వివాహ స్వర్ణోత్సవం జరుపుకున్న దంపతులు
నాగేశ్వరరావు 10.10.1945 న పొనుగుపాడులో జన్మించారు.తండ్రి రామకృష్ణయ్య, తల్లి తులిశమ్మ.
పూర్వీకుల స్వగ్రామం గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, కోమెరపూడి. తాత వెంకట్రాయుడు, నాయనమ్మ భద్రమ్మ.
గుంటూరు జిల్లా, మాదల గ్రామానికి చెందిన గోగినేని వెంకటసుబ్బారావు, అదెమ్మ దంపతుల ప్రథమ కుమార్తె నాగమల్లేశ్వరి ( పెద్దమ్మ మనవరాలు) ను 09.06.1966న వివాహమాడారు.
ఈ దంపతుల సంతానం ఇద్దరు కుమారులు. శ్రీపతిరావు, శ్రీరామచంద్.
సంసార సాగరంలో అన్ని ఒడిదుడుకులను ఎదురొడ్డి యాబై సంవత్సరాలు సుదీర్గ ప్రయాణం చేసిన అదర్శ దంపతులు.
సంసారంలో ఒడిదుడుకులెక్కువ.అందుకనే సంసారాన్ని కల్లోల కడలితో పోలుస్తుంటారు.ఆ ఒడిదుడుకులను నాగేశ్వరరావు, నాగమల్లేశ్వరి దంపతులు ఆప్యాయతా అనురాగాలు అనే నౌకతో ఇప్పటికి యాభై సంవత్సరాల సుదీర్గ ప్రయాణం సాగించారు. 2016 జూన్ 9 వ తేదిన కుమారులు, కోడళ్లు ఈ దంపతులకు ఘనంగా వివాహ స్వర్ణోత్సవ వేడుకలు జరిపారు.
నాగేశ్వరరావు ప్రాథమిక విద్యాభ్యాసం పొనుగుపాడు హిందూ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. అటు తరువాత ఉన్నత పాఠశాల విద్య పొనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు.అటు పిమ్మట గుంటూరు AC కాలేజిలో P U C చదివారు. (1961-62). దరిమిలా ఒక సంవత్సరం పొనుగుపాడులోఖాళీగా ఉన్నారు. తరువాత అంద్ర క్రిష్టియన్ కళాశాల గుంటూరులో B.Sc., చదివారు. (1963-66)
భారతమాత యువజన సంఘం స్ధాపకుడు
1962-63 లో ఖాళీగా నున్న సమయంలో పొనుగుపాడు గ్రామానికి చెందిన సరికొండ వెంకట కృష్ణమరాజు, గ్రామ అభివృద్ధి అధికారిగా ప్రోద్బలంతో గ్రామంలోని యువకులను సమీకరించి “భారతమాత యువజన సంఘం” ను వారి ఆధ్వర్యంలో స్థాపించి, ప్రెసిడెంటుగా వ్యవహరించారు.
ఆ సమయంలోనే పొనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పక్కా గదులు నిర్మాణానికి గ్రామంలోని పెద్దల సహకారంతో యువజన సంఘం తరుపున చందాలు వసూలు చేసి, ఇసుక రవాణాకు సహాయ సహకారాలు అందించారు.అంతేగాదు సంఘం తరుపున శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించి ఉన్నత పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించారు. ఫలితంగా ఉన్నత పాఠశాలకు పక్కా గదుల నిర్మాణం జరిగినది
బి.యస్.సి., చదువుతూనే గ్రామంలోని రాజకీయాలలో క్రియాశీలకపాత్ర వహించారు.వంకాయలపాటి శివరామకృష్ణయ్య గ్రామ పంచాయితీ సర్పంచ్ గా 1964 మరియు 1970 లో పోటి చేసారు.శివరామకృష్ణయ్య ఆ ఎన్నికలలో రెండుసార్లు గెలుపొందుటకు, నాగేశ్వరరావు ఆయన సలహాలు, సూచనలతో తన వంతు క్రియాశీలకపాత్ర వహించారు.
అంతేగాదు 1969 లో తుఫాను సందర్బంగా గ్రామంలో ఇండ్లు పడిపోయినవి. పడిపోయిన ఇండ్లకు ప్రభుత్వం నష్ఠ పరిహారం ప్రకటించింది.నష్టపరిహారం చెల్లింపు సమయంలో ప్రభుత్వ అధికారులు తగ్గించి ఇస్తూ, పూర్తి నష్ట పరిహారం చెల్లించినట్లుగా బాదితుల సంతకాలు సేకరించుచున్నారు.
ఆ తంతును వీరు పసిగట్టారు. వెంటనే తన ముఖ్య స్నేహితుడు గ్రామ కరణం రమణయ్య ద్వారా జాబితాలు గోప్యంగా పొందారు. జాబితాల ప్రకారం మోసపోయిన లబ్ది దారులను గుర్తించారు.అధికారుల అవినీతిని అప్పటి సర్పంచ్ శివరామకృష్ణయ్య దృష్టికి తీసుకు వెళ్లి బహిరంగపరిచారు. దాని పర్యవసానంగా బట్వాడా నిలిపివేసారు.
నాగేశ్వరరావు కృషి వలన ఉన్నతాధికారుల విచారణ జరిగింది. ఆ తరువాత సర్పంచ్ శివరామకృష్ణయ్య సమక్షంలో తిరిగి పూర్తి నష్టపరిహారం సొమ్ము బాదితులకు సక్రమ పంపిణి జరిగింది. వీరిది మొదటి నుండి సమాజంనకు మంచి జరిగే పనులపై ఆసక్తి కనపరిచే వ్యక్తిత్వం.
హైదరాబాదు, కూకటపల్లి పరిధిలోని వసంతనగర్ ఏర్పాటుకు కారకుడు
వీరు హైదరాబాదు బాలానగర్ లో నున్న I D P L లో 14.06.1971 న గ్రేడు -1 ఆఫరేటరు (ప్రొడక్షను ప్లాంటు) గా చేరారు. 1982 నుండి సూపర్ వైజరుగా 1992 వరకు పనిచేసారు. తదుపరి పదోన్నతిపై అసిస్టెంట్ ఫోర్ మెన్ గా 1999 వరకు పనిచేసారు. మరలా ప్రొడక్షన్ ఎక్ఝిక్యూటివ్ గా పదోన్నతి పొందారు.
ఆ పదవిలో 2003 వరకు పని చేసారు. ఆ దరిమిలా కొంతకాలానికి ప్రభుత్వం I D P L ను ఖాయిలా పడ్డ సంస్థ గా ప్రకటించింది. అందరితో పాటు వీరు వాలంటరీ రిటైర్మెంటు అయ్యారు.వీరు I D P L లో పని చేసే సమయంలో ఐ.డి.పి.యల్ ఎంప్లాయీస్ కో-అఫరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటి లిమిటడ్ స్ధాపకులలో నాగేశ్వరరావు ఒకరు. 1985 నుండి 1990 వరకు ట్రెజరర్ గా పనిచేసారు. ఆ తరువాత 1990 నుండి 1996 వరకు సెక్రటరీ గా చేసారు.
ఐ.డి.పి.యల్ ఎంప్లాయీస్ కో-అఫరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటి లిమిటడ్ తరుపున బాలానగర్ మండలం, హైదర్ నగర్ విలేజి పరిధిలో సర్వే నెం.రు 145 లో సభ్యుల ఇండ్ల నిర్మాణంనకు 1981 లో య.90.00 లు ల్యాండును కొనుగోలు చేసారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు 1987 లో పొందారు.వీరు సెక్రటరీగా వ్యవహరించిన కాలంలో ఇండ్ల నిర్మాణంనకు ఆంద్రప్రదేశ్ స్టేటు కో-ఆఫరేటివ్ హౌసింగ్ సొసైటి ఫెడరేషన్ ద్వారా హౌసింగు లోన్లు యిప్పించారు. అంతేగాదు సిమ్మెంటు సొసైటి ద్వారా నేరుగా ప్యాక్టరీ నుండి మార్కెటు రేటు కంటే తక్కువ రేటుకు సప్లై చేయించారు.
నిరంతరం వసంతనగర్ అభివృద్దికి పాటుపడే వ్యక్తి
ఆ కాలనీకి వసంతనగర్ పేరు పెట్టారు. వసంతనగర్ లోవాటరుట్యాంకు, ర్రిక్రియేషన్ సెంటరు, షాపింగు కాంప్లెక్స్ నిర్మించారు. ఇండ్లకు మంజీరా వాటరు కనెక్షన్లు మంజూరు చేయించారు. అప్పటి వరకు బోరువెల్ వాటరుతో పడుచున్న ఇబ్బందులు తొలగించారు.వసంతనగర్ లో ఇంకనూ శివాలయం, రామాలయం, కమ్యూనిటి హాలు నిర్మాణంలో నాగేశ్వరరావు కృషి ఎంతో ఉంది.
కొంతకాలం ఇతరులకు అవకాశం కల్పించాలనే భావనతో పాలకవర్గ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పదవిలో లేకపోయుననూ, రెవిన్యూ అధికారులు అక్రమంగా సొసైటి ల్యాండుపై పెట్టిన భూ ఆక్రమణ కేసులను ఎదుర్కొనులో మరియు తగిన సమాచారం లాయర్లుకు అందించుటలో వీరి పాత్ర ఎంతో ఉంది
కేసు గెలిచిన సందర్బంగా సర్వే నెం.రు 145 & 163 లో నున్న ఐదు సొసైటీల పాలక వర్గంలు వీరిని, లాయర్లును సన్మానించారు. తిరిగి కొంత కాలం తరువాత 2008 “మే” నుండి 2014 “మే” వరకు ప్రసిడెంటుగా వ్యవహరించారు.2015 మే 30 న ఈ సొసైటిని ఐ.డి. పి.యల్ ఎంప్లాయీస్ కో-అఫరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటి లిమిటడ్, మరియు ఐ.ఢి. పి.యల్ ఎంప్లాయీస్ కో-అఫరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటి లిమెటడ్ వెంచర్ -2 గా సభ్యులు కోరికపై విభజించారు.
ఐ.డి.పి.యల్ ఎంప్లాయీస్ కో-అఫరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటి లిమిటడ్ (వసంత నగర్) కు ఎన్నికలు జరిగే వరకు “అడహాక్ చైర్మెన్” గా వ్యవహరించారు.
ప్రెసిడెంట్, ఐ.డి.పి.యల్ ఎంప్లాయీస్ కో-అఫరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటి లిమిటడ్
తిరిగి వెంచర్ 1 కు 28.08.2014 గురువారం జరిగిన ఎన్నికలలో నాగేశ్వరరావు ప్యానల్ లో తొమ్మిది మందికి గాను ఎనిమిది మంది గెలుపొందారు. 30.08.2014 శనివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో వీరు రెండవసారి ప్రెసిడెంటుగా ఎన్నికై ప్రస్తుతం కొనసాగుచున్నారు.
శ్రీపతిరావు నిజాంబాద్ జిల్లా, బోధన్ గ్రామానికి చెందిన రెడ్డిమాసు యోగయ్య, రాఘవమ్మ దంపతుల ద్వితీయ కుమార్తె మమతను వివాహమాడాడు. ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నారు.ఈ దంపతులకు ఒక కుమార్డు శ్రీ అనిష్.
చిన్న కుమారుడు శ్రీరామచంద్ హైదరాబాదుకుచెందిన పోతరాజు శివరామకృష్ణ , శివకుమారి దంపతుల ప్రథమ కుమార్తె శ్రావణిని వివాహమాడాడు.ఈ దంపతులు ఇద్దరు అమెరికాలో సాప్టువేర్ ఇంజనీర్లుగా 2015 వరకు పనిచేసారు.
తిరిగి మాతృదేశానికి వచ్చి హైదరాబాదులో స్దిరపడ్డారు.లోగడ పనిచేసిన కంపెనీ నందే సాప్టువేర్ ఇంజనీర్లుగా పనిచేయుచున్నారు. ఈ దంపతుల సంతానం శ్రీవిధురిత్విక్, శ్రీవిశ్వ.[/vc_column_text][/vc_column][/vc_row]