జగన్నానాధం జననం, పూర్వీకుల వివరం.
జగన్నాథం పొనుగుపాడు గ్రామంలో 20.08.1946 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బమ్మ, వెంకట్రాయుడు (తాత), మహలక్ష్మి (నాయనమ్మ).
వీరి పూర్వీకులు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందినవారని తెలుస్తుంది.వీరి తల్లి వెంకట సుబ్బమ్మ పొనుగుపాడుకు చెందిన కొరిటాల రామస్వామి,శేషమ్మ దంపతుల ద్వితీయ కుమార్తె. జగన్నాధం పసితనంలోనే తల్లి వెంకటసుబ్బమ్మ కాలం చేసింది.
తండ్రి వెంకటేశ్వర్లు తిరిగి కొరిటపాడు (గుంటూరు) కు చెందిన కొమ్మినేని రామయ్య, మాణిక్యమ్మ దంపతుల తృతీయ కుమార్తె పిచ్చమ్మను వివాహమాడారు.పిచ్చమ్మ సంతానం ముగ్గురు కుమారులు. సాంబయ్య, శివశంకరరావు, కోటేశ్వరరావులు. కుమార్తె వెంకటసుబ్బమ్మ.
మారు తల్లి పిచ్చమ్మ జగన్నాథంను పసితనం నుండి తన సంతానంకన్న మిన్నగా, కన్నబిడ్డలాగా పెంచి పెద్ద చేసింది.అలాగే జగన్నాథం మారు తల్లి పిచ్చమ్మను కన్నతల్లిలాగానే భావించి పెరిగాడు.
గ్రామంలో చాలామంది వాళ్ళిద్దరిని కన్నతల్లి, కన్నబిడ్డే అనే భావించుతారు.మారు తల్లి పిచ్చమ్మ సంతానంపై కూడా జగన్నాధం ఎటువంటి తేడా కనపరచరు.
తండ్రి వెంకటేశ్వర్లు కాలం చేసే వరకు చేతి ఐదు వేళ్ళకు బంగారు ఉంగరాలు ధరించుట ప్రత్వేక విశేషం. తండ్రి వెంకటేశ్వర్లును చాలామంది ఉంగరాల వెంకటేశ్వర్లు అంటుంటారు.
వివాహం, విద్య
నరసరావుపేట మండలం, పమిడిపాడు గ్రామానికి చెందిన పోపూరి రామయ్య, మహలక్ష్మమ్మ దంపతుల ద్వితీయ కుమార్తె గోవిందమ్మను వివాహమాడారు.జగన్నాధం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు హిందూ ప్రాథమిక పాఠశాలలో (1951-1956) చదివారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొనుగుపాడు నందు ఆరవ తరగతి నుండి యస్.యస్. యల్.సి. వరకు చదివారు (1957-1962). గుంటూరు ఎ.సి కాలేజిలో పి.యు.సి. చదివారు (1969).ఆ తర్వాత జగన్నాధం 1969 లో ఐఐటి బెనారస్, హిందూ విశ్వవిద్యాలయం నుంచి (వారణాసి, ఉత్తరప్రదేశ్) బి.యస్.సి. (మెటలర్జికల్ ఇంజనీరింగు) పట్టాను పొందారు.1980 లో ముంబాయి నుంచి యం.ఐ.ఐ.ఐ.ఇ. పట్టాను పొందారు.
జగన్నాధం ఉద్యోగ ఆరంగేట్రం
జగన్నాధం మొదటగా 1969 లో స్టీలు అధారిటీ ఆప్ ఇండియా యాజమాన్యం లోని భిలాయ్ స్టీలు ప్లాంటులో ‘బ్లాస్ట్ ఫర్నస్’ విభాగం నిర్వహణ నందు గ్రాడ్యేట్ ట్రైనీగా ఉద్యోగం లో చేరారు.అసిస్టెంటు మేనేజరు స్థాయికి ఎదిగి 1983 వరకు పని చేసారు. అక్కడ ఆయన అత్యుత్తమ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన “జవహర్ లాల్ నెహ్రూ” పురష్కారాన్ని అందించింది.
1983 లో వైజాగ్ స్టీలు ప్లాంటులో డెప్యూటి మేనేజరుగా ప్రవేశించారు. అధునాతన సాంకేతిక అమలు కోసం వైజాగ్ స్టీలు ప్లాంటు నుండి రష్యా, యూరప్, దక్షిణకొరియా, దేశాలకు వెళ్ళిన ఇంజనీర్ల టీముకు నాయకత్వం వహించారు.దానికి గుర్తింపుగా ఆయనకు “బెస్ట్ లీడరు ఆఫ్ ది మెన్” లభించంది.విశాఖ స్టీలు ప్లాంటు లో జగన్నాధం నాయకత్వం లో కొత్తగా ప్రారంభించబడిన “బ్లాస్ట్ ఫర్నెస్” మొదటి సంవత్సరంలోనే నూటికి నూరుశాతం ఉత్పత్తి స్థాయిని చేరుకోవటం గమనార్హం.
అంతేగాదు వైజాగ్ స్టీలు ప్లాంటు ఉక్కు తయారీ శాఖకు ప్రధానాధికారిగా సమర్ధతతో వ్యవహరించారు.ఉత్పత్తి ఆదారిత ప్రోత్సాహక పధకాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. ఆ పధకం ఇరవై ఏళ్ళపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. వైజాగ్ స్టీలు ప్లాంటు లో అసిస్టెంటు జనరల్ మేనేజరు స్థాయికి ఎదిగి 1994 వరకు పనిచేసారు.
పలు ఉన్నత పదవులు నిర్వహణ
1994 లోమహరాష్ట్ర, డోల్విలోని “ఇస్పాట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్” ప్రాజెక్టులకు ముడి సరుకుల శాఖలో ఉపాధ్యక్షుడు/ డెప్యూటి సి.ఇ.ఒ గా ఉన్నత నాయకత్వ బృందంలో స్థానం సంపాదించి 2003 వరకు పని చేసారు.అంతేగాదు జగన్నాధం నాయకత్వం వహించిన నిపుణుల బృందం జర్మనీలో నిరుపయోగంగా పడివున్న ఒక బ్లాస్ట్ ఫర్నస్ కు వంద సంవత్సరాల కొత్త జీవితం వచ్చేట్లు పునర్నిర్మించారు. ఆయన ప్రతిభను జర్మని జట్టు ఘనంగా కొనియాడింది.
జగన్నాధం విద్యార్ధిదశ నుంచి కూడ ఆయన ఇనుము, ఉక్కు పరిశ్రమకు అంకితమైనారు. ఇనుము ఉక్కు తయారీలో పబ్లిక్, ప్రవేటు రంగాలలో నిర్వహణ, యాజమాన్య పద్ధతులలో అపారమైన అనుభవం గడించారు.ఆ అనుభవంతో జగన్నాధం స్వదేశం ఇండియా, బల్గేరియా, లిబియా, బోస్నియా-హెర్జిగోవినా మొదలగు దేశాలలో ఉక్కు కర్మాగారాలు, వాటి అనుబంధ పరిశ్రమల అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషించారు.
2004 నుండి 2012 వరకు సవ్యసాచి లాగా ఏక కాలంలో ఒక దాని కొకటి భిన్నమైన రెండు దేశాలలో రెండు భిన్నమైన పరిశ్రమలకు–బోస్నియా-హెర్జిగోవినా దేశంలోని ‘జికిల్ ‘ కు, బొగ్గు-రసాయనిక పరిశ్రమకు మేనేజింగు డైరెక్టురుగా పనిచేసారు.అదే కాలంలో బల్గేరియా లోని ‘క్రెమికోవిడ్జ్’ ఉక్కు కర్మాగారానికీ- ప్రధాన నిర్వహణాధికారి (సి.ఇ.ఓ) గా పని చేసిన అరుదైన ఘనత వీరికి దక్కింది.
అంతేగాదు అదే కాలంలో 2009 నుండి 2012 వరకు లిబియా దేశంలోని ‘లిబియాన్ ఐరన్ అండ్ స్టీలు కంపెని’ సాంకేతిక అభివృద్ధి శాఖ (గ్లోబల్ స్టీలు హోల్డింగ్ లిమిటెడ్) కు డైరెక్టరుగా అదనపు భాధ్యతలు నిర్వహించారు.భారీ పరిశ్రమలకు అత్యంత అరుదైన వ్యత్యాసంగల ఉన్నత పదవులు నిర్వహించటమనేది జగన్నాధం జీవితంలో ఒక మైలురాయి వంటిది
బోస్నియా-హెర్జిగోవినా దేశంలోని బొగ్గు-రసాయనిక సమాఖ్యలో భాగస్వామ్యం కలవటానికి ఆదేశ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ‘జికిల్’ పేరుతో స్టీలు ప్లాంటును జగన్నాధం పర్వేక్షణలో నెలకొల్పారు.
“బెస్ట్ లీడరు (సి.ఇ.ఒ) ఆఫ్ ది మెన్ ఆప్ యూరఫ్ కంట్రీస్” అవార్డు పొందిన వ్యక్తి
బోస్నియా పరిశ్రమలో అత్యంత పటిష్టమైన ఉత్పత్తి వ్యవస్థను జగన్నాధం ప్రవేశపెట్టారు.ఆయన ఘనతకు గుర్తింపుగా ‘జపనీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంటు మేనేజ్ మెంటు’ నుంచి 2008 లో ‘టి.పి.యం ఎక్సలెన్స్’ అవార్డును అందుకున్నారు.2010లో ఆగ్నేయ యూరప్ లోని సి.ఇ.ఒ లందరిలోను అత్యత్తముడుగా గుర్తింపు పొందారు.
బోస్నియా-హెర్జిగోవినా దేశంలేని’జికిల్’ ఉక్కు కర్మాగారం సాధించిన విజయం గురించి జగన్నాధం సమర్పించిన పత్రానికి 2011 లో అమెరికాలోని పెన్సిల్వేనియా కు చెందిన ‘ఇనుము ఉక్కు పరిశ్రమల సాంకేతిక అసోసియేషన్’ (ఎ.ఐ.యస్.టి) నుండి అరుదైన ‘గుర్తింపు పత్రం’ పొందారు.
2010 లో ఆగ్నేయ బోస్నియా-హెర్జిగోవినా దేశంలోని జెరికా, సారజేయేవొ, బెన్యాలుక మూడు ప్రధాన నగరాలలో ప్రచురించుబడే ‘యూరోమేనేజరు’ మ్యాగజైను ముఖపేజిలో జగన్నాధం ప్రతిభను కొనియాడారు.ఇతర దేశాలలో ఉండుటకు ఎన్నో అవకాశాలు ఉన్ననూ, జగన్నాధం స్వదేశం లోనే నివశించాలనే ఆశయంతో 2012లో స్వదేశానికి తిరిగి వచ్చారు.
సేవా కార్యక్రమాలు నిర్వహణ
జగన్నాధం ఎక్కడ ఉన్నా తన వృత్తితో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖపట్నంలో పనిచేసే కాలంలో అనాధాశ్రమాలకు అన్నదాన కార్యక్రమాలు జరిపారు.బోస్నియాలో “జికిల్” కంపెనీ యం.డి.గా పని చేసేటప్పడు సమీప గ్రామాలలోని ప్రజల ఆకాంక్ష మేరకు సిమ్మింగ్ పూల్స్ నిర్మించారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టారు.
స్వగ్రామం పొనుగుపాడులో మంచి నీటికి ఇబ్బంది పడుచున్న ప్రజల కష్టాలు గమనించారు. దానికి స్పందించి గ్రామంలో వంకాయలపాటి సూర్యనారాయణ, బలరామకృష్ణయ్య, యర్రం నాగేంద్రమ్మలు ఉచితంగా ఇచ్చిన స్థలంలో స్వంత నిధులు ఎనిమిది లక్షలతో మినరల్ వాటరు ప్లాంటు నిర్మించారు.
పొనుగుపాడు గ్రామానికి చెందిన కొంగర జగన్నాధం ( మాజి వి.అర్.ఒ), కామినేని రామారావు (రిటైర్డు టీచరు), పాతూరి సూర్యనారాయణలు వాటరు ప్లాంటు నిర్మాణం పర్యేక్షణలో భాగస్వామ్యం వహించారు.వాటరు ప్లాంటును అప్పటి గుంటూరు పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు చేతులుమీదుగా ప్రాంరంబోత్సవం జరిగింది.
జగన్నాదం తండ్రి పేరన “గుంటుపల్లి వెంకటేశ్వర్లు చారిటబుల్ ట్రష్టు” ను ఏర్పాటు చేసి లాభనష్టాలు లేని పద్ధతిపై గ్రామస్థులకు పరిశుభ్రమైన మంచినీరు నిరంతరం సరఫరా జరిగే అవకాశం గ్రామ ప్రజలకు కల్పించారు.అంతేగాదు స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుచున్న విద్యార్థులకు విద్య మెరుగ్గా ఉండటానికి డాక్టరు పెద్దయ్య, షేకు మస్తానువలి, (అమెరికా) జగన్నాధం మగ్గురు కలసి ప్రత్యేకంగా ట్యూటరును నియమించారు.విద్యార్దుల మంచి భవితకు తోడ్పడుచున్నారు.
“అమేయ వరల్డ్ స్కూలు ” స్ధాపకుడు
జగన్నాదం. గోవిందమ్మ దంపతుల సంతానం కుమారుడు శ్రీనివాస్,కుమార్తె రామతులసి. శ్రీనివాస్ వివాహం గుంటూరుజిల్లా, మంగళగిరి మండలం, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన యడ్లపాటి ఎకోనారాయణ, శాంతి దంపతుల కుమార్తె నీలిమ యం.సి.ఎ. తో జరిగింది.
శ్రీనివాస్ ‘టెక్ మహేంద్ర’ శాప్ యూనిట్, హైదరాబాదులో సీనియర్ మేనేజరుగా చేస్తున్నారు. జగన్నాదం, గోవిందమ్మ దంపతులు, కుమార్డు శ్రీనివాస్, నీలిమ దంపతులు కృష్ణజ హిల్సు సొసైటి, బాచుపల్లి, హైదరాబాదులో స్థిరనివాసం ఉంటున్నారు.
రామతులసి బి.ఫామ్. చదివింది. గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలం, పూసపాడు గ్రామానికి చెందిన మండవ వీరయ్య, రూపలతాదేవి, దంపతుల కుమార్డు శ్రీశైలేంద్రమోహన్ యం.టెక్., (ఎలెక్ట్రానిక్స్) తో రామతులసి వివాహం జరిగింది.
అల్లుడు శ్రీశైలేంద్రమోహన్ కొంతకాలం అమెరికాలో యస్.ఐ.యస్.సి.ఒ (సిస్కో) నందు రీసెర్చ్ అండ్ డెవలప్ మెంటు విభాగం మేనేజరుగా పనిచేసారు.
కుమార్తె రామతులసి ఫార్మాసిష్టుగా పనిచేసారు. తండ్రి జగన్నాధం సలహాతో స్వదేశానికి 2005లో తిరిగి వచ్చారు.జగన్నాధంనకు విద్యమీద ఉండే మక్కువతో అల్లుడు శ్రీశైలేంద్రమోహన్, కుమార్తె రామతులసిలను విద్యారంగంవైపు ప్రోత్సాహించారు.
ఈ నేపథ్యంలో , విశాఖపట్నం (సంగివలస) నందు 2006లో “అమేయ వరల్డ్ స్కూలు ” ను స్థాపించారు.కుమార్తె రామతులసి, అల్లుడు శ్రీశైలేంద్రమోహన్ ఇద్దరు స్కూలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. నేడు విశాఖ నగరంలో “అమేయ వరల్డ్ స్కూలు ” విద్యార్ధులకు అన్ని వసతులు, ఉన్నతమైన విద్యాప్రమాణలతో పేరు ప్రఖ్యాతులు గడించింది.
[/vc_column_text][/vc_column][/vc_row][vc_row][vc_column][vc_wp_text]
గ్రామంలో తన తండ్రి గుర్తుగా గుంటుపల్లి వెంకటేశ్వర్లు చారిటబుల్ ట్రష్టు తరుపున స్థాపించిన మినరల్ వాటరు ప్లాంటు సందర్బంగా జరిగిన కార్యక్రమాల ఫొటో గ్యాలరీ.
[/vc_wp_text][/vc_column][/vc_row][vc_row][vc_column][vc_media_grid grid_id=”vc_gid:1486222321731-e984a95a-fdff-8″ include=”8286,8287,8288,8290,8291,8293,8294,8295,8297″][/vc_column][/vc_row]
Please connect me whit Jaganadam Guntupali. My name is Betina Karevska. Phone 00 94 755567870.