చోళేశ్వరాలయం (పాత శివాలయం)
మనకు ఫొటోలో కనిపించే ఆలయంనకు పూర్వం ముందు ఈ ప్రదేశంలో చోళ రాజులు నిర్మించిన దేవాలయం ఉండేది.ఆ దేవాలయం ఇప్పటికి 900 సంవత్సరంల క్రిందట నిర్మించినట్లు తెలుస్తుంది. పురాతనమైన ఈఅలయంను కుళోత్తంగ చోళ మహారాజు నిర్మించినందున వాడుకలో “చోళేశ్వర దేవాలయం” అని పిలుస్తారు.పురాతనమైన ఆలయమైనందున “పాత శివాలయం” అని కూడా అంటారు. కుళోత్తంగ చోళ మహారాజు 12వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో గ్రామానికి పశ్చిమ వైపు ఆలయం కట్టించి, రామేశ్వరుడనే అనే పేరుతో శాలివాహనశకం ౧0౩౯ (1117) లో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా గుంటూరు జిల్లా గ్రామ కైఫియ్యత్తులు 4 వ భాగం పేజి.నెం.192 ప్రకారం తెలుస్తుంది. కాలాంతరం లో అలయం శిథిలమై శివలింగం, నంది మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తుంది.1968 సంవత్సరంలో జీర్ణోద్దరణ జరుగు వరకు శివలింగం, నంది మాత్రమే ఉన్నవి.
కైఫియ్యత్తులు 4వభాగం పేజి.నెం.192రులింకు
కైఫియ్యత్తులు 4వభాగం పేజి.నెం.192రు (Click Here)
తరవాత కాలంలో పడమర బజారుకు చెందిన కీ.శే.కట్టా సుబ్బయ్య, కీ.శే.వంకాయలపాటి రామయ్య, కీ.శే.బొడ్డు రోశయ్య, కీ.శే. మానుకొండ వెంకటేశ్వర్లు, కీ.శే.యర్రం వెంటేశ్వర్లు, ముఖ్యంగా పడమర బజారుకు చెందిన వ్యక్తి కాకపోయినప్పటికి కీ.శే.గద్దే పేరయ్య, శ్రీగంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయ పూజారి కీ.శే.కాకుమాను శేషయ్య తదితరుల పట్టుదలతో, గ్రామస్థుల అందరి సహకారంతో ఆలయ జీర్ణోద్ధరణ గావించారు.
ప్రస్తుత దేవాలయం
ఈ ఆలయంలో పంచాయతన విగ్రహాలు (పంచభూతాలకు ప్రతీకగా భావించే) నైరుతిన విఘ్నేశ్వరుడు, వాయువ్యం పార్వతీదేవి అమ్మవారు, ఈశాన్యం శ్రీరాముడు, సీతాదేవి, ఆగ్నేయం సూర్యుడు, మధ్యలో శ్రీరామలింగేశ్వరుడు (చోళేశ్వరస్వామి) విగ్రహాలతో (సాలగ్రాములు)తో ప్రతిష్ఠ చేయబడినవి.ప్రధాన ఆలయం నకు ఎదురుగా నంది విగ్రహం, ఎడమ వైపు ఆంజనేయస్వామి, కుడివైపున పార్వతిదేవి ఉపాలయంలు నిర్మితమైఉన్నవి.
ఆలయంలో సాలగ్రాములు
చోళులు ప్రతిష్టించిన శివలింగం (సాలగ్రాము) తరువాత ప్రతిష్ఠించిన పార్వతీదేవి విగ్రహం.
జీర్ణోద్ధరణ కార్యక్రమం పూర్తి చేసి, స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ ప్లవంగ నామ సంవత్సర వైశాఖ మాస బహుళ షష్ఠి సప్తమి నాడు (18.05.1968)న ధ్వజస్తంబం ప్రతిష్ఠ కార్యక్రమం, విశేష పూజలు, కుంభాబిషేకం, స్వామి వారి మొదటి కళ్యాణం జరిగినవి.
వెంకటేశ్వర్లు,రాజ్యలక్ష్మమ్మ దంపతులు
వీరు నిస్సంతు దంపతులు.
జీర్ణోద్ధరణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలుకు యాగ కర్తలుగా పడమర బజారుకు చెందిన కీ.శే.మానుకొండ వెంకటేశ్వర్లు,రాజ్యలక్ష్మమ్మ దంపతులు నిర్వహించారు.
ఆరోజు నుండి స్వామి వారికి నిత్య దీప, ధూప, నైవేద్యం, అర్చకత్వం కార్యక్రమాలు నిరంతరంగా జరుగుటకు కీ.శే.మానుకొండ వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మమ్మ దంపతులు డి.నెం.892 రు లో య.01.65 శెంట్లు భూమిని ఆలయంనకు కైంకర్యం చేసారు.
ఆలయ మొదటి పూజారి
జీర్ణోద్ధరణ కార్యక్రమం జరిగిన అప్పటినుండి కీ.శే.కాకుమాను శేషయ్య ఈ ఆలయం మొదటి పూజారిగా 1978 వరకు పనిచేసారు.
ఆయనకు వృద్దాప్యదశ చేరువైనందున ఆ తరువాత వారి మనమడు కళాధరశర్మ దీక్షితులు (నాగేశ్వరరావు కుమార్డు) ఆధ్వర్యంలో కుమారుడు ఆంజనేయులు ఒక సంవత్సరం,అలాగే తరువాత సంవత్సరం రెండవ కుమార్డు సోమ సుందరం దీక్షితులు ఆధ్వర్యంలో మనవళ్లు కృష్ణ చైతన్య శర్మ,సాయికృష్ణ శర్మ ఒక సంవత్సరం వంతులు వారిగా అప్పటి నుండి పూజారులుగా పని చేయుచున్నారు.
ప్రస్తుత పూజారులు
జీర్ణోద్ధరణ జరిగిన మొదటి కళ్యాణం (1968) నుండి ఇప్పటివరకు నలుబది తొమ్మిది కళ్యాణ వేడుకలు జరిగినవి. యాబైవ కళ్యాణం స్వస్తిశ్రీ చాంద్ర మానేన శ్రీ హేవిలంబి నామ సంవత్సర వైశాఖ మాస బహుళ షష్ఠి సప్తమి నాడు (18.05.2017) న జరిగింది.యాబైవ కళ్యాణం యాగ కర్తలుగా కృష్ణ చైతన్య శర్మ,సాయికృష్ణ శర్మనిర్వహించారు. ప్రస్తుతం పడమర బజారు నివాసులైన వంకాయలపాటి ఆంజనేయులు, సాంబశివరావు, వెంకట్రావు, యర్రం కోటేశ్వరరావు, యర్రం శివబాబు, నిడమానూరి జగదీష్ మరికొంత మంది పెద్దలు పర్వేక్షణలో దేవాలయ నిర్వహణ కార్యక్రమాలు జరుగుచున్నవి.
విశేషం: జీర్ణోద్ధరణ జగిగిన తరువాత మొదటి కళ్యాణం (1968) యాబై సంవత్సరాల క్రిందట ఏ తేదిన జరిగిందో మరలా తిధుల ప్రకారం ఆదే తేధి 18.05.2017 న రావటం చాలా విశేషం.