ప్రేమికుల దినోత్సవ సందర్బంగా
- ప్రేమంటే రెండు మనస్సుల కలయిక కాదు.రెండు కుటుంబాల వారధి ముఖ్యం.
- ప్రేమ వివాహాలు అర్థిక ఇబ్బందులుకు ఆహ్వానం చెపుతాయి. పర్వాలేదు,మేము ఉన్నాం అని హామీ ఇస్తాయి.
- ప్రేమంటే స్యార్ధం కోసం పెద్దలను ఎదిరించడం కాదు….ఎన్నికష్టాలు భరించైనా వాళ్లను ఒప్పించడం ముఖ్యం. ప్రేమించిన తరువాత ఎవరైనా “నువ్వుంటే నాకు ఇష్టమే….కాని నీకోసం నన్ను ప్రాణంలా పెంచిన తల్లిదండ్రులను వదలుకోలేను” అని అనవచ్చు.
- ప్రేమంటే శారీరక స్పర్శ, ఆకర్షణ కాదు. అవగాహన, వివాహధర్మం.అందుకనే టైంపాస్ ప్రేమలు ఆపండి. పెళ్ళి చేసుకునే ధైర్యం ఉంటేనే ప్రేమించండి.
- “ప్రేమ పెండ్లిండ్లు” తప్పు లేదు గాని కొందరి మనస్సులో వివాహం అయిన తరువాత “నిను చూడక నేనుండలేను” అని అన్నవారే “నువ్వు లేకపోతే ఎంత బావుండు” అనే వరకు వచ్చేస్తారు.
- పెద్దలు కుదిర్చిన వివాహాలు ఒకటి రెండు తప్పితే చాలావరకు స్ధిరంగా, గౌరవప్రదంగా, సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
- అంతేగాదు కన్నవారికి సంతోషాన్ని కలిగిస్తూ వారి ప్రేమానురాగాలు మనపై మన బిడ్డలపై ఉంటూ మనకు రక్షణ,అభివృద్ది కలిగించేమాట వాస్తవం.
ప్రేమికుల అబద్ధాలు
- తొలి చూపు లోనే నువ్వు నచ్చావు.
(ఇంతకు ముందు ఓ అరడజను మందికి ఇలానే చెప్పి ఉంటాఢు). - ఈ డ్రెస్సులో ఎంత బావున్నావో…
( మనసులో పిప్పళ్ళ బస్తాలాగున్నావు). - కానీ ఇంట్లో వాళ్లు ఒప్పకోవడం లేదు. మనం మంచి స్నేహితులుగా మిగిలిపోదాం.
( ప్రేమా గీమా రామ్ రామ్)