పూర్వీకుల వివరం
పూర్వీకుల స్వగ్రామం గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, కోమెరపూడి. వీరి మూల పురుషుడు రామయ్య.గోత్రం అయోధ్య.
ఈయన భార్య రోశమ్మ.ఈమె గుంటూరు జిల్లా, ముప్పాళ్ళ మండలం, పలుదేవర్లపాడు గ్రామానికి చెందిన నలబోతువారి ఆడపడుచు.
రామయ్య, రోశమ్మ దంపతుల ప్రధమ కుమార్డు వెంకట్రాయుడు. ఈయన భార్య భద్రమ్మ. ఈ దంపతుల సంతానం ఏకైక కుమార్డు రామకృష్ణయ్య. కుమార్తెలు సరసమ్మ,సుదేష్ణమ్మ.
రామకృష్ణయ్య పొనుగుపాడు గ్రామానికి చెందిన నంబూరు రామచంద్రయ్య కుమార్తె రామ తులిశమ్మను వివాహమాడారు.రామకృష్ణయ్య మొదటి తోబుట్టవు సరసమ్మ వివాహం పమిడిపాడు గ్రామానికి చెందిన కొబ్బరి రాఘవయ్యతో జరిగింది.రెండువ తోబుట్టువు సుదేష్ణమ్మ వివాహం సత్తెనపల్లి మండలం, కట్టావారిపాలెం గ్రామానికి చెందిన పుట్టా చలమయ్యతో జరిగింది.
కోమెరపూడి నుండి పొనుగుపాడు వలస వచ్చారు.
కోమెరపూడి నుండి రామకృష్ణయ్య పొనుగుపాడు రావటానికి కారణం తెలియాలంటే కొద్దిగా వెనక్కు వెళ్ళక తప్పదు.
రామకృష్ణయ్య మామ నంబూరు రామచంద్రయ్య పూర్వీకుల స్వగ్రామం యడ్లపాడు మండలం, లింగారావుపాలెం. ఆయన పొనుగుపాడు గ్రామానికి చెందిన జంపని వారసులలో ఒకరైన వంకాయలపాటి నారయ్య కుమార్తె వెంకటలక్ష్మమ్మను వివాహమాడారు. ఈదంపతులు లింగారావుపాలెం నుండి పొనుగుపాడులో వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.రామచంద్రయ్య వెంకటలక్ష్మమ్మ దంపతుల సంతానం ఇద్దరు కుమారులు నారయ్య, దేశయ్య.కుమార్తెలు ముగ్గురు.భారతమ్మ, రఘునాధమ్మ, రామ తులిశమ్మ.చివరి సంతానం దేశయ్యకు జన్మనిచ్చిన కొద్ది కాలానికి రామచంద్రయ్య భార్య వెంకటలక్ష్మమ్మ కాలం చేసింది. అప్పటికి తన సంతానంలో ఎవరికి వివాహాది కార్యక్రమాలు జరుగలేదు.
రామచంద్రయ్య సంతానం బాగోగులు
సంతానం బాగోగులు, వివాహాది కార్యక్రమాలు భారం, బాధ్యత బావమరుదులు వంకాయలపాటి పెద్దయ్య,రత్తయ్యలపై పడింది.రామచంద్రయ్య అత్త రోశమ్మ, బావమరుదుల సహకారంతో తన సంతానం ఐదుగురిని పెంచారు. వివాహాది శుభ కార్యాలు నెరవేర్చాడు.నారయ్య వివాహం పెద మేనమామ వంకాయలపాటి పెద్దయ్య ప్రధమ కుమార్తె అన్నపూర్ణమ్మతో జరిగింది. ఆ దంపతులకు మగ సంతానం లేని కారణంగా నారయ్య ఇల్లిటం అల్లుడుగా వెళ్లారు.
రెండవ కుమార్డు దేశయ్య వివాహానికి ముందే వైద్య ఆరోగ్యశాఖ నందు ఉద్యోగంలో చేరారు.గుడివాడకు చెందిన సూరపనేని వారి ఆడపడుచు అన్నపూర్ణమ్మను వివాహమాడారు. ఉద్యోగం వలన దేశయ్య పరాయి ప్రదేశాలలో నివశించక తప్పలేదు.
ఈ నేపద్యంలో రామచంద్రయ్య నివశించటానికి బావ మరుదులు వంకాయలపాటి పెద్దయ్య, రత్తయ్యలు జాయంటు కుటుంబంగా ఉన్నప్పడే పడమర బజారులో డాబా ఇంటిని నిర్మించారు.రామచంద్రయ్య బాగోగులు చూడటానికి కోమెరపూడి గ్రామం నుండి రామకృష్ణయ్య, తులిశమ్మ దంపతులను పొనుగుపాడు గ్రామం తీసుకువచ్చారు.
రామకృష్ణయ్య, తులిశమ్మ దంపతుల సంతానం
అప్పటి నుండి రామతులిశమ్మ తండ్రి రామచంద్రయ్య, మామ వెంకట్రాయుడు బాగోగులు ఇద్దరూ కాలం చేసేవరకు చూసింది.
రామతులిశమ్మ తండ్రి రామచంద్రయ్యతో కలిసే ఉండుట వలన గ్రామంలో రామకృష్ణయ్య, తులిశమ్మ దంపతులను కూడా నంబూరు రామకృష్ణయ్య, నంబూరు తులిశమ్మ అనే వాడుక చాలా కాలం వరకు ఉంది.
తులిశమ్మకు తోబుట్టువులు మిగతా వారి మీదకంటే తమ్ముడు దేశయ్య, మరదలు అన్నపూర్ణమ్మల మీద మమకారం ఎక్కువ.చివరగా దేశయ్య మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్ రీజనల్ డైరెక్టరుగా 1972 వరకు గుంటూరులో పదవీ విరమణ పొందారు.
దేశయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు పదవీ విరమణ తదుపరి కుమారులు, కుమార్తెలు దగ్గర కొంతకాలం అమెరికాలో నివశించారు.ఆ తదుపరి తిరిగొచ్చి పొనుగుపాడులో అక్క రామతులిశమ్మతో కొంతకాలం కలసి ఉన్నారు.
వెంకట్రాయుడుకు బ్రిటీసు ప్రభుత్వం అందచేసిన ప్రసంసాపత్రం
ఇక రామకృష్ణయ్య తండ్రి వెంకట్రాయుడు విషయానికి వస్తే వృత్తి వ్యవసాయం. ఈయన వ్యవసాయంలో దిట్ట.
అంతేగాదు వెంకట్రాయుడు పేనిన గోగునార తాడును పైకి నిలబెట్టి పట్టుకుంటే కర్ర నిలబడినట్లు అలానే నిలబడటం ప్రత్యేకం.
అప్పటి మునసబు శలవులో ఉన్న కాలంలో కోమెరపూడి గ్రామానికి ఆక్టింగ్ మునసబుగా వెంకట్రాయుడు కొంతకాలం పనిచేసారు.
వెంకట్రాయుడు ఆకాలంలో కోమెరపూడి జనాభా లెక్కల సేకరణ సరిగా చేసినందుకు బ్రిటీసు గవర్నమెంటు నుండి ప్రశంసా పత్రం పొందారు.
గవర్నరు తరుపున,గుంటూరు జిల్లా కలెక్టరు ద్వారా జులై 1921న ప్రశంసాపత్రం అందచేసింది.
రామకృష్ణయ్య వృత్తి వ్యవసాయం. పంట పండినా పండక పోయినా చేను మాత్రం శుభ్రంగా ఉంచాలి అనే మనస్తత్వంగల వ్యవసాయ రైతు.
రామతులిశమ్మ మంచితనం
ఇక రామతులిశమ్మ పరోపకారం చేసే మనస్తత్వంగల గృహిణి. ఇరుగు పొరుగు వారికి డబ్బు అత్యవసరమై ఈమెను అడిగితే లేదనకుండా, తన దగ్గర లేకపోయినా వేరే వారి దగ్గర అడిగి తెచ్చి ఇచ్చేది.వేరుశెనగ పంట బాగా పండే ఆ కాలంలో సాయంత్రం చేటతో అవసరమైనన్నిశనగక్కాయలు తెచ్చి ఇంటి ఆవరణలో పాలేరు ద్వారా మంటతో కాల్చి, తింటానికి ఇరుగు పొరుగు వారిని పిలిచేది.
ఆ బజారులో ఎవరైనా జ్వరం, తలనొప్పి వచ్చి మందు బిళ్ళ మింగాలంటే కాఫీ కోసం ఈమె దగ్గరికి వచ్చేవారు.బంధువులు వచ్చినప్పుడు తను నివశించే బజారులో ఇరుగు పొరుగు వారికి పెరుగు, మజ్జిగ, కూరలు లేదనకుండా ఇచ్చేది.పొనుగుపాడు గ్రామానికి 1951లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతనంగా మంజూరైనది.
ఆ రోజుల్లో భోజన సదుపాయం గ్రామాల్లో ఉండేది కాదు.దూర ప్రాంతాల నుండి వచ్చి నివశించే ఉపాద్యాయులకు భోజనం వసతి కల్పించింది.అలాగే పొరుగు గ్రామమైన సాతులూరు విద్యార్థులు ఈదర రామారావు, తాళ్ళూరి వెంకటేశ్వర్లు, పాటిబండ్ల అంబుల చౌదరి మరి కొంత మందికి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సేవాభావంతో భోజనం పెట్టింది.
కొటేషన్: “ప్రస్తుతం మన సమాజంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణి పుచ్చుపట్టి పోతుంది”
రామకృష్ణయ్య, తులిశమ్మ దంపతుల సంతానం తిరపతిరావు, కమలమ్మ, సరోజనమ్మ, నాగేశ్వరరావు, రామారావు.
రామకృష్ణయ్య. తులిశమ్మ దంపతులకు ప్రధమ సంతానంగా జన్మించిన తిరుపతరావు బాల్యంలోనే టైఫాయిడ్ వ్యాధితో కాలం చేసాడు.రెండవ సంతానం కమలమ్మను పొనుగుపాడుకు చెందిన వంకాయలపాటి వీరయ్య, పిచ్చమ్మ దంపతుల ప్రధమ కుమార్డు కోట్లింగంతో ద్వితీయ వివాహం జరిగింది.
వివాహం జరిగి పది సంవత్సరంల కాపురం చేసిన తరువాత సంతానం లేదనే నెపముతో ఆమె అత్త పిచ్చమ్మ, తదితర కుటుంబ సభ్యులు భర్త కోట్లింగం దగ్గర ఉండకుండా చేసారు.కోర్టు ద్వారా భరణం పొందింది. నలబై సంవత్సరాల పైగా అప్పటి నుండి ఈమె పుట్టింటి జీవితం గడుపుతుంది.
మూడవ సంతానం సరోజనమ్మ వివాహం గుంటూరు జిల్లా, నరసరావు పేట మండలం, పమిడిపాడుకు చెందిన కొబ్బరి రాఘవయ్య, సరసమ్మ ఏకైక కుమార్డు రాములు ( మేనత్తోత కుమార్డు)తో జరిగింది.ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. వెంకటరావు, రాఘవరావు, రాజేంద్రప్రసాదు.
ఈదంపతుల ప్రధమ కుమార్డు వెంకట్రావు జననం నుండి అమ్మమ్మ తులిశమ్మ దగ్గరే పెరిగాడు.
వెంకట్రావు పొనుగుపాడుకు చెందిన వంకాయలపాటి చిన లింగయ్య, వెంకటలక్ష్మమ్మ (తులిశమ్మ అన్న నారయ్య ఏకైక కుమార్తె) దంపతుల ఆరువ కుమార్తె రమణకుమారిని 21.02.1981న వివాహమాడాడు.
ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం. వెంకట్రావు పొనుగుపాడులోనే పుట్టి , అక్కడే పెరిగి, అక్కడే చదివినందున కొబ్బరి వెంకట్రావుగా అందరికి పరిచయం .
వసంత్ నగర్ అభివృద్ధి కారకుడు
నాగేశ్వరరావు మాదల గ్రామానికి చెందిన గోగినేని వెంకటసుబ్బారావు అదెమ్మ దంపతుల ప్రధమ కుమార్తె నాగమల్లేశ్వరిని (పెద్దమ్మ మనవరాలు) 09.06.1966న వివాహమాడారు.
ఈ దంపతులకు వివాహం జరిగి యాభై సంవత్సరంలు నిండినందున కుటుంబ సభ్యులు 12.06.2016 న ఘనంగా స్వర్ణోత్సోవ వేడుకలు జరిపారు.నాగేశ్వ రరావు ఐ.డి.పి.యల్, హైదరాబాదు నందు 1971లో ఉద్యోగంలో చేరారు. ఐ.డి.పి.యల్. కంపెనీని ప్రభుత్వం ఖాయిలాపడ్డ సంస్థగా ప్రకటించింది.అందుమీదట స్వచ్చంధ పదవీ విరమణ పధకం క్రింద 2003లో పదవీ విరమణ చేసారు.1986 నుండి ఐ.డి.పి.యల్. ఎంప్లాయీస్ సొసైటి కోశాధికారి, కార్యదర్శి పదవులు 1996 వరకు నిర్వహించారు.
తిరిగి 2008 నుండి అధ్యక్ష పదవిలో 2014 “మే” వరకు కొనసాగారు. ఎన్నికలు జరిగే వరకు అడహాక్ చైర్మెన్ గా అధ్యక్షపదవికి కొనసాగారు.ది.30.08.2014 న జరిగిన ఎన్నికలలో కార్యవర్గం సభ్యులు తిరిగి వీరినే ప్రెసిడెంటుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కూకటపల్లి పరిధిలో ‘ఐ.డి.పి.యల్ ఎంప్లాయీస్ హౌస్ బిల్డింగ్ సోసైటీ’ తరుపున 100 ఎకరంలు భూమిని కొనుగోలు చేసారు.ఆ భూమిని సొసైటి ద్వారా అభివృధ్ది చేసి సంఘ సభ్యులకు అప్పగించుటలో నాగేశ్వరరావు పాత్ర ఎంతో ఉంది.కూకటపల్లి పరిధిలో వీరి కృషి వలన నేడు వసంతనగర్ గా పిలువ బడుచున్న కాలనీని ప్రశాంతమైన, అహ్లాదకరమైన వాతావరణంతో సుందరమైన కాలనీగా తీర్చి దిద్దారు.
నాగేశ్వరరావు నాగమల్లేశ్వరి దంపతుల సంతానం శ్రీపతిరావు, శ్రీరామచంద్.
ప్రధమ కుమార్డు శ్రీపతిరావు నిజాంబాద్ జిల్లా, బోధన్ కు చెందిన రెడ్డిమాసు యోగయ్య, రాఘవమ్మ దంపతుల ద్వితీయ సంతానం మమతతో వివాహం 02.03.2001న జరిగింది. శ్రీపతిరావు సి.ఎ. పూర్తి చేసారు.శ్రీపతిరావు, మమత దంపతులు సాప్టువేరు రంగం నందు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడినారు.ఈ దంపతులుకు ఒక కుమార్డు అనిష్.
ద్వితీయ కుమార్డు శ్రీరామచంద్ హైదరాబాదుకు చెందిన పోతరాజు శివరామకృష్ణయ్య, శివకుమారి దంపతుల ప్రధమ కుమార్తె శ్రావణిని 08.06.2003న వివామాడాడు. శ్రీరామచంద్, శ్రావణిలు కొంతకాలం అమెరికాలో సాప్టువేర్ రంగం నందు పని చేసారు.ఈ దంపతులుకు ఇద్దరు కుమారులు. శ్రీవిదురిత్విక్, శ్రీవిశ్వ. వీరిని స్వదేశంలో చదివించాలనే ఆశయంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. హైదరాబాదులో స్ధిరనివాసం ఉంటూ లోగడ పనిచేసిన సాప్టువేర్ కంపెనిలోనే పనిచేయుచున్నారు.
రామారావు రిటైర్డు విస్తరణాధికారి, (పి.ఆర్. & ఆర్.డి)
ఐదవ సంతానం రామారావు నరసరావుపేటకు చెందిన కొరిటాల వేంకటరత్తయ్య, రామకోటమ్మ దంపతుల తృతీయ కుమార్తె రమాదేవిని 14.03.1971 న వివాహమాడారు.
రామారావు పొనుగుపాడు గ్రామపంచాయితి నందు 1969లో పుల్ టైం ఫోష్టులో మొదటి ఉద్యోగిగా చేరారు. 1984 వరకు స్వగ్రామం పొనుగుపాడులో పని చేసారు.1984 నుండి వివిధ హోదాలలో కారెంపూడి, పొన్నెకల్లు, మేడికొండూరు, పసుమర్రు గ్రామ పంచాయితీల నందు పని చేసారు.విస్తరణాధికారి (పి.అర్ & అర్.డి)గా పదోన్నతి పొంది కారెంపూడి మండల పరిషత్ లో చేరారు.రామారావు నలుబై సంవత్సరంలు ప్రభుత్వ సర్వీసు చేసారు. 31.08.2009 న కారెంపూడి మండలపరిషత్ లో పదవీ విరమణ చేసారు.
రామారావుకు ఇరువురు కుమార్తెలు.మాదవి, అరుణ.పదవీ విరమణ తదుపరి హైదరాబాదు కు మకాం మార్చారు.
ప్రధమ కుమార్తె మాధవి వివాహం నాదెండ్డ్ల గ్రామానికి చెందిన కాట్రగడ్డ నారాయణ, ఆదెమ్మ దంపతుల తృతీయ కుమార్డు పరమేశ్వరరావు తో జరిగింది.మాధవి, పరమేశ్వరరావు దంపతులు వ్యాపారరీత్యా హైదరాబాదులో స్థిరపడినారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకటసందీప్, శ్రీదీప్.
ద్వితీయ కుమార్తె అరుణ వివాహం నాదెండ్ల మండలం, సాతులూరుకు చెందిన మందపాటి గరటయ్య, తిరుపతమ్మ దంపతుల ప్రధమ కుమార్డు శ్రీనివాసరావు తో ది.12.04.1996 న జరిగింది.ఈ దంపతులుకు ఇద్దరు కుమార్తెలు. శ్రీవైష్ణవి, శ్రీశరణ్య. అరుణ, శ్రీనివాసరావు దంపతులు ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడినారు.