రిటైర్డు జిల్లా ప్రొగ్రామ్ ఆఫీసరు, (ప్లోరైడు నిర్మూలన)
శ్రీరాములు పొనుగుపాడు గ్రామంలో 01.05.1938 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అప్పయ్య, లక్ష్మమ్మ. తాత రాయుడు, నాయనమ్మ శేషమ్మ.వీరి సోదరులు ఆంజనేయులు, శేషారాయుడు.పెద్ద తోబుట్టువులు రామతులిశమ్మ, సీతారామమ్మ. చిన్న తోబుట్టువులు వరలక్ష్మి, జయవర్థనమ్మ.
ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య పొనుగుపాడులో చదివారు.గుంటూరు మెడికల్ కాలేజిలో శానిటరీ ఇనస్పెక్టరు కోర్సు చేసారు. (1956.1957) .పొనుగుపాడు గ్రామానికి చెందిన కొరిటాల (చిన)శేషయ్య, వెంకమ్మ దంపతుల కుమార్తె సీతామహలక్ష్మిని 01.09.1961న వివాహమాడారు.
వీరు వివాహానికి ముందే 24.02.1958న ప్రభుత్వ సర్వీసులో హెల్తు అసిస్టెంటుగా ప. గో. జిల్లా నర్సాపురంలో చేరారు.అక్కడ ఒక సంవత్సరం హెల్తు అసిస్టెంటుగా చేసి హెల్తు ఇనస్పెక్టరుగా పదోన్నతి పొందారు.అదే జిల్లాలోని మొగల్తూరు బ్లాకు డెవలప్మెంట్ అధికారి కార్యాలయంనందు విధులలో చేరి, జనవరి 1963 వరకు పని చేసారు.
ఆ దరిమిలా గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యారు. జాతీయ మలేరియా నిర్మూలన పథకం సర్వెలెన్సు ఇనస్పెక్టరుగా ప్రత్తిపాడులో చేరి ఒక మాసం చేసారు. ఆ తరువాత ఆయన పిడుగురాళ్ల యన్.యమ్.ఇ.పి. సెక్టారు ఆపీసు (గురజాల సబ్ యూనిట్) లో చేరి ఆగష్టు 1963 వరకు పని చేసారు.తదుపరి ఆయన అదే హోదాలో రేపల్లె సబ్ యూనిట్ పరిధిలోని కనగాల యన్.యమ్.ఇ.పి. సెక్టారు ఆపీసులో ఐదు సంవత్సరాలు సర్వీసు చేసారు.
హెల్తు ఇనస్పెక్టరుగా (ప్యామ్లీ ప్లానింగ్) పదోన్నతి.
ఆహోదా నుండి హెల్తు ఇనస్పెక్టరు (ప్యామ్లీ ప్లానింగ్) గా 13.08.1968న పదోన్నతి పొందారు.అదే గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాయన్ అయ్యారు. అంతకు ముందు నుండే భార్య సీతామహలక్ష్మి జులై 1966 నుండి హెల్తు విజిటరుగా కనగాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పని చేస్తున్నారు.1971.72 లో వీరు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్థేశించిన లక్ష్యంనకు మించి చేయించారు.
దానికి ప్రభుత్వం గుర్తించి 26.01.1972న జరిగిన గణతంత్ర దినోత్సంలో అప్పటి గుంటూరు జిల్లా కలెక్టరు జయబారత రెడ్డి చేతులు మీదుగా “గోల్డు మెడలిష్టు” అవార్డు అందుకున్నారు.అక్కడ ఆయన అక్టోబరు 1974 వరకు విధులు నిర్వర్తించారు.
తదుపరి శ్రీరాములు గుంటూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు. మద్దిపాడు (చీమకుర్తి సబ్ సెంటరు) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్తు ఇనస్పెక్టరు (ప్యామ్లీ ప్లానింగు) గా విధులులో చేరారు.అదే హోదాలో డిశెంబరు 1980 వరకు పని చేసారు.
ఆ దరిమిలా ఆజిల్లాలోనే పెద చెర్లోపల్లి (కనిగిరి తాలూకా) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బ్లాకు విస్తరణ ఎడ్యుకేటర్ గా ఏప్రియల్ 1983 వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు.
అటు పిమ్మట యన్.యమ్.ఇ.పి. సబ్ యూనిట్ ఆఫీసరుగా పదోన్నతి పొంది కనిగిరిలో జాయన్ అయ్యారు.అక్కడ ఆయన సబ్ యానిట్ ఆఫీసరుగా సెప్టెంబరు 1993 వరకు పని చేసారు.
డిస్ట్రిక్టు ప్రోగ్రామ్ ఆఫీసరు గా (ప్లోరైడు నిర్మూలన) పదోన్నతి
చివరగా ప్లోరైడు నిర్మూలన కార్యక్రమం యూనిట్ ఆఫీసరుగా (డిస్ట్రిక్టు ప్రోగ్రామ్ ఆఫీసరు) పదోన్నతితో (గజటెడ్ ఆఫీసరు) ప్రకాశం జిల్లా డి.యం.అండ్ హెచ్.ఒ కార్యాలయంలో సెప్టెంబరు 1993లో చేరారు.అక్కడ ఆయన 30.04.1996 వరకు పని చేసారు. అదే కార్యాలయంలో యూనిట్ ఆఫీసరుగా 30.04.1996న పదవీ విరమణ పొందారు.
పదవీ విరమణ తదుపరి ప్రకాశం జిల్లా, సంతమాగులూరులో భార్య సీతామహలక్ష్మి 30.06.1999న పదవీ విరమణ చేసే వరకు అక్కడే ఉన్నారు.
కుమార్తెలు శశికళ, లక్ష్మితులసిలు సంత మాగులారులో షష్టిపూర్తి వేడుక జరిపారు. దంపతులు ఇరువురూ నరసరావుపేట లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు.1997 నుండి 2013 వరకు నవోదయ మల్టిపర్పస్ హెల్తు స్కూలు (ప్రవేటు) నరసరావుపేటలో శిక్షణ ఉపాధ్యాయుడుగా పని చేసారు.
ఆ తరువాత నరసరావుపేట పరిధిలో లోకసత్తా ఆర్గనైజేషన్ కార్యకర్తగా కొంతకాలం చురుకైన పాత్ర పోషించారు.తను పని చేసిన హెల్తు డిపార్టుమెంటుపై శ్రీరాములుకు ఎనలేని అభిమానం. ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో స్వచ్చంధంగా పాల్గొని తన సేవలను అందిస్తుంటారు.తన పని చేసిన శాఖలోని ఉద్యోగులు, అధికారులు పరిపాలనా సంబంధమైన వ్యవహారాల సందేహాలకు ఇప్పటికి ఆయన ద్వారా సలహాలు పొందుట విశేషం.
భార్య సీతామహలక్ష్మి.
పొనుగుపాడు గ్రామానికి చెందిన కొరిటాల శేషయ్య(చిన), శేషమ్మ దంపతులకు 15.06.1942న మూడవ సంతానంగా జన్మించారు.తండ్రి శేషయ్య వృత్తి వ్యవసాయం. ఈమె పెద్ద సోదరుడు పేరయ్య, పెద్జ సోదరి వరమ్మ. సీతామహలక్ష్మి భర్త శ్రీరాములు మరెవరో కాదు, మేనమామ కుమార్డు.
ఈమె ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య పొనుగుపాడులో చదివారు. ఆ తరువాత హైదరాబాదు నిలోఫర్ హెల్తు స్కూలులో హెల్తు విజిటర్సు కోర్సు చేసారు. (1961)మొదట పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 05.12.1961 న హెల్తు విజిటరుగా విధులులో చేరారు.
అక్కడ సీతామహలక్ష్మి జూన్ 1963 వరకు పని చేసారు.భర్త శ్రీరాములు జనవరి 1963 వరకు మొగల్తూరులోనే పని చేసారు. ఆ తరువాత గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యారు.గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు, కనగాల పంచాయితి సమితిలలో ఏప్రియల్ 1981 వరకు హెల్తు విజిటరుగానే చేసారు.
ఆ దరిమిలా ప్రకాశం జిల్లా చీమకుర్తి తాలూకా పెదచెర్లోపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 1987 వరకు పనిచేసారు. హనుమంతునిపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 1992 మార్చి వరకు పని చేసారు.పి.హెచ్.యన్ గా చివరి పదోన్నతి పొంది సంతమాగులూరు ప్రాథమిక ఆరోగ్య కేంధ్రంలో1999 జూన్ వరకు పని చేసి పదవీ విరమణ పొందారు.
ప్రథమశ్రేణి హెల్తు విజిటరు” గా ప్రభుత్వ గర్తింపు.
సీతామహలక్ష్మి తన సర్వీసులో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అమలులో చురుకైన పాత్ర పోషించింది. ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి జిల్లా స్థాయిలో నగదు ప్రోత్సాహక బహుమతి అందజేసింది.అలాగే రెండుసార్లు “ప్రథమశ్రేణి హెల్తు విజిటరు” గా ప్రభుత్వం గుర్తించి ప్రసంశాపత్రాలు అందజేసింది.
పొనుగుపాడు గ్రామానికి చెందిన నంబూరు రామచంద్రయ్య, వెంకటలక్ష్మమ్మ దంపతుల కుమార్డు దేశయ్య అప్పట్లో డి.యమ్. యస్ చదివి హెల్తు డిపార్టుమెంటులో జిల్లా హెల్తు ఆఫీసరుగా పని చేసేవారు.సీతామహలక్ష్మి తండ్రి కొరిటాల (చిన) శేషయ్య దేశయ్యకు మంచి సన్నిహితుడు.
దేశయ్య సహకారంతో ఈ దంపతులుకు ఉద్యోగాలు వచ్చినందున, శ్రీరాములు ఇంట్లో దేశయ్య ఫొటోను పెట్టుకుని ఇప్పటికి ఆరాదించుట విశేషం.ఆయన సహకారంతో పొనుగుపాడులో, పరిసర గ్రామాలలోనివారు లెక్కకు మిక్కిలిగా అప్పట్లో ఉద్యోగాలు పొందారు.ఇప్పటికీ ఆయన పేరు తెలియని వారు లేరు.
పెద్ద కుమార్తె శశికళ వివాహం గుంటూరుజిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామానికి చెందిన చాగంటి వెంకటేశ్వర్లు, రామతులిశమ్మ దంపతుల కుమార్డు ప్రతాప్ కుమార్ (మేనత్త కుమార్డు) తో జరిగింది.
లక్ష్మితులసి వివాహం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామానికి చెందిన గుదే పెద వెంకయ్య కుమార్డు భూమయ్య, బి.టెక్., తో జరిగింది. ఉద్యోగరీత్యా నైజీరియాలో ఉన్నారు.
కుమార్డు శ్రీనివాస్ ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన గుండపనేని లక్ష్మయ్య, కస్తూరి దంపతుల కుమార్తె విజయలక్ష్మి బి.యస్.సి., బి.ఇ.డి (మ్యాథ్స్) ని వివాహమాడారు.
శ్రీనివాస్ న్యూజెర్సీ (అమెరికా) లో జైడస్ ఫార్మా కంపెని నందు రెగ్యలేటరీ ఎఫైర్స్ విభాగంలో ప్రధాన ఉద్యోగిగా చేస్తున్నారు.శ్రీనివాస్ కుమార్డు శాయి వెంకటేష్. కుమార్తె లక్ష్మిభావన.సీతామహలక్ష్మి ఆరోగ్యం క్షీణించి 09.09.2002న కాలం చేసింది.అప్పటి నుండి సోదరి వరలక్మి శ్రీరాములు ఇంటిలోనే ఉంటూ సంరక్షణ భాధ్యతను తీసుకుంది. ప్రశాంత వాతావరణంలో శేష జీవితం గడుపుచున్నారు.