మంచి మాటలు

నీతి వాక్యాలు, మంచి మాటలు వినడానికి బాగుంటాయి. కాని ఎక్కువ మంది పాటించరు.

అందుకే లోకంలో అధికంగా అవివేకులే కనిపిస్తారు.

 • కోటీశ్వరులు కావడం అందరికి సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే.
 • సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి.
 • ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కి అయినా సిద్ధపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి.
 • మనం మన అలోచనలకు బందీలం. అలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం.
 • గొడుగు వర్షాన్ని అపలేకపోవచ్చు.కానీ వర్షంలో తడిషిపోకుండా రక్షణ ఇస్తుంది.అలాగే అత్మ విశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు. కానీ విజయపధంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది.
 • బలవంతుడికీ బలహీనుడికి మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్ధంగా ఉన్నట్లు కాదు. బలవంతుడి పక్షం వహించనట్లే అనుకోవాలి.
 • అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం –ఈ ఐదు అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు.
 • అహంకారం ప్రతి ఒక్కరినుంచీ- ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది.
 • ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి.
 • నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చకలిగినా, రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించకోలేవు.
 • మంచివారు దూరం కావడం, చెడ్డ వారు దగ్గర కావడమే దుంఖానికి నిదర్శనం.
 • బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు.
 • కాళ్లు తడవకపండా సముద్రాన్ని దాటగలవు. కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేవు.
 • పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంతసాయం…ఇదే జీవితం.
 • ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతడవుతాడు, కానీ ఉన్నత పదవి వల్ల కాదు… శిఖరం మీద కూర్చొన్నంతమాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు.
 • తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే భాధ తగ్గుతుంది. కానీ అకలి భాధనూ, అజ్ఞాన భాధనూ ఎవరకి వారే తగ్గించుకోవాలి.
 • మెరుగు పెట్టకుండా రత్నానికి,- కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు.
 • కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి వక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది.
 • ఎవరి వయస్సుకు తగ్గట్టు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే అ వ్యక్తికి గౌరవం ఉంటుంది.
 • ప్రత్యేకత కావాలనుకున్నప్పుడు ముందు  పలకరించేది కష్టాలే. వాటిని అధిగమిస్తే జయం మనవెంటే.
 • ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంతవరకు  అర్థం కాదు….ఒకసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమైనా ఏమీ చేయలేం…..అదికాలమైనా…స్నేహితులైనా…. బంధువులైనా, చివరకి వస్తువులైనా…
 • భయపడి చెవులు మూసుకుంటే, గెలుపు కొట్టే తలుపు చప్పడు ఎలా వినిపిస్తుంది.
 • జీవితం ఒక ఆట వంటింది.మనం ఆడుతూ ఇతరులను గెలిచే నేర్పును అలవర్చుకోవాలి.(సంతరించుకోవాలి) ఇదే లోకం తీరు.
 • తెలివి గలవారు ఎప్పడూ కూడా ఇతరులు వైఫల్యం పొందినచోట నుంచి విజయాన్ని సాధించటం ప్రారంభిస్తారు.
 • ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.

  నిత్య సత్యాలు – నగ్న సత్యాలు

 • ఏ మనిషికైనా జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి… ఆ లక్ష్యసాధన కోసం అహర్నిశలు  కృషి చేసి సాధించాలి.
 • జ్ఞానం   లేకపోవడంకన్నా, శ్రద్ధలేకపోవడం ఎక్కువ ప్రమాదకరం.
 • మనిషి తన కలలును పండించుకోవాలంటే ముందు కళ్లు తెరవాలి.
 • పెద్దపెద్ద పనులకు ప్రణాళికలు తయారుచేస్తూ కూర్చోవడంకంటే చిన్నచిన్న పనులను పూర్తి చేసుకోవడం ఉత్తమం.
 • వివేకం గెలవలేనిచోట సహనం విజయాన్ని అందించవచ్చు.
 • సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే.
 • పశుబలమే శక్తికి చిహ్నం అయితే మగవాడే బలవంతుడు. అలాకాక బలమన్నది నైతికమూ మానసికమూ అయితే నిస్సందేహంగా మహిళలే శక్తి స్వరూపులు.
 • జీవించే ప్రతి దశలో మనం ఎదుగుతూ పోవాలి. కొత్తపని చేయాలనుకున్నవారు సమస్యలు ఎదుర్కోవడం సహజం.
 • నవ్వుతూ ఉండటంవలన జీవితాన్ని బాగా అస్వాధించవచ్చు….  కానీ ….భాధతో ఏడ్చినప్పుడే జీవితాన్ని అర్థం చేసుకోగలం.
 • ఇతరుల దోషాలను చూసినట్లు మన దోషాలను చూసుకోగల్గితే .. ఈ ప్రపంచంలో చెడే ఉండదు.
 • దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరమవుతున్నారు.
 • ఉన్నదానితో సంతృప్తి చెందడం గొప్ప విషయమే! అయితే నీ అర్హతకు తగింది సాధించే ప్రయత్నం మానకు.
 • అందరినీ మెప్పించలేం. కానీ, అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఒప్పించడం సులభం.
 • కోపం మనల్నే నష్టపరుస్తుంది. తెలివి ఎదుటివాడిని నష్టపరుస్తుంది.

 మంచి మాటలు మనిషి సుఖ జీవితానికి సోపానాలు

 • ఎక్కువగా మాట్లాడేవారిలో వాక్శుద్ధి, జ్ఞానశక్తి నశిస్తాయి.
 • ఎవ్వరూ చూదలేదని తప్పు చేయకు. అందరూ చేస్తారని అప్పు చేయకు. జీవితంలో రెండు  పెద్ద ముప్పే నీకు.
 • ఏళ్ల తరబడి నీళ్లలోనే ఉన్న రాయి మెత్తబడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు అత్మ విశ్వాసం కోల్పోడు.
 • మన లోపాలను మనం తెలుసుకోవడం అన్నింటి కన్నా పెద్ద చదువు.
 • కోపం చేతల్లో కాదు,మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఉండాలి.
 • అందరికీ సమాన సామర్థ్యం ఉండక పోవచ్చు. కానీ సామర్థ్యాన్ని మెరుగు పరచుకునే అవకాశాలు అందరికీ సమానమే.
 • అబద్ధాలు చెపితే…. అబద్ధాల వెనక నువ్వు పరుగెత్తాలి. నిజాలు చెపితే…. నీ వెనుక నిజం పరుగెత్తికొస్తుంది.
 • చెడ్డవాడు ముందు సుఖపడతాడు., కానీ ఓడిపోతాడు. మంచివాడు ముందు కష్టపడతాడు కానీ ఓడిపోడు.
 • అన్నం పారేయడానికి ఒక నిమిషం చాలు. పంట పండించదానికి నెలలు, సంవత్సరాలు కావాలి.
 • మనం సంపాదించుకున్నది ఉత్తమ సంపాదన, తల్లిదండ్రులు ఇచ్చేది మధ్యమ సంపాదన, ఇతరులను మోసం చేసి గడించేది నీచ సంపాదన.
 • తనని తాను విశ్లేషించుకుంటూ, పొరపాట్లును సరిచేసుకుంటూ, ముందుకు సాగే వ్యక్తి త్వరగా అనుకున్నది సాధిస్తాడు.
 • వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే.
 • ఎదుటినారిని చూసి  ప్రేమగా నవ్వగలిగితే అదే  వారికి నువ్విచ్చే అందమైన బహుమతి.
 • కోపగించుకోవడమంటే ఇతరుల పొరపాట్లకు మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం.
 • ఎవరూ చూడట్లేదని తప్పచేయకు, అందరూ చేస్తున్నారని అప్పచేయకు, అవి రెండు జీవితంలో పెద్ద ప్రమాదం.
 • సమయాన్ని సరిగా వినియోగించులేని వ్యక్తులు ఏ రంగంలోను విజయం సాధించలేరు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *