ఆంజనేయస్వామి దేవాలయం సందర్శించిన కోడెల.

విశేషాలు

మన పొముగుపాడు గ్రామంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా నేను ఉన్నానూ అంటూ, ప్రతి కార్యకమానికి విచ్చేసే, మన గ్రామ ప్రజలకు అంత్యంత ఆప్తుడు, మన రాష్ట్ర శాసన సభాపతి డాక్టరు కోడెల శివప్రసాదరావు గారు అనివార్య కారణంల వలన దేవాలయాల ప్రతిష్ట మహోత్సవమునకు రాలేక పోయిన సంగతి మనకందరుకు తెలుసు.

 ఆ రోజు అభిమానులు పడిన నిరుత్సాహం తొలగించుటకు ది.23.05.2017న జరిగిన స్వామివారి పదహారు రోజుల పండగ మహోత్సం సందర్బంగా జరిగిన కార్యక్రమానికి డాక్టరు కోడెల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్దకు ఎదురేగి గ్రామ టి.డి.పి.అధ్యక్షులు రత్తయ్య, దేవాలయాల ట్రష్టు బోర్డు చైర్మెన్లు తులసీధరరావు, కామినేని రామారావు, పాపారావులు, మెట్రో వార్త డైలీ ఎడిటర్ క్రోసూరి సుబ్బారావు, అభినయ శ్రీనివాస్, టి.డి.పి.యువ నాయకులు ఆలోకం శ్రీనివాసరావు, యర్రమాసు శ్రీనివాసరావు, కోమటినేని వీరయ్య, యర్రమాసు నాగేశ్వరరావు గ్రామ పెద్దలు, తదితరులు మేళతాళాలుతో, బాణాసంచా పేలుస్తూ, యువత బైకు ర్యాలితో స్వాగతం పలికి ఊరేగింపుగా తోడ్కొని వచ్చారు.

ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు, పురోహితులు పూర్ణకుంభంతో సభాపతి డాక్టరు కోడెలకు స్వాగతం పలికారు. దేవాలయాలలో స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చక బృందం డాక్టరు కోడెలకు స్వామి వారి ప్రసాదాన్ని అందించి ఆశీర్వదించి సత్కరించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పొనుగుపాడు దేవాలయాల సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అదికారులు, అనధికారులు డాక్టరు కోడెలను ఘనంగా సత్కరించారు.

అనంతరం డాక్టరు కోడెల మాట్లాడుతూ ఈ గ్రామ ప్రజలుతో నాకు నలబై సంవత్సరంల నుండి మంచి అనుబంధం ఉందని చెప్పారు.ఈ గ్రామంలో ఉన్న ఆధ్యాత్మిక స్పూర్తితోనే ఆయన కోటప్పకొండను అభివృద్ధి చేసానని చెప్పారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో  బలరామకృష్ణయ్య , ఆలయ కమిటీ చైర్మెన్ తులసీధరరావు, పాలకవర్గ సభ్యులు,  ఉన్నత చదువులు చదివి నేడు దేశ, విదేశాలలో ఉన్న డాక్టర్లు, యన్.ఆర్.ఐ.లు, ఇంజనీర్లు, అనేక మంది పెద్ధలు, యువత ప్రతి అభివృద్దిలో మేము ఉన్నామంటూ ఈ గ్రామస్తులుగా ఉండటం వలనే అపూర్వమైన ఆలయాలు నిర్మించి, గ్రామాన్ని ఒక అధ్యాత్మిక గ్రామంగా తీర్చిదిద్దారని అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవరావు, యం.పి.టి.సి. సభ్యులు అమరయ్య, వంకాయలపాటి బలరామకృష్ణయ్య, బొల్లేపల్లి సత్యనారాయణ, క్రోసూరి రామ కోటేశ్వరరావు, శ్రీ ఆంజనేయస్వామి మాజీ ట్రష్ఠు బోర్డు చైర్మెన్లు కొంగర జగన్నాధం, దాడి రాధాకృష్ణ, క్రోసూరి వెంకటరావు, యామాని రామారావు, యర్రమాసు బ్రహ్మయ్య, ఇంకా తదితర గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్‌  జె.పార్దసారధి, శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ఇ.ఓ. వెంకటరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Check Also

భారతదేశంలోని లోకసభ నియోజకవర్గాలు

constituencies of the Lok Sabha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *