తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యం,పి.టి.సి. గా గెలుపొందారు.
గుంటూరుజిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు యం.పి.టి.సి పదవికి (బి.సి రిజర్వేషను) ది.11.03.2014 న జరిగిన సాధారణ ఎన్నికలలో బొట్ల అమరయ్య తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు.
తన స్వంత అన్న, వై.యస్.ఆర్.సి. పార్టీ అభ్యర్థి బొట్ల ఆదినారాయణపై 186 ఓట్ల ఆధిక్యతతో యం.పి.టి.సి. అభ్యర్ధిగా అమరయ్య గెలుపొందారు.
ఆయన ఫిరంగిపురం మండలపరిషత్ కార్యాలయంలో ది.04.07.2014న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసారు.
అమరయ్య తండ్రి కోట్లింగం, తల్లి సుబ్బమ్మ. వయసు 48 సం.ములు. వృత్తి వ్యవసాయం.
ఈ సందర్బంగా వార్కి www.manaponugupadu.com తరుపున శుభాకాంక్షలు.