర్మించారు.
[/vc_column_text][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row]