mr-mrs-dr-koritala-pandurangarao

డాక్టరు కొరిటాల పాండురంగారావు.

[vc_row][vc_column][vc_column_text]

డాక్టరేటు పట్టా పొందిన మొదటి వ్యక్తి

dr-pandurangaraoపొనుగుపాడు గ్రామానికి చెందిన మస్తానురావు చౌదరి, నారాయణమ్మ దంపతులకు మూడవ సంతానంగా 12.11.1940 న జన్మించారు. తాత శేషయ్య, నాయనమ్మ ఆదెమ్మ. ముత్తాత కోటయ్య. తాతమ్మ పేరమ్మ.అన్న శేషగిరిరావు. అక్క కమలారత్నం. చెల్లెలు అనంతాదేవి. తమ్ముడు ప్రభాకరరావు.

డాక్టరు పాండురంగారావు ప్రాధమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య పొనుగుపాడులో చదివారు.గుంటూరు ఆంధ్ర కిృష్టియన్ కళాశాలలో బి.యస్.సి. (1956-1958) చదివి పట్టా పొందారు.ఆ తరువాత తిరిగి అదే కళాశాలలో డిమానుస్ట్రేటరుగా చేరి 1958 నుండి 1959 వరకు పనిచేసారు. తదుపరి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విక్రమ్ యూనివర్శిటి, ఇండోర్ నందు యం.యస్.సి.చేసారు. (1960-1962)

కొరిటాలవారి కుటుంబాలలో డాక్టరు పాండు రంగారావు తల్లిదండ్రులు మస్తానురావు చౌదరి, నారాయణమ్మలను ఇప్పటికీ ప్రముఖ వ్యక్తులుగా పరిగణిస్తారు. గ్రామంలో కూడా ఈదంపతులకు తగిన గుర్తింపు ఉంది.

విద్యను నమ్మి తన కుమారుల అందరికి ఉన్నత చదువులు చెప్పించారు.అందరూ ఉన్నత జీవితంలో స్ధిరపడటానికి మస్తానురావు చౌదరి ముందు చూపుతో పూల బాటను వేసారు.

mr-mrs-dr-koritala-pandurangaraoడాక్టరు పాండురంగారావు పొనుగుపాడు గ్రామానికి చెందిన మర్రి గోపాలకృష్ణయ్య, కోటేశ్వరమ్మ దంపతుల ద్వితీయ పుత్రిక రత్నకుమారిని 1961లో వివాహమాడారు.

గోపాలకృష్ణయ్యను గ్రామంలో అందరూ పెద్దాయనగా వ్యవహరిస్తుంటారు.

గోపాలకృష్ణయ్య మరెవరో కాదు. మస్తానురావు చౌదరి పెద్ద సోదరి రత్తమ్మ, మర్రి రామలింగయ్య దంపతుల ద్వితీయ కుమార్డు.

ఉద్యోగ ఆరంగేట్రం

డాక్టరు పాండురంగారావు యం.యస్.సి. చదివిన తరువాత నెల్లూరు జిల్లా కావలి జవహర్ కళాశాలలో కెమిష్ట్రీ లెక్చెరర్ గా చేరారు. ఆతరువాత ఆంధ్ర క్రిష్టియన్ కళాశాలలో 1963 ఆగష్టు వరకు కెమిష్ట్రీ లెక్చెరర్ గానే  పని చేసారు.ఆ ఉద్యోగం నుండి విరమించుకుని తమిళనాడు రాష్ట్రంలోని కారైకూడి, సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిస్ట్యూట్ (C E C R I) (నేషనల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్-C S I R) నందు సైంటిష్ట్ గా చేరారు.ఆ కాలంలో డాక్టరు పాండురంగారావు విద్యుత్ రసాయన అనువర్తనాల (Applications) పై పరిశోధన నిర్వహించారు.

అక్కడ ఆయన 1963 నుండి 1965 మే వరకు పని చేసారు. ఆ తరువాత బదిలీపై  చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ (C L R I) (నేషనల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ – C S I R) నందు సైంటిష్టుగా 1965 ‘మే’లో చేరారు.ఆ కాలంలో బయోటెక్నాలజీ, జీవ పదార్థాలు మరియు పాలిమర్ సైన్స్, సరిహద్దు సాంకేతికతల అభివృద్ధి పరిశోధకులు బృందానికి నాయకుడుగా వ్యవహరించారు.

ఆక్కడ పని చేస్తూనే మద్రాసు యూనివర్శిటీ (1972) లో పి.యచ్.డి చేసి డాక్టరేటు పొందారు. వీరు పొనుగుపాడు గ్రామంలో మొదటగా డాక్టరేటు పొందిన వ్యక్తి.డాక్టరు పాండురంగారావు ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ అనుభవం, మంచి నాయకత్వం, సంభాషణ నైపుణ్యాలను కలిగియున్నారు.  వివిధ స్థాయిల వ్యక్తులతో అవగాహన కలిగిన సామర్థ్యంతో అక్కడ పనిచేసారు.

బయోమెటీరీయల్స్, బయోసైన్సెస్ మరియు పాలిమర్ విభాగాలుతో సహా ఇన్సిట్యూట్ వివిధ విభాగాలకు సమర్దవంతంగా నాయకత్వం వహించి నిర్వహించారు.కాన్సెప్ట్ అభివృద్ధి, పాలిమర్, జీవపదార్ధ పరిశోదన ప్రాజెక్టుల కార్యక్రమాలు, విద్యా కోర్సులు, పరిశ్రమ స్పాన్సర్ కెమిస్టులు మరియు విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులకు వర్కుషాపుల అమలుకు డాక్టరు పాండురంగారావు పాత్ర ఎంతో ఉంది.

ఆయనకు పాలిమర్స్, బయో పదార్థాల్లో, డ్రగ్ విడుదల సిస్టమ్స్ నియంత్రణ విబాగలలో అనేక సంవత్సరాల పరిశోధనానుభవం ఉంది.డాక్టరు పాండురంగారావు ఆయన పరిశోదించిన అంశాలపై పలు రివ్యూ వ్యాసాలు, మరియు అంతర్జాతీయ పుస్తకాలు నాలుగు అధ్యాయాలు, (210 రీసెర్చ్ పేపర్స్) అనేక పత్రాలు మరియు పుస్తకాలు ప్రచురించారు.

ఆయన ఇంకా నిర్దిష్ట టెక్నాలజీలపై రెండు అమెరికా, మూడు యూరోపియన్ పేటెంట్స్, మూడు కెనడా, మరి రెండు భారత పేటెంట్స్ పొందారు.అంతే గాదు ఆయన నేషనల్ సైన్స్ పౌండేషన్ (అమెరికా), డిపార్టుమెంటు అఫ్ సైన్స్, బయో టెక్నాలజీ (ఇండియా) విబాగాల గ్రాంటు ప్రతిపాదనలకు ఆయన కూడా ఒక సమీక్షడుగా వ్యవహరించారు.

ఇంకా అనేక అంతర్జాతీయ పత్రికలకు సమీక్షలుగా పని చేసారు.

ఇంకా సాధించిన విశేషాలు

  • ఇంగ్లాండు దేశానికి చెందిన గ్లాస్గో స్ట్రాతక్లైడ్ యూనివర్శిటీ నుండి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందారు.
  • అమెరికాలోని యూనివర్శిటీ ఆప్ సదర్న్ కాలిపోర్నియో , లాస్ ఏంజెల్స్ లో విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేసారు.
  • జర్మనీలోని అల్ఫ్గాంగ్ గొయితే యూనివర్శిటీలో విజింటింగ్ సైంటిస్టుగా పని చేసారు.
  • రాయల్ ఇన్స్టిట్యూట్ అఫ్ కెమిస్ట్రీ (లండన్), కంట్రోల్డ్ రిలీజ్ సొసైటీ ఇన్ కార్పోరేషన్ (అమెరికా), నందు సభ్యులు.
  • మన బారతదేశానికి చెందిన సొసైటీ పర్ బయో మెటీరియల్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఆర్గన్స్, ఇండియన్ పార్మాష్యూటికల్
  • ఆసోసియేషన్, సొసైటీ ఫర్ పాలిమార్ సైన్స్, సంస్ధలలో లైఫ్ మెంబర్సు.
  • అమెరికన్ కెమికల్ సొసైటి, (అమెరికా), జహీర్ సైన్స్ ఫౌండేషన్, (ఇండియా) సంస్ధల సభ్యులు.
  • డాక్టరు పాండురంగారావు మార్గనిర్దేశం (గైడెన్స్) లో ముప్పది మూడు మంది శాస్త్రజ్ఞులు పి.యచ్.డి. చేసారు. షుమారు వందకు పైగా ఫోష్టు గ్రాడ్యేషన్ విద్యార్ధులు పలు ప్రాజెక్టులు చేసారు. ఇది చాలా ఘనమైన విషయం.
  • ఆయన పరిశోధనలో 210 పైగా రీసెర్చ్ పత్రాలు అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇది చాలా అరుదైన విషయం.
  • ఇంకా డాక్టరు పాండురంగారావు తొంబైకు పైగా జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో, పలుసార్లు ఆలిండియా రేడియోలో విజ్ఞాన ప్రసంగాలు చేసారు.

సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (C L R I) లో ఆయన 34 సంవత్సరాలు పని చేసి చివరగా అత్యుత్తమ హోదాలో జాయంట్ డైరక్టరు స్థాయి సైంటిష్ట్ గా పదవీ విరమణ చేసారు.

కుటుంబ సభ్యుల వివరాలు.

mr-mrs-pandurangarao-with-family-members

డాక్టరు పాండురంగారావు, రత్నకుమారి దంపతుల సంతానం ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. శ్రీదేవి, శ్రీవేద, శ్రీరాజశేఖర్

డాక్టరు పాండురంగారావు కుమారుడు రాజశేఖర్ తో కలసి 2002 లో ‘స్పార్క్ బయోటెక్ కంపెనీ’ ని అమెరికాలో మరియు మన భారతదేశంలో స్ధాపించారు. ఆ కంపెనీకి చీఫ్ ఎక్జిక్యూటివ్ అపీసరు మరియు చైర్మెన్ గా కొనసాగుచున్నారు.

koritala-rajasekher-familyకుమారుడు రాజశేఖర్ యం.బి.ఎ మరియు యం.యస్. చేసారు.

అమెరికాలో INFOGIX సాప్టువేర్ కంపెనీ  వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించుచున్నారు.

రాజశేఖర్ అమెరికా దేశానికి చెందిన రేచల్ (శ్రీభవ్య) పి.యచ్.డి. ని భారతీయ సంప్రదాయం ప్రకారం 13.08.1995 న వివాహమాడారు.శ్రీభవ్య మెటీరియల్ సైన్స్ సైంటిస్ట్ గా పని చేయుచున్నారు.

శ్రీభవ్య (రేచల్) రాజశేఖర్ తో వివాహమైన అనతి కాలంలోనే బారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఆకళింపు చేసుకుని గౌరనించుట చాలా విశేషం. ఈ దంపతుల సంతానం ఇద్దరు కుమార్తెలు ఆషా, షహనా. కుమార్డు నీల్,

పొనుగుపాడు గ్రామంలో మొదటిసారిగా విదేశి వనితను వివాహమాడిన ఘనత కొరిటాల మస్తానురావు చౌదరి, నారాయణమ్మ దంపతుల మనమడు కొరిటాల రాజశేఖర్ కు దక్కింది.

dr-sreedevi-dr-sureshమొదటి కుమార్తె డాక్టరు శ్రీదేవి వివాహం కృష్ణా జిల్లాకు  చెందిన చలసాని కుటుంబరావు, వనజాక్షి దంపతుల ద్వితీయ కుమార్డు సురేష్, పి.యచ్.డి. తో(అమెరికా) 01.07.1991 న జరిగింది.

డాక్టరు శ్రీదేవి వైద్యవృత్తిలో, అల్లుడు సురేష్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మరియు కంప్యూటర్ ఇంజనీరుగా అమెరికాలో ఉంటున్నారు. ఈ దంపతుల సంతానం ఒక కుమార్తె గీతికాశాయి.

dr-sreevedadr-sambasivaraoరెండవ కుమార్తె శ్రీ వేద యం.యస్. అమెరికాలో చదివింది. గుంటూరుకు చెందిన బొల్లు వెంకటేశ్వర్లు, సామ్రాజ్యం దంపతుల మొదటి కుమార్డు సాంబశివరావుతో 13.06.1993 న జరిగింది.

శ్రీవేద మాలిక్యులార్ బయాలజీ సైంటిస్ట్ గా, అల్లుడు సాంబశివరావు డాక్టరుగా అమెరికాలో ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె సులేఖ.

ఫొటో గ్యాలరీ

[/vc_column_text][/vc_column][/vc_row][vc_row][vc_column][vc_media_grid element_width=”3″ item=”basicGrid_SlideFromLeft” grid_id=”vc_gid:1486224213922-b94963ce-8a22-8″ include=”9387,9380,9379,9378,9377,9375,9386,9383,9388″][/vc_column][/vc_row]

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *