పదవ తరగతి ప్రథమ విద్యా కుసుమాలు.పొనుగుపాడు జెడ్.పి.హెచ్. స్కూలు. తేది :15-05-2014

ఎంతో ఘన వ్యయ ప్రయాసలతో వందలాది మంది విద్యార్థులు, కార్పోరేట్ విద్యాసంస్థల నందు చదువుచున్నారని మనందరకు తెలుసు.
అటువంటి ఈ రోజుల్లో మరో గ్రామం, ఇంకొక పాఠశాల విషయం తెలియదు.
కోయ శివరామకృష్ణ, పద్మ దంపతులకు పొనుగుపాడులో జన్మించిన బార్గవ చిన్నతనం నుండి అక్కడే చదివాడు.
జెడ్.పి.హెచ్. పాఠశాలనందు పదవ తరగతి చదివి 2013-14 విద్యా సంవత్సరం పరీక్షా ఫలితాలనందు ఇంగ్లీసు మీడియం లో 9.3 గ్రేడుతో స్కూలు ప్రథమ స్థానం సాధించాడు.
సంకల్పబలం ఉంటే దూర తీరాలపై ఆశ పడాల్సిన అవసరం లేదని నిరూపించాడు.

అలాగే అదే పాఠశాలలో పదవ తరగతి తెలుగు మీడియంలో 9.3 గ్రేడుతో మైనీడి ప్రియాంక స్కూలు ప్రథమ స్థానం సాధించింది. తండ్రి హనుమంతురావు, తల్లి శ్రీదేవి.
ఆ విద్యార్థులకు అందరూ జేజేలు పలికారు.
అలాగే ఈ పాఠశాల ఇంగ్లీసు మీడియంలో 100 % ఉత్తీర్ణత సాధించినందుకు, తెలుగు మీడియంలో 87 % సాధించినందుకు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి యస్.పి.కె.ప్రసాదినిని, ఉపాధ్యా యులను, విద్యార్ధుల తల్లిదండ్రులు అభినందించారు.
విధ్యార్ధులకు. తల్లిదండ్రులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు., ఉపాధ్యాయులకు ఈ సందర్బంగా www.manaponugupadu.com శుభాకాంక్షలు.